nandi statue
-
నంది విగ్రహం ధ్వంసం కేసులో.. ముఠా గుట్టు రట్టు
వత్సవాయి/పెనుగంచిప్రోలు/నందిగామ: కృష్ణా జిల్లా వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలోని పార్వతీ సమేత కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో గతేడాది సెప్టెంబర్ 10న నంది విగ్రహం ధ్వంసం చేసిన కేసును పోలీసులు ఛేదించారు. గుప్త నిధుల కోసమే ఓ ముఠా ఈ విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తేల్చారు. ఇందుకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, డీఎస్పీ నాగేశ్వరరెడ్డిలతో కలిసి కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ కార్యాలయంలో రాష్ట్ర సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అవి.. ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయనే నమ్మకంతో ఏడుగురు సభ్యులు ముఠాగా ఏర్పడి రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని పురాతన ఆలయాల్లో రెక్కీ నిర్వహించారు. ఇదే క్రమంలో మక్కపేటలోని శివాలయంలో మొదటిసారి ప్రవేశించి నంది విగ్రహం చెవులు ధ్వంసం చేశారు. ఈ ఘటనతో అధికారులు అప్రమత్తమై సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అనంతరం.. విగ్రహం పొట్ట భాగంలో విలువైన వజ్రాలున్నాయన్న భావనతో రెండోసారి వచ్చిన ముఠా సభ్యులు గుడిలో పూజ చేయించుకుని వెళ్లిపోయారు. వీరి కదలికలు అనుమానాస్పదంగా ఉండడంతో అర్చకుడు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సీసీ ఫుటేజి పరిశీలించి విచారణ ప్రారంభించారు. చివరకు.. హైదరాబాద్‌కు చెందిన అనుగొండ్ల శ్రీనివాసరావు, ఇట్టబోయిన విజయ్, మదని రామకృష్ణ, వికారాబాద్ జిల్లాకు చెందిన చిట్యాల కృష్ణయ్య, గంపలగూడెంకు చెందిన అరిపిరాల వెంకటప్పయ్య శాస్త్రిలతోపాటు రంగురాళ్ల వ్యాపారులు నాగేశ్వరరావు, గోపాలరావులను శుక్రవారం అరెస్టుచేశారు. వారి వద్ద పలు ఆలయాల ఫొటోలు, వీడియోలతోపాటు విలువైన సమాచారాన్ని సేకరించారు. రెక్కీ నిర్వహించిన ఆలయాలు ఇవే.. ప్రకాశం జిల్లా పొదిలి శివాలయం, దర్శి సమీపంలోని దేకలకొండపై ఉన్న లక్ష్మీ నృసింహస్వామి ఆలయం, గిద్దలూరు మండలం గుడిమెట్లలోని ఆంజనేయస్వామి ఆలయం, యర్రగొండపాలెంలోని చెన్నకేశవస్వామి ఆలయం, గుంటూరు జిల్లా దుర్గి శివాలయం, వైఎస్సార్ జిల్లా కమలాపురంలోని ఆంజనేయస్వామి ఆలయం, నల్గొండ జిల్లా హాలియా పేరూరు గ్రామంలోని శివాలయం, వరంగల్ జిల్లా రంగసాయిపేటలోని రామాలయంలో గుప్త నిధుల కోసం రెక్కీ నిర్వహించినట్లు విచారణలో తేలిందని సిట్ డీఐజీ జీవీజీ అశోక్‌కుమార్ తెలిపారు. వీరితో పాటు రెండు రాష్ట్రాల్లో గుప్త నిధుల కోసం వేట సాగించే 25 ముఠాల్లోని సుమారు 70 మంది సభ్యులను గుర్తించామన్నారు. కాగా, కేసును ఛేదించేందుకు కీలక సమాచారం అందించిన మక్కపేట శివాలయ అర్చకుడు యుగంధర శర్మను సిట్ అధికారితోపాటు జిల్లా ఎస్పీ సత్కరించారు. అలాగే, కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన నందిగామ డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, పలువురు సిబ్బందిని రివార్డులతో సత్కరించారు. -
చిత్తూరు జిల్లాలో నంది విగ్రహం ధ్వంసం
గంగాధరనెల్లూరు/పెనుమూరు: చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు మండలం అగర మంగళంలోని శ్రీఅభయాంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో శివాలయం ఎదుట ఉన్న పురాతన నంది విగ్రహాన్ని శనివారం రాత్రి కొందరు దుండగులు ధ్వంసం చేశారు. ఆలయం వెనుకభాగం నుంచి ప్రహరీగోడ దూకి లోనికి ప్రవేశించిన దుండగులు నందిని పెకలించి గుడి వెనుకకు తీసుకెళ్లి పగులగొట్టినట్లు గ్రామస్తులు తెలిపారు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ కేసులో కొందరు టీడీపీ నాయకుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం, మత విద్వేషాలు రెచ్చ గొట్టడమే లక్ష్యంగా కొందరు పథకం ప్రకారం నంది విగ్రహాన్ని ధ్వంసం చేసినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ నేరుగా విచారణకు రంగంలోకి దిగారు. గంగాధరనెల్లూరు పోలీసు స్టేషన్లో ఆదివారం రాత్రి 3 గంటల పాటు 89 మంది అనుమానితులను విచారించారు. ఎస్పీతో పాటు విచారణలో ఉన్న చిత్తూరు ఎస్పీవో ఈశ్వర్‌రెడ్డి ఆదివారం రాత్రి 10 గంటలకు విలేకరులతో మాట్లాడుతూ నంది విగ్రహం ధ్వంసం కేసును మూడు బృందాల ద్వారా అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామని చెప్పారు. గత కొంత కాలంగా ప్రార్థన మందిరాలపై పథకం ప్రకారం కొందరు దాడులకు పాల్పడుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయని, ఆ కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని చెప్పారు. -
నంది ముక్కలైందా?
