![The mother killed her daughters and then committed suicide - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/30/cause.jpg.webp?itok=_qxj5Ojw)
ఉరికి వేలాడుతున్న తల్లీ పిల్లలు
అనంతపురం: లేపాక్షి మండలం నాయనపల్లిలో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కల్పన అనే మహిళ తన ఇద్దరు ఆడపిల్లలను ఉరేసి చంపింది. ఆ తర్వాత తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో తల్లి కల్పన, పిల్లలు మేఘన(6) యశస్విణి(3) మృతిచెందారు. భర్త వీరభద్రప్ప వేధింపులే కారణమని బంధువుల ఆరోపిస్తున్నారు. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారని, అదనపు కట్నం కావాలని కొంతకాలంగా భర్త చిత్రహింసలకు గురి చేస్తున్నారని బాధితుల బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment