
సాక్షి, అనంతపురం: బుక్కరాయసముద్రంలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. పోలీసులమంటూ ఇద్దరు వ్యక్తులు ఓ ప్రేమికుల జంటపై బెదిరింపులకు పాల్పడుతూ అమానుషంగా ప్రవర్తించారు. వివరాల్లోకి వెళితే.. కానిస్టేబుల్ సురేంద్ర, తన స్నేహితుడు రాజశేఖర్‌తో కలిసి ఓ ప్రేమజంటను బెదిరించారు. అంతటితో ఆగకుండా ప్రియుడు నవీన్‌పై దాడి చేసి యువతిని అపహరించారు. దీంతో ప్రియుడు నవీన్ డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. మరోవైపు కానిస్టేబుల్ చెర నుంచి బయటపడ్డ బాధితురాలు తనను సురేంద్ర అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు పాల్పడ్డ నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. (విదేశీ యువతులతో మంత్రి బంధువు రేవ్ పార్టీ..)
చదవండి: ఇద్దరు బాలికలపై అత్యాచారం