రామచంద్రపురం: పట్టణంలోని అగస్త్యేశ్వరస్వామివారి ఆలయంలోని గల పురాతన నంది చోరీ సంఘటన ఉత్కంఠను రేకెత్తిస్తోంది. గత నెల 23 అర్ధరాత్రి సమయం దాటాక అగస్త్యేశ్వర స్వామివారి ఆలయంలోని పురాతన నందిని కొంతమంది దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. చోరీ జరిగిన తొమ్మిది రోజులకు పోలీసులు కొంత మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని, అపహరణ చేసిన వారు దొరికారంటూ పట్టణంలో శుక్రవారం ఎక్కడ చూసినా చర్చగానే మారింది. పట్టణంలోని సీసీ కెమెరాల్లో దొరికిన ఆధారాలతో రామచంద్రపురం సీఐ పి.శివగణేష్, ఎస్సై లక్ష్మి నేతృత్వంలో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దేవదాయ శాఖకు చెందిన ఉద్యోగులతో పాటుగా హౌసింగ్ బోర్డుకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని కాకినాడలోని ఒక పోలీస్‌స్టేషన్‌లో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అపహరించిన వారు దొరికారని అనుకుంటుండగా అపహరణకు గురైన నంది ఆచూకీని పోలీసులు కనుగొనలేకపోయారనే విషయంతో భక్తులు అందోళనకు గురవుతున్నారు. సుమారుగా 12 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. నంది విగ్రహం అపహరణకు గురికావడం, గతంలో ఒక అర్చకుడు ఆత్మహత్య చేసుకుని పట్టణంలో మృతి చెందిన సంఘటనలతో అపచారం జరుగుతోందని బెంబేలెత్తిపోతున్నారు. నంది చోరీ సంఘటనలో కొంత మంది దొరికానే సమాచారంతో నంది కూడా దొరుకుతుందనే ఆశతో భక్తులున్నారు. కానీ నంది లేదనే సమాచారంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. దీనిపై రామచంద్రపురం సీఐ పి శివగణేష్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా కొంత మంది అనుమానితులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నామని, నంది చోరీని త్వరలోనే ఛేదిస్తామని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఖమ్మం జిల్లాకు చెందిన ఓ స్వామీజీ హస్తం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. విగ్రహం అపహరణలో గుమ్మళ్లదొడ్డికి లింకులు? గోకవరం (జగ్గంపేట): నంది విగ్రహం అపహరణ విషయంలో గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డికి చెందిన వ్యక్తి పాత్ర ఉందని తెలిసింది. ఈ ఘటనపై విచారణ నిర్వహిస్తున్న పోలీసులు శుక్రవారం గ్రామానికి వచ్చి ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈనెల 24న అపహరణకు గురైన టన్ను బరువు గల నంది విగ్రహాన్ని మినీ వ్యాన్‌లో గ్రామానికి తీసుకువచ్చి ప్రధాన రహదారి పక్కన ఐఓసీఎల్ టెర్మినల్ సమీపంలో పోలీసు రికార్డుల్లో ఉన్న ఓ వ్యక్తి ఇంట్లో ఉంచి వెల్డింగ్ మెషీన్ సహాయంతో పగలుగొట్టినట్టు తెలిసింది. పగలు, రాత్రి ఇంట్లోంచి శబ్ధాలు వస్తుండడంతో ప్రశ్నించిన వారికి ఇంట్లో గ్రానైట్ పనులు చేస్తున్నామని ఆ వ్యక్తి సమాధానం చెప్పినట్టు పలువురు చెబుతున్నారు. అయితే పోలీసులు వచ్చి విచారణ చేయడంతో విషయం గుప్పుమంది. ఈ సంఘటనతో గ్రామానికి, చుట్టు పక్కల గ్రామాలకు చెందిన ఇంకెవరైనా వ్యక్తులతో సంబంధం ఉందేమోనని పలువురు చర్చించుకున్నారు. -
లేపాక్షిలో సందడే సందడి
లేపాక్షి : లేపాక్షికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఆయా ఆలయాల్లో కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. ఏ మండపం చూసినా వందలాది మంది భక్తులు, యువకులు, విద్యార్థులతో నిండిపోయింది. ఏడు శిరస్సుల నాగేంద్రుని విగ్రహం, కల్యాణ మండపంలో పార్వతీ పరమేశ్వరులు, నాట్య మండపం, లతా మండపం, నంది విగ్రహం వద్ద పర్యాటకులు, భక్తులు ఫొటోలు తీయించుకోడానికి పోటీ పడ్డారు. -
శివ.. శివా..
