లేపాక్షి : లేపాక్షి ఆలయాన్ని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు చైర్మన్ సంపత్‌కుమార్‌చారి, బెంగళూరు డిప్యూటీ జనరల్ మేనేజర్ దేశాయ్, నాబార్డు డిప్యూటీ జనరల్ మేనేజర్ మిశ్రా, ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సరోజిని, ఏపీజీబీ జనరల్ మేనేజర్ ఆనంద్, రీజినల్ మేనేజర్ శ్రీరంగన్న, బ్రాంచ్ మేనేజర్లు శుక్రవారం సందర్శించారు. స్థానిక ఏపీ టూరిజం హోటల్ ఆవరణలో నిర్వహించిన మహిళా సదస్సుకు వారు హాజరయ్యారు. అనంతరం లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. వారికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను అర్చకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆలయంలోని వీరభద్రస్వామి, దుర్గాదేవి అమ్మవారికి విశేషంగా పూజలు నిర్వహించారు.