comes anantapur
-
నేడు నగరానికి సుద్దాల అశోక్‌తేజ
అనంతపురం కల్చరల్ : ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్‌తేజ బుధవారం నగరానికి రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరిగే ‘ శ్రమకావ్యం’ గేయ రూపకాన్ని స్వయంగా ఆలపిస్తారని నిర్వాహకులు చంద్రశేఖర్ తెలిపారు. అనంత కవులు, రచయితలు ముఖ్య అతిథులుగా విచ్చేసే కార్యక్రమానికి సాహితీ అభిమానులు విరివిగా విచ్చేయాలని కోరారు. -
నేడు జిల్లాకు మంత్రి కొల్లు రవీంద్ర
అనంతపురం సప్తగిరి సర్కిల్ : నేడు జిల్లాకు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర రానున్నారని జిల్లా అధికార యంత్రాంగం పెర్కొంది. గన్నవరం నుంచి బెంగుళూరుకు విమానంలో రానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పరిగిలో జరిగే జన్మభూమి మా ఊరులో పాల్గొంటారు. మధ్యాహ్నం కళ్యాణదుర్గంలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారన్నారు. అనంతరం రోడ్డు మార్గంలో బెంగుళూరుకు బయలుదేరి వెళ్తారన్నారు. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్ : రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం రాత్రి అనంతపురం వస్తున్నారు. రాత్రికి ఇక్కడే ఉండి గురువారం స్థానికంగా జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. -
నేడు అనంతకు కొణిజేటి రోశయ్య
అనంతపురం కల్చరల్ : తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం జిల్లాకు రానున్నట్లు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు అనంతకు చేరుకోనున్న ఆయన, రోడ్లు, భవనాల అతిథి గహంలో బస చేస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వాసవీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సాయంత్రం 5.30 గంటల నుంచి స్థానిక నేషనల్ సాయిబాబా కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 6.30 గంటలకు టవర్‌క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, కొత్తూరు అమ్మవారి శాలలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. -
1న అనంతకు హైకోర్టు న్యాయమూర్తులు
ఎస్కేయూ : శ్రీ విజయనగర న్యాయ కళాశాల రజతోత్సవ వేడుకల్లో భాగంగా అక్టోబరు 1 వ తేదీన నిర్వహిస్తున్న న్యాయశాస్త్ర ఓరియంటేషన్ ప్రోగాంలో విధానపరమైన చట్టం, భారతీయ సాక్ష్యాధారాల చట్టాలు –వాటి ఆచరణలో విధానాలు అనే అంశం పై సదస్సు నిర్వహిస్తున్నట్లు శ్రీ విజయనగర న్యాయ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రాఘవేంద్రాచార్ ఒక ప్రకటనలో తెలిపారు. న్యాయవిద్య అందించటంలోను, ఉత్తమ న్యాయసేవలందించటానికి న్యాయశాస్త్ర విద్యార్థులు,న్యాయవాదులలో వృత్తినైపుణ్యం పెంచే లక్ష్యంతో ఈ సదస్సు ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ౖహె కోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్,జస్టిస్ ఎ.వి. శేషశాయిలు ముఖ్య అతిథులు హాజరవుతారన్నారు. అలాగే రాష్ట్ర బార్ కౌన్సిల్ అధ్యక్షులు ఎ.నరసింహారెడ్డి, జాతీయ బార్ కౌన్సిల్ సభ్యులు వై.ఆర్.సదాశివరెడ్డి, శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కె.రాజగోపాల్ తదితరులు పాల్గొంటారని తెలిపారు. -
నేడు మంత్రి కొల్లు రవీంద్ర రాక
అనంతపురం అర్బన్ : బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం జిల్లాకు విచ్చేస్తున్నారు. ఉదయం 6 గంటలకు అనంతపురం చేరుకుని 10.30 వరకు ఆర్అండ్బి అతిథి గహంలో బసచేస్తారు. అనంతరం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగే జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. 1.15 గంటలకు రోడ్డు మార్గంలో రాయదుర్గం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన నీరు– చెట్టు కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం ఆరు గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరి వెళతారు. -
కలెక్టర్ వచ్చేశారు!
అనంతపురం అర్బన్: ఈ–గవర్ననెన్స్, ప్రభుత్వ సర్వీసులపై కెనడాలో శిక్షణ కోసం వెళ్లిన కలెక్టర్ కోన శశిధర్ తిరిగి వచ్చేశారు. మంగళవారం ఆయన విధులకు హాజరయ్యారు. పది రోజుల శిక్షణలో భాగంగా ఈ నెల 19న ఆయన కెనడాకు వెళ్లిన సంగతి తెలిసిందే. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని జిల్లాకు చేరుకున్నారు. ఆ తరువాత వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనలో పాల్గొన్నారు.