ఎస్కేయూ : శ్రీ విజయనగర న్యాయ కళాశాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా అక్టోబరు 1 వ తేదీన నిర్వహిస్తున్న న్యాయశాస్త్ర ఓరియంటేషన్ ప్రోగాంలో విధానపరమైన చట్టం, భారతీయ సాక్ష్యాధారాల చట్టాలు –వాటి ఆచరణలో విధానాలు అనే అంశం పై సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ విజయనగర న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రాచార్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవిద్య అందించటంలోను, ఉత్తమ న్యాయసేవలందించటానికి న్యాయశాస్త్ర విద్యార్థులు,న్యాయవాదులలో వృత్తినైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ సదస్సు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ౖహె కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్,జస్టిస్ ఎ.వి. శేషశాయిలు ముఖ్య అతిథులు హాజరవుతారన్నారు. అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎ.నరసింహారెడ్డి, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యులు వై.ఆర్.సదాశివరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.
1న అనంతకు హైకోర్టు న్యాయమూర్తులు
Published Wed, Sep 28 2016 11:29 PM | Last Updated on Fri, Aug 31 2018 9:02 PM
Advertisement