స్త్రీ వేషంలో మంచు మనోజ్!
స్త్రీ వేషంలో మంచు మనోజ్!
Published Thu, Dec 26 2013 12:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
డా.మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కలిసి నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’. రవీనా టాండన్, హన్సిక, ప్రణీత కథానాయికలు. వరుణ్‌సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ప్రత్యేక పాత్రధారులు. ‘లక్ష్యం’ఫేం శ్రీవాస్ దర్శకుడు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. పూర్తిస్థాయి వినోదాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో మోహన్‌బాబు ఓ వైవిధ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం.
మనోజ్ ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు. అయితే... ఈ సినిమాలోని ఓ సన్నివేశంలో మనోజ్ స్త్రీ వేషంలో కనిపించనుండటం విశేషం. టైటిల్‌కి, టైటిల్ లోగోకు మంచి ఆదరణ లభిస్తోందని చిత్రం యూనిట్ ఓ ప్రకటన ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఈ చిత్రంలోని మనోజ్ ఫస్ట్‌లుక్‌ని మీడియాకు విడుదల చేశారు. జనవరిలో ఈ చిత్రం పాటలను, అదే నెలలో సినిమాను విడుదల చేయనున్నారు.
Advertisement
Advertisement