
లేపాక్షి ఆలయాన్ని సందర్శించిన సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని మంగళవారం మధ్యాహ్నం సీఆర్‌పీఎఫ్ సిబ్బంది సందర్శించారు. హిందూపురం పట్టణంలోని పురవీధుల గుండా వారు కవాతు నిర్వహించారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని ఏడు శిరస్సుల నాగేంద్రుడు, నంది విగ్రహం, అంతరిక్ష స్తంభం, నాట్యమండపం, కల్యాణ మండపం, చిత్రాలు, అపురూపమైన విగ్రహాలను తిలకించి ఆనందించారు. లేపాక్షి ఆలయంలోని శిల్పాలు, చిత్రలేఖనాలు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. లేపాక్షి ఎస్‌ఐ శ్రీధర్‌తో పాటు వారి సిబ్బంది వారి వెంట ఉన్నారు.