కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా | devotees flow in bukkarayasamudram | Sakshi
Sakshi News home page

కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా

Published Fri, Feb 10 2017 10:28 PM | Last Updated on Tue, Sep 5 2017 3:23 AM

కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా

కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా

బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండపై వెలసిన కొండమీదరాయుడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వేకువజామునే శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తీసుకొచ్చి రథంపై అధిష్టింపజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పురవీధుల్లో అశేష భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు.  
- బుక్కరాయసముద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement