టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు | TDP Leaders Corruption Has Been Exposed In Kadiri, Read Full Story For More Details | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల అవినీతి బాగోతం బట్టబయలు

Published Thu, Mar 6 2025 8:44 AM | Last Updated on Thu, Mar 6 2025 10:26 AM

Tdp Leaders Corruption Has Been Exposed In Kadiri

సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: కదిరిలో టీడీపీ నేతల అవినీతి బాగోతం బయటపడింది. ఒక్కో ఇంటి పట్టాకు రూ. 50 వేలు టీడీపీ నేతలు వసూలు చేస్తున్నారు. కదిరి ఆర్డీవో కార్యాలయం ఎదుట ఇంటి పట్టాలు ఇప్పిస్తామంటూ దందా సాగిస్తున్నారు. టీడీపీ నేతలు పబ్లిగ్గా డబ్బు వసూలు చేస్తున్నా కానీ రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదు. టీడీపీ నేతల వసూళ్ల పర్వం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

స్టోర్‌ డీలర్‌పై టీడీపీ నేత దాడి
మరోవైపు, టీడీపీ నేతల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతోంది. తాము హెచ్చరించినా రేషన్‌ దుకాణం వదులుకోలేదన్న కోపంతో టీడీపీ నాయకుడు అంజినప్ప దళిత సామాజిక వర్గానికి చెందిన ఓ రేషన్‌ షాపు డీలర్‌పై దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం హిందూపురం మండలం కగ్గల్లు గ్రామంలో చోటుచేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు... దళిత సామాజిక వర్గానికి చెందిన ఆదినారాయణ దివ్యాంగుడు. 2006 నుంచి గ్రామ (ఎఫ్‌ఫీ షాప్‌నంబర్‌ 1257060) డీలర్‌గా పనిచేçసూŠత్‌ జీవనం సాగిస్తున్నాడు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే డీలర్‌ షిప్‌ వదులుకోవాలని టీడీపీ నేతలు ఆదినారాయణను బెదిరించారు. దీని గురించి గ్రామ సర్పంచ్‌ హనుమంతు రాయప్పకు బాధితుడు చెప్పుకోగా.. సర్పంచ్‌ కూడా టీడీపీ నేతలకే వత్తాసు పలుకుతూ రేషన్‌ డీలర్‌ షిప్‌ వదులుకోవాలని బెదిరించాడు. దీంతో ఆదినారాయణ తప్పనిసరి పరిస్థితిలో కోర్టును ఆశ్రయించి డీలర్‌గా కొనసాగేలా అనుమతులు తెచ్చుకున్నాడు.

దీంతో రెవెన్యూ అధికారులు ఆదినారాయణ ఎఫ్‌సీ షాపునకు నెలసరి రేషన్‌ బియ్యం కోటాను మంజూరు చేశారు. ఈ క్రమంలో ఆదినారాయణ బుధవారం బియ్యం బస్తాలను లారీ నుంచి దించుకుంటుండగా.. టీడీపీ నాయకుడు అంజినప్ప అక్కడికి వచ్చి పరుష పదజాలంతో దూషించాడు. అంతేకాకుండా భౌతికదాడి చేయడంతో పాటు అందరి ముందు చెప్పుకాలితో తన్నాడు. తనకు కోర్టు అనుమతి ఉందని ఆదినారాయణ చెబుతున్నా ‘ప్రభుత్వం మాది... మాదే జరుగుతుంది... కోర్టు గీర్టు జాన్తా నై.. నీ ఇష్టం వచ్చిన వాడికి చెప్పుకో’’ అంటూ అందరి ముందు దుషించాడు. దీనిపై బాధితుడు బుధవారం హిందూపురం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంజినప్పపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.   

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement