తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సాయంత్రం 6 గంటల వరకు 60 వేల మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఇదే సమయానికి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 15 గంటలు, 12 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్న కాలిబాట భక్తులకు 8 గంటల తర్వాత స్వామి దర్శనం లభించే అవకాశం ఉందని ఆలయాధికారులు తెలిపారు. గదుల కోసం భక్తులు రిసెప్షన్ కార్యాలయాల వద్ద వేచి ఉన్నారు. కల్యాణకట్టల్లోనూ తలనీలాలు సమర్పించుకునేందుకు నిరీక్షించారు. హుండీ కానుకలు రూ. 2.07 కోట్లు లభించాయి.