
నరసింహన్
అనంతపురం: గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం, జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినట్లు తెలిపారు.
ఆవిర్భావ దినోత్సవ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఏపి రాజధాని ఏర్పాటులో అవరోధాలున్నాయని, వాటిని అధిగమిస్తామని చెప్పారు. లేపాక్షిలో వినాయక విగ్రహం చోరీపై దర్యాప్తు కొనసాగుతోందని గవర్నర్ చెప్పారు.