october 1st
-
1న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల కార్యవర్గం ఎన్నిక
అనంతపురం ఎడ్యుకేషన్ : సర్వశిక్ష అభియాన్ పరిధిలో పని చేస్తున్న పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ల సంఘం జిల్లా కార్యవర్గాన్ని అక్టోబర్ 1న ఎన్నుకోనున్నట్లు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సాజిద్‌బాషా, షేక్ హాజీమలంగ్ ఒక ప్రకనటలో తెలిపారు. స్థానిక కొత్తూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమావేశం ఉంటుందని, సంఘం రాష్ట్ర నాయకులు హాజరుకానున్నారని వెల్లడించారు. -
1న అనంతకు హైకోర్టు న్యాయమూర్తులు
ఎస్కేయూ : శ్రీ విజయనగర న్యాయ కళాశాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా అక్టోబరు 1 వ తేదీన నిర్వహిస్తున్న న్యాయశాస్త్ర ఓరియంటేషన్ ప్రోగాంలో విధానపరమైన చట్టం, భారతీయ సాక్ష్యాధారాల చట్టాలు –వాటి ఆచరణలో విధానాలు అనే అంశం పై సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ విజయనగర న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రాచార్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవిద్య అందించటంలోను, ఉత్తమ న్యాయసేవలందించటానికి న్యాయశాస్త్ర విద్యార్థులు,న్యాయవాదులలో వృత్తినైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ సదస్సు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ౖహె కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్,జస్టిస్ ఎ.వి. శేషశాయిలు ముఖ్య అతిథులు హాజరవుతారన్నారు. అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎ.నరసింహారెడ్డి, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యులు వై.ఆర్.సదాశివరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
అక్టోబర్ 1 నుంచి ‘ఓపెన్’ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్న 2 గంటల నుంచి 5 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఇంటర్ పరీక్షలకు 1371 మంది, 10వ తరగతికి 1912 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. -
శరన్నవరాత్రులు వైభవంగా నిర్వహించాలి
లేపాక్షి : ప్రసిద్ధి చెందిన లేపాక్షి దేవాలయంలో అక్టోబర్ 1 నుంచి 12వ తేదీ వరకు జరిగే శరన్నవరాత్రుల ఉత్సవాలను వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే బాలకష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం దేవాలయంలో అధికారులు, పాలకులు, అర్చకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు ఒక్కో పంచాయతీ వారు పూజలు నిర్వహించడానికి ముందుకు రావాలన్నారు. పూజలు నిర్వహించడానికి మండల వ్యాప్తంగా నాలుగు ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా శరన్నవరాత్రుల ఉత్సవాల నిర్వహణకు ఎమ్మెల్యే సొంత నిధులు రూ.30 వేలు ఇస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసులు, తహశీల్దార్ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, జెyీ ్పటీసీ సభ్యుడు ఆదినారాయణరెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ కిష్టప్ప, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.