నేనేనా...నమ్మలేకపోతున్నా...! | I can't believe it....says Manchu manoj | Sakshi
Sakshi News home page

నేనేనా...నమ్మలేకపోతున్నా...!

Published Sat, Feb 1 2014 8:46 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

నేనేనా...నమ్మలేకపోతున్నా...!

నేనేనా...నమ్మలేకపోతున్నా...!

హైదరాబాద్ : 'పాండవులు పాండవులు తుమ్మెద'కు మంచి టాక్ వచ్చింది. ఇందులో నేను అమ్మాయి గెటప్ వేశా. అది చూస్తే  నాకే ఆశ్చర్యమేసింది. ఆ క్యారెక్టర్ చేసింది నేనేనా అని నమ్మకం కలగటం లేదు' అంటూ చెప్పుకొచ్చాడు హీరో మంచు మనోజ్. ఈ చిత్రంలో అతడు స్త్రీ పాత్ర పోషించాడు.  ఆ లేడీ గెటప్‌కు మంచి స్పందన రావటంతో మనోజ్ సంతోషం వ్యక్తం చేశాడు. బేగంపేట బిగ్ ఎఫ్ఎం 92.7లో శుక్రవారం అతడు సందడి చేశాడు. ఈ సందర్భంగా ఆర్జే జోసు ఈవెనింగ్ డ్రైవ్ టైమ్కు హోస్ట్గా నియమించారు.

‘గోల్‌మాల్-3’కి రీమేక్‌గా రూపొందిన ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు.   ‘పాండవులు పాండవులు తుమ్మెద’  డా. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్, వరుణ్ సందేశ్, తనీష్ కాంబినేషన్‌లో లక్ష్మీప్రసన్న పిక్చర్స్ నిర్మించిన చిత్రం . విష్ణు, మనోజ్ సంయుక్తంగా నిర్మించారు.  హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. రవీనా టండన్ ప్రధాన పాత్ర పోషించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement