
అప్పట్లోనే గ్రీవెన్స్ సెల్
లేపాక్షి (హిందూపురం) : ప్రజలు తమ సమస్యలు, విన్నపాలు తెలియజేసుకునేందుకు మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రం స్థాయిలో ప్రతి సోమవారం ‘మీ కోసం’ కార్యక్రమం జరుగుతున్నట్టే విజయనగర రాజుల పాలనలో కూడా ఇటువంటిదే నిర్వహించేవారట. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో సీతమ్మ పాదానికి దక్షిణ భాగంలో ‘సోమవారం మండపం’ ఉంది. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఆనాటికే ఒక వేదికను ఏర్పాటు చేశారట. ప్రతి సోమవారం రాజు, మంత్రులు, భటులు సమావేశమయ్యేవారట. ఈ సమావేశంలో ప్రజల నుంచి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వారట. రాజు దృష్టికి వెళ్లిన సమస్య మరుసటి వారంలోగా పరిష్కరించే వారని చరిత్రకారులు తెలియజేస్తున్నారు.