
గజాగుండం పరిశీలన
లేపాక్షి : లేపాక్షి ఆలయానికి పడమటి భాగంలో ఉన్న గజాగుండం (కోనేరు)ను గురువారం సాయంత్రం దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజినీర్ రఘురామయ్య, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పుల్లయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సతీష్‌కుమార్ పరిశీలించారు. గజాగుండం (కోనేరు)ను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నుంచి గతేడాది దేవాదాయ శాఖ సీజీఎఫ్ కింద రూ.30 లక్షల నిధులు మంజూరు అయ్యాయన్నారు.
అయితే నంది ఉత్సవాల సందర్భంగా రూ.10.02 లక్షల నిధులు ఖర్చు చేశారని చెప్పారు. మిగిలిన రూ. 20 లక్షలతో కోనేరు అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. వారి వెంట ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ఆలయ గుమాస్తా నరసింహమూర్తి ఉన్నారు.