
వానరాల కేరింత..
లేపాక్షి (హిందూపురం) : నిప్పుల కుంపటిని తలపించే ఎండల నుంచి ఉపశమనం పొందాలంటే శరీరం చల్లబడాలి. అందుకు ఏకైక మార్గం ఈత. మనుషులే కాదు వానరాలు సైతం తామేమీ తక్కువ కాదన్నట్టు నీటిలో ఈత కొడుతూ సేదదీరుతున్నాయి. లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ముందుభాగంలోని పార్కులో పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన నీటి కొలనులో దాదాపు 15 వానరాలు మనుషుల మాదిరే ఈతలో రకరకాల విన్యాసాలు చేస్తున్నాయి. వానరాల కేరింతలు చూసి ఆశ్చర్యపోవడం జనం వంతైంది.