కేంద్ర ప్రభుత్వం నిధులతో లేపాక్షి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం నిధులతో లేపాక్షి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆదివారం అనంతపురం జిల్లా హిందూపురంలో లేపాక్షి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కేంద్ర మంత్రి విచ్చేశారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... మతమనేది వ్యక్తిగతమని, దుర్గాదేవిని అవమానించడం వంటి ఘటనలు యూనివర్సిటీల్లో చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. దేశవ్యాప్తంగా 760 యూనివర్సిటీలు ఉంటే కేవలం రెండు యూనివర్సిటీల్లో మాత్రమే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.