నిలువునా మోసపోయాం
– ‘గడపగడపకూ వైఎస్సార్’లో మహిళల ఆవేదన
లేపాక్షి : మహిళలు బ్యాంకుల్లో తీసుకున్న డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తామని ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలు నమ్మి నిలువునా మోసపోయామని హిందూపురం నియోజకవర్గ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు నిర్వహిస్తున్న గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. శనివారం లేపాక్షి మండలం గోపిందేవరపల్లి, శిరివరం, తిరుమలదేవరపల్లి గ్రామాల్లో గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏ మేరకు నెరవేర్చారని ప్రజలను అడిగారు. ఈప్రభుత్వానికి ఎన్ని మార్కులు వేస్తారో మీరే (ప్రజలు) నిర్ణయించాలని ఆయన కోరారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు తమ సమస్యల గురించి నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయారు. కంచిసముద్రం సిండికే ట్ బ్యాంకులో తనకు తెలియకుండానే ఓ వ్యక్తి రూ.23 వేలు అప్పు చేశాడని గోపిందేవరపల్లికి చెందిన గంగమ్మ వాపోయింది. తనకు ఆ బ్యాంకులో రూ.30 వేలు మాత్రమే అప్పు ఉందని చెప్పింది.
కార్యక్రమంలో మండల కన్వీనర్ నారాయణస్వామి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు నారాయణస్వామి, జిల్లా కార్యదర్శి ఫజులూ రెహమాన్, కౌన్సిలర్లు నాగభూషణరెడ్డి, రజిని, పట్టణ మíß ళ అధ్యక్షురాలు నాగమణి, మండల నాయకులు ప్రభాకర్, బాలు, సిరాజ్, శంకర్‌రెడ్డి, గోపికృష్ణ, కూతుల శీన, నరసింహప్ప, స్థానిక నాయకులు కిష్టప్ప, తిప్పన్న, హనుమప్ప, సుమాన్, గోపాల్‌రెడ్డి, మూర్తి, జయరామిరెడ్డి, మారుతీ, ఇంతియాజ్, బషీర్, శ్రీరామిరెడ్డి, వన్నూరప్ప తదితరులు పాల్గొన్నారు.
రూ.5 వేలు ఆర్థికసాయం
లేపాక్షి మండలంలోని శిరివరం గ్రామానికి చెందిన సాలమ్మ అనే నిరుపేద మహిళకు హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త నవీన్‌నిశ్చల్ రూ.5 వేలు ఆర్థికసాయం అందజేశారు. సాలమ్మ నివాసం ఉండడానికి ఇల్లు లేదని, సిమెంటు రేకులు వేసుకుని జీవనం గడపాలన్నా స్థోమత లేదని ఈనెల 3న శిరివరం గ్రామంలో చేపట్టిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో నవీన్‌నిశ్చల్ ఎదుట వాపోయింది. ఆమె పరిస్థితి చూసి చలించిన నవీన్‌నిశ్చల్ శనివారం తనవంతు సాయంగా రూ.5 వేలు నగదు అందజేశారు. అదేవిధంగా శిరివరం గ్రామానికి చెందిన వృద్ధురాలు రామక్కకు స్టీల్ ఊతకర్రలను అందజేశారు.