woman role
-
ప్రకాష్ వ్యవహారంలో ‘లక్ష్మీ’ పాత్ర వివాదాస్పదం.. ట్విస్టులే ట్విస్టులు
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: కానిస్టేబుల్ విధుల నుంచి తొలగించిన ప్రకాష్ వ్యవహారంలో మహిళ లక్ష్మి పాత్ర వివాదాస్పమవుతోంది. తనను ప్రకాష్ వేధించాడంటూ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసి మాట మార్చిన విషయం తెలిసిందే. తాజాగా తొమ్మిది రోజుల క్రితం జరిగిన ఓ విషయంమై శుక్రవారం ఆమె ఫిర్యాదు చేసేందుకు రావడం.. అదీ పోలీసులపైనే కేసు పెట్టడం మరోసారి చర్చనీయాంశమైంది. చదవండి: ఎస్సై వివాహేతర సంబంధం.. ప్రియురాలి కుమార్తెపై కన్నుపడటంతో.. వివరాలు.. కానిస్టేబుల్ ప్రకాష్ తన భార్య లక్ష్మిని లోబరుచుకున్నాడంటూ గార్లదిన్నెకు చెందిన వేణుగోపాల్‌రెడ్డి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే హౌసింగ్‌బోర్డులోని ఓ ఇంట్లో ఈ నెల ఒకటో తేదీన వారిద్దరూ కలిసుండడం చూసిన ఆయన అడ్డుకున్నట్లు తెలిసింది. గొడవ జరగడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాల వారిని మందలించి పంపారు. అప్పటి నుంచి కనిపించని లక్ష్మి సంఘటన జరిగిన 9 రోజుల అనంతరం శుక్రవారం సాయంత్రం మీడియా ముందు ప్రత్యక్షమైంది. తనను అనంతపురం టూటౌన్ ఎస్ఐ రాంప్రసాద్, భర్త వేణుగోపాల్‌రెడ్డి, నాగేంద్రరెడ్డితో పాటు అంజినిరెడ్డి ఆ రోజు చంపాలని చూశారని ఆరోపించింది. స్థానికులు రావడంతో ఎస్ఐతో పాటు అందరూ పరారయ్యారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. -
యువకుడి అదృశ్యం కేసులో వివాహితే కీలకం ?
► సాయి కోసం కొనసాగుతున్న గాలింపు, దర్యాప్తు ► అతని పాత కేసులపై పోలీసుల దృష్టి ► పోలీసులపై తీవ్ర ఒత్తిళ్లు ► సంబంధీకుల కదలికలపై పోలీసులు ఆరా వైఎస్సార్ జిల్లా: రాజంపేటలో అదృశ్యమైన గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు(19) కేసులో ఓ వివాహిత కీలకంగా మారింది. ఈ వివాహితతో సాయికి వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆ దిశగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. అలాగే ఆ యువకుడి అదృశ్యానికి కారణమైన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆ వివాహిత నుంచి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయితే ఈ వివాహిత గతంలో ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పట్లో ఆమె సన్నిహితులు కొందరు సర్దుబాటు చేసి పంపినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి. ఈ వివాహితకు పట్టణ పోలీసుస్టేషన్లో కొందరి ఖాకీలకు బాగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. అదృశ్యమైన ఆ యువకుడి సన్నిహితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సాయికి సంబంధించిన పాత కేసులపై కూడా పోలీసుల దృష్టి సారించడంతో కొంతమంది ఆందోళనకు గురవుతున్నారు. మిస్సింగ్ కేసు వ్యవహారంలో భారీ స్థాయిలో పోలీసులపై ఒత్తిళ్లు వస్తున్నాయని ఆరోపణలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనప్పటికి సాయి మిస్సింగ్ కేసు ఏవిధంగా చేధిస్తారన్నది వేచి చూడాల్సిందే. కేసు మిస్టరీని ఛేదించేందుకు చర్యలు గాదెరాజు సాయిప్రకాశ్‌రాజు మిస్సింగ్ కేసును ఛేదించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని పట్టణ సీఐ మోహనకృష్ణ తెలిపారు. సోమవారం రాత్రి తన చాంబరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈనెల 28న సాయి కనపించడంలేదని అతని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఆ దిశగా గాలింపు చర్యలు చేపడుతున్నామని వివరించారు. త్వరలో ఈ కేసును ఛేదిస్తామని వెల్లడించారు. -
నేనేనా...నమ్మలేకపోతున్నా...!
హైదరాబాద్ : 'పాండవులు పాండవులు తుమ్మెద'కు మంచి టాక్ వచ్చింది. ఇందులో నేను అమ్మాయి గెటప్ వేశా. అది చూస్తే నాకే ఆశ్చర్యమేసింది. ఆ క్యారెక్టర్ చేసింది నేనేనా అని నమ్మకం కలగటం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు హీరో మంచు మనోజ్. ఈ చిత్రంలో అతడు స్త్రీ పాత్ర పోషించాడు. ఆ లేడీ గెటప్‌కు మంచి స్పందన రావటంతో మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బేగంపేట బిగ్ ఎఫ్ఎం 92.7లో శుక్రవారం అతడు సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆర్జే జోసు ఈవెనింగ్ డ్రైవ్ టైమ్‌కు హోస్ట్‌గా నియమించారు. ‘గోల్మాల్-3’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. ‘పాండవులు పాండవులు తుమ్మెద’ డా. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కాంబినేషన్లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం . విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు. హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. రవీనా టండన్ ప్రధాన పాత్ర పోషించారు. -
మనోజ్ కాదు...మనోజ
‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో మూడు ప్రత్యేకతలున్నాయి. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్... ఇలా ‘మంచు’ కుటుంబం మొత్తం ఈ సినిమాలో నటిస్తోంది. ఒకప్పటి హిందీ కథానాయిక రవీనా టాండన్ పన్నెండేళ్ల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఇక మూడోప్రత్యేకత ఏంటంటే... మంచు మనోజ్ ఇందులో స్త్రీ పాత్ర పోషించారు. ఆ లేడీ గెటప్‌కు సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ‘‘నా తమ్ముడు మనోజ్ పోషించిన లేడీ కేరెక్టర్ ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని విష్ణు చెప్పారు. ఈ స్త్రీ పాత్ర పోషణ కోసం మనోజ్ చాలా కష్టపడ్డానని చెబుతున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘గోల్మాల్-3’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. వరుణ్‌సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు విష్ణు, మనోజ్ చెప్పారు.