లేపాక్షి : ప్రసిద్ధి చెందిన లేపాక్షి దేవాలయంలో అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం దేవాలయంలో అధికారులు, పాలకులు, అర్చకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఒక్కో పంచాయతీ వారు పూజలు నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు.
పూజలు నిర్వహించడానికి మండల వ్యాప్తంగా నాలుగు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే సొంత నిధులు రూ.30 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, జెyీ ్పటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించాలి
Published Thu, Sep 15 2016 10:59 PM | Last Updated on Mon, Sep 4 2017 1:37 PM
Advertisement
Advertisement