ప్రకాష్‌ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు  | Woman Role Controversial In Dismissed Constable Prakash Case | Sakshi
Sakshi News home page

ప్రకాష్‌ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు 

Published Sat, Sep 10 2022 7:10 AM | Last Updated on Sat, Sep 10 2022 7:10 AM

Woman Role Controversial In Dismissed Constable Prakash Case - Sakshi

ఫైల్‌ఫోటో

అనంతపురం శ్రీకంఠంసర్కిల్‌: కానిస్టేబుల్‌ విధుల నుంచి తొలగించిన ప్రకాష్‌ వ్యవహారంలో మహిళ లక్ష్మి పాత్ర వివాదాస్పమవుతోంది. తనను ప్రకాష్‌ వేధించాడంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి మాట మార్చిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ విషయంమై శుక్రవారం ఆమె ఫిర్యాదు చేసేందుకు రావడం.. అదీ పోలీసులపైనే కేసు పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది.
చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో..

వివరాలు.. కానిస్టేబుల్‌ ప్రకాష్‌ తన భార్య లక్ష్మిని లోబరుచుకున్నాడంటూ గార్లదిన్నెకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన వారిద్దరూ కలిసుండడం చూసిన ఆయన అడ్డుకున్నట్లు తెలిసింది. గొడవ జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని మందలించి పంపారు.

అప్పటి నుంచి కనిపించని లక్ష్మి సంఘటన జరిగిన 9 రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమైంది. తనను అనంతపురం టూటౌన్‌ ఎస్‌ఐ రాంప్రసాద్, భర్త వేణుగోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు అంజినిరెడ్డి ఆ రోజు చంపాలని చూశారని ఆరోపించింది. స్థానికులు రావడంతో ఎస్‌ఐతో పాటు అందరూ పరారయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement