పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు | lepakshi tourism place | Sakshi
Sakshi News home page

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు

Dec 6 2016 11:25 PM | Updated on Sep 4 2017 10:04 PM

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు

పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కసరత్తు

లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఏపీ టూరిజం శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ గోపాల్‌ వెల్లడించారు.

లేపాక్షి : లేపాక్షిని పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఏపీ టూరిజం శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ గోపాల్‌ వెల్లడించారు. ఆయన లేపాక్షిని మంగళవారం సందర్శించారు. పర్యాటక రంగంగా తీర్చిదిద్దడానికి ఆలయం వెనుక భాగంలోని గజాగుండం కోనేరును పరిశీలించారు. అక్కడి మురుగునీరు తొలగించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి అవకాశంపై ఆరా తీశారు. అనంతరం విరుపణ్ణ, వీరణ్ణ పార్కులు, ఆలయానికి కిలో మీటరు దూరంలోని జఠాయువు మోక్షఘాట్‌ సందర్శించారు.

అక్కడ ఎలాంటి వసతులు కల్పిస్తే పర్యాటకులను ఆకర్షిస్తారనే కోణంపై ఆరా తీశారు. డివిజినల్‌ మేనేజర్‌ బాపూజీ, జిల్లా ఇన్‌చార్జ్‌ బాలభాస్కర్, ఈఈ ఈశ్వరయ్య, డీఈఈ కుమార్, ఏఈఈ నారాయణరావు, స్థానిక మేనేజర్‌ లక్ష్మణ్‌రావు, తహశీల్దార్‌ ఆనందకుమార్, ఎంపీపీ హనోక్, గ్రామసర్పంచ్‌ జయప్ప, ఎంపీటీసీ సభ్యులు చలపతి, చిన్న ఓబన్న ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement