
టీడీపీలో రెండు వర్గాల పోరు
లేపాక్షిలో ముదురుతున్న వివాదం
లేపాక్షి: జెడ్పీ నిధులు కాజేసేందుకు అధికార పార్టీ నాయకులు కన్నేశారు. గ్రామీణా ప్రాంతాల అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ ఆరు నెలల కిందట మండాలనికి జెడ్పీ నుంచి రూ. కోటి నిధులు మంజూరయ్యాయి. మొదటి విడతలో రూ.40 లక్షల నిధులతో పనులు చేసిన ఓ అధికార పార్టీ నాయకుడు నిధులు మంజూరు చేయించుకున్నాడు. రెండో విడతలో వచ్చిన రూ. 64 లక్షల జెడ్పీ నిధులు సైతం తనకే దక్కాలంటూ ఆయనతోపాటు ఆయన వర్గీయులు పంచాయతీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే అదే పార్టీకి చెందిన మరోవర్గం వారిని అడ్డుకుంటున్నారు. మండలంలోని కంచిసముద్రం పంచాయతీలో తెలుగుదేశం పార్టీలో రెండు వర్గాల మధ్య కొంతకాలంగా ఉన్న విబేధాలు భగ్గుమంటున్నాయి.
అధికార పార్టీకి చెందిన సర్పంచ్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడున్న రెండు వర్గాల నాయకులు సర్పంచ్‌ను డమ్మీ చేశారు. పంచాయతీకి మంజూరైన జిల్లా పరిషత్ నిధులను చేజిక్కించు కోవడానికి హిందూపురం పట్టణానికి చెందిన ఓ నాయకుడు స్థానిక టీడీపీ నాయకులతో కలిసి సర్పంచ్‌ను కాదని పనులు చేయడానికి అధికారులతో కుమ్మక్కై తీర్మాణాలు కూడా చేయించాడు. టీడీపీలో మరో వర్గం నాయకులు స్థానికంగా ఉండే నాయకులే పనులు చేయాలని, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వారు పనులు చేయడం వల్ల గ్రామాల్లో ఘర్షణలు, విభేదాలు చోటు చేసుకునే అవకాశం వుందని సర్పంచ్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో రెండు వర్గాల మద్య విబేధాలు తారస్థాయికి చేరుకున్నాయి.
పంచాయతీలో సమావేశం
కంచిసముద్రం పంచాయతీలో జెడ్పీ నిధులతో పనులు చేయడానికి శనివారం సమావేశం ఏర్పాటు చేసారు. వార్డు సభ్యులు అందరూ అత్యవసర సమావేశానికి హాజరు కావాలని పంచాయతీ కార్యదర్శి అజెండా కాపీలను జారీ చేశారు. అయితే 12 మంది వార్డు సభ్యుల్లో నలుగురు సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అజెండాలో ఉన్న అంశాలను కార్యదర్శి సభ్యులకు చదివి వినిపించకుండా సంతకాలు తీసుకున్నారు. వారు సంతకాలు చేసిన వెంటనే తీర్మానం చేశామనే సాకుతో వెళ్లి పోయారు.
దళిత సర్పంచ్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?
అధికార పార్టి నాయకుడు హిందూపురం పట్టణానికి చెందిన గ్రీన్ పార్కు నాగరాజుతో పాటు ఆయన అనుచరులు దళిత మహిళా సర్పంచ్ అయిన నన్ను ప్రతి విషయంలోను అగౌరవ పరుస్తున్నారు. పంచాయితీ నిధులు కేటాయింపుల్లో తన ప్రమేయం లేకుండా వ్యవహరిస్తున్నారు. దళిత మహిళ సర్పంచ్‌కు ఇచ్చే గౌరం ఇదేనా సర్పంచ్ గంగలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment