
దీపావళి మేళా
లేపాక్షి ఏర్పాటు చేసిన ‘దివాలీ మేళా’ విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ ఎక్స్‌పోర్ట్ ఓరియంటెడ్ షోరూమ్‌లో బుధవారం ప్రారంభమైన ఈ మేళాలో.. మహిళలు మెచ్చే జ్యువెలరీ, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌లూమ్, ఇమిటేషన్ గోల్డ్ వంటి వెరైటీలెన్నో ఉన్నాయి. గద్వాల్, మంగళగిరి, వెంకటగిరి, కలంకారి, ప్రింటెడ్ కాటన్ చీరలు ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 22 వరకు ప్రదర్శన ఉంటుంది.
- ముషీరాబాద్