
లేపాక్షి ఆలయానికి తగ్గిన పర్యాటకులు
లేపాక్షి : కేంద్రప్రభుత్వం ఇటీవల రూ. 500, రూ.వెయ్యి నోట్లు రద్దు చేయడంతో లేపాక్షిని సందర్శించే పర్యాటకుల రద్దీ తగ్గింది. ప్రతి రెండో శనివారం, ఆదివారాల్లో ఆంధ్రతో పాటు కర్ణాటక ప్రాంతాల నుంచి పర్యాటకులు వచ్చేవారు. అయితే పెద్ద నోట్లు చెలామణిలో లేకపోవడంతో పర్యాటకులు రాలేకపోతున్నారు. సామాన్య ప్రజలు ఆలయానికి రావాలన్నా కనీసం రూ.500 అవసరం అవుతుంది. దీంతో ఆలయానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఫలితంగా ఆలయానికి భక్తుల రద్దీ తగ్గింది.