
నృసింహాలయంలో పోటెత్తిన భక్తులు
కదిరి: ఖాద్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. శ్రావణమాసం.. వరుస సెలవులు.. పెళ్లిళ్ల సీజన్ కావడంతో భక్తులు కిక్కిరిసిపోయారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నారు. జిల్లా వాసులే కాకుండా కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.