జంగారెడ్డిగూడెం రూరల్/ జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆల యంలో నంది విగ్రహం గతనెల 21 చోరీకి గురికాగా ధ్వంసమై శనివారం జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురంలో రోడ్డు పక్కన పొదల్లో కనిపించింది. విగ్రహాన్ని పెకలించి పట్టుకెళ్లిన దుండగులు అక్కడి పొలాల్లో విగ్రహాన్ని పగులగొట్టి ధ్వంసం చేశారు. అయితే విగ్రహంలో అతి పురాతన వస్తువు ఏదైనా దొరుకుతుందని అనుకున్న దుండగులు ఈ పనిచేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం సీఐ జి.శ్రీనివాసయాదవ్, ఎస్సై ఎ.ఆనందరెడ్డి చేరుకుని ధ్వం సం చేసిన శకలాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
అయ్యో.. నందీశ్వరా..
జీవకళ కోల్పోతున్న నంది విగ్రహం మండపంపై కప్పు నిర్మించని అధికారులు నందీశ్వరుడిని కాపాడాలని భక్తుల వేడుకోలు వెంకటాపురం : ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. నందీశ్వరుడి విగ్రహం రోజురోజుకు జీవకళ కోల్పోతుంది. మండలంలోని పాలంపే ట శివారులో 1213లో కాకతీయులు రామప్ప ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా ఆల య గర్భగుడికి ఎదురుగా నంది మండపాన్ని ఏర్పాటు చేసి అందులో శివుడి వాహనమైన నందీశ్వరుడి విగ్రహాన్ని నెలకొల్పారు. అయితే కాలక్రమేణా నంది మండపం శిథిలావస్థకు చేరుకోవడంతో 1910లో నిజాం ప్రభుత్వం వి గ్రహాన్ని ప్రధాన ఆలయంలోకి మార్చి రామలింగేశ్వరస్వామికి ఎదురుగా ఏర్పాటు చేసిం ది. దీంతో ఆలయంలోనే భక్తులు 1988 వరకు నందీశ్వరుడిని దర్శించుకున్నారు. పాతస్థలంలో పునఃప్రతిష్ఠతకు కసరత్తు 1989లో నందీశ్వరుడి విగ్రహాన్ని తిరిగి పాత స్థలంలోనే పునఃప్రతిష్ఠించాలని పురావస్తుశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ మేరకు కాకతీయులు ఏర్పాటు చేసిన నంది మండపాన్ని తిరిగి పునరుద్ధరించేందుకు చర్య లు చేపట్టారు. ఇందులో భాగంగా పైకప్పునకు చెందిన శిల్పాలు పూర్తిగా ధ్వంసం కావడంతో అధికారులు వాటిని తొలగించారు. పైకప్పు లేకుండానే నంది మండపాన్ని 1989 డిసెంబర్ లో పునరుద్ధరించి నందీశ్వరుడిని అందులో పునప్రతిష్ఠించారు. నూతనంగా పైకప్పు నిర్మిం చేందుకు పురావస్తు అధికారులు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడే ప్రతిపాదనలు పంపారు. కేంద్రం నుంచి స్పందన కరువైందో.. ప్రతిపాదనలు పంపి పురావస్తుశాఖ అధికారులు చేతు లు దులుపుకున్నారో.. తెలియదు కానీ ఇప్పటివరకు పైకప్పు నిర్మాణం జరగలేదు. కళా సంపద కనుమరుగు 27 ఏళ్లుగా పై కప్పు నిర్మాణాన్ని పట్టించుకునే వారే కరువవడంతో నందీశ్వరుడు ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తున్నా డు. జిల్లాలోని అన్ని ఆలయాల్లోని నంది విగ్రహాల కంటే రామప్పలోని నందీశ్వరుడికి ప్రత్యేకత ఉంది. ఇక్కడి మండపం ముందుకు వెళ్లి నందీశ్వరుడిని ఎటు పక్క కు జరిగి చూసిన మనల్ని చూసినట్లుగానే కనిపిస్తుంది. శివుడి వాహనమైన నందీశ్వరుడు ఆయన ఆజ్ఞ వినగానే పరుగెత్తేందు కు సిద్ధంగా ఉన్నట్లు రెండు చెవులు వం చి, ఒక కాలును ముందుకు పెట్టి పిలుపుకోసం ఎదురుచూస్తున్నట్లుగా ఉంటుంది. ఇంతటి కళా వైభవం కలిగిన విగ్రహాన్ని కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడంతో శిల్ప సంపద కనుమరుగవుతున్నాయి. కేంద్ర పురావస్తుశాఖ అధికారు లు తక్షణమే నంది మండపంపై పైకప్పు నిర్మించాలని భకులు కోరుతున్నారు.