మనోజ్ కాదు...మనోజ | Manchu Manoj to play a woman role in 'pandavulu pandavulu tummeda' | Sakshi
Sakshi News home page

మనోజ్ కాదు...మనోజ

Published Sun, Jan 19 2014 12:38 AM | Last Updated on Sat, Sep 2 2017 2:45 AM

మనోజ్ కాదు...మనోజ

మనోజ్ కాదు...మనోజ

 ‘పాండవులు పాండవులు తుమ్మెద’ చిత్రంలో మూడు ప్రత్యేకతలున్నాయి. మోహన్‌బాబు, విష్ణు, మనోజ్... ఇలా ‘మంచు’ కుటుంబం మొత్తం ఈ సినిమాలో నటిస్తోంది. ఒకప్పటి హిందీ కథానాయిక రవీనా టాండన్ పన్నెండేళ్ల తర్వాత చేస్తున్న తెలుగు సినిమా ఇదే. ఇక మూడోప్రత్యేకత ఏంటంటే... మంచు మనోజ్ ఇందులో స్త్రీ పాత్ర పోషించారు. 
 
 ఆ లేడీ గెటప్‌కు సంబంధించిన ఫొటోలను మీడియాకు విడుదల చేశారు. ‘‘నా తమ్ముడు మనోజ్ పోషించిన లేడీ కేరెక్టర్ ఈ చిత్రానికే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది’’ అని విష్ణు చెప్పారు. ఈ స్త్రీ పాత్ర పోషణ కోసం మనోజ్ చాలా కష్టపడ్డానని చెబుతున్నారు. హిందీలో ఘనవిజయం సాధించిన ‘గోల్‌మాల్-3’కి రీమేక్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘లక్ష్యం’ ఫేమ్ శ్రీవాస్ దర్శకుడు. వరుణ్‌సందేశ్, తనీష్, వెన్నెల కిషోర్ ఇందులో ముఖ్య పాత్రలు పోషించారు. హన్సిక, ప్రణీత కూడా ఇందులో నాయికలు. ఈ నెల 31న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు విష్ణు, మనోజ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement