kondameedarayudu
-
కొండమీదరాయుడా.. కోటి దండాలయ్యా
బుక్కరాయసముద్రం సమీపంలోని దేవరకొండపై వెలసిన కొండమీదరాయుడి రథోత్సవం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. స్థానిక లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో వేకువజామునే శ్రీదేవి, భూదేవి సమేత కొండమీదరాయుడి కల్యాణోత్సవాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్సవమూర్తులను సూర్యప్రభ వాహనంపై ఊరేగిస్తూ తీసుకొచ్చి రథంపై అధిష్టింపజేశారు. మధ్యాహ్నం ఒంటి గంటకు పురవీధుల్లో అశేష భక్తుల గోవింద నామస్మరణ నడుమ రథాన్ని ముందుకు లాగారు. ఉత్సవానికి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా.. కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. - బుక్కరాయసముద్రం -
గరుడవాహనంపై కొండమీదరాయుడు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుడు స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి వారు గరుడవాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారిని వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. అలాగే గురువారం రాత్రి 8 గంటలకు కొండమీదరాయుడిని శ్వేత గజవాßæహనంపై దర్శనమిస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. -
సింహ వాహనంపై కొండమీదరాయుడు స్వామి ఊరేగింపు
బుక్కరాయసముద్రం : మండలంలో కొండమీదరాయుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి కొండమీదరాయుడుస్వామిని సింహవాహనంపై ఊరేగించారు. ఆలయ అర్చకులు శ్రీవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజల నిర్వహించారు. అదే విధంగా సోమవారం రాత్రి 8 గంటలకు కొండమీదరాయుడిని శేష వాహనంపై ఊరేగిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.