తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం జిల్లాకు రానున్నట్లు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు.
అనంతపురం కల్చరల్ : తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య గురువారం జిల్లాకు రానున్నట్లు జిల్లా పౌరసంబంధాల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 6 గంటలకు అనంతకు చేరుకోనున్న ఆయన, రోడ్లు, భవనాల అతిథి గహంలో బస చేస్తారు. ఉదయం 10 గంటలకు శ్రీ వాసవీ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
సాయంత్రం 5.30 గంటల నుంచి స్థానిక నేషనల్ సాయిబాబా కళాశాలలోని ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. 6.30 గంటలకు టవర్‌క్లాక్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించి, కొత్తూరు అమ్మవారి శాలలో జరిగే ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.