Naresh kumar
-
సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్...
బంజారాహిల్స్ (హైదరాబాద్): పేదల వైద్య ఖర్చుల నిమి త్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కుల గోల్మాల్ అంశం వెలుగులోకి వ చ్చింది. లబ్ధిదారులకు అందాల్సిన చెక్కులను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న ముఠాను హైదరాబాద్‌లోని జూబ్లీహి ల్స్ పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వ్యవ హారంలో సూత్రధారిగా వ్యవహరించిన నరేశ్‌కుమార్ అనే వ్యక్తి గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో పనిచేయడంతో.. హరీశ్‌రావు పీఏ సీఎంఆర్ఎఫ్ చెక్కుల అక్రమాలకు పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. హరీశ్ రావు కార్యాలయం దీనిని ఖండిస్తూ ప్రకటన చేసింది. ఆఫీసు మూసివేశాక అక్రమానికి తెగబడి.. గత ప్రభుత్వంలో హరీశ్‌రావు మంత్రి కావడంతో ఆయన నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆయన ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. వారికి మంజూరైన చెక్కులు హరీశ్‌రావు క్యాంపు ఆఫీసు ద్వారా పంపిణీ చేసేవారు. హైదరాబాద్ లోని కోకాపేటలో ఉన్న ఈ క్యాంప్ ఆఫీస్‌లో మెట్టుగూడ కు చెందిన జోగుల నరేశ్‌కుమార్ (40) కంప్యూటర్ ఆప రేటర్‌గా పనిచేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్ 6వ తేదీన హరీశ్‌రావు తన క్యాంపు కార్యాలయాన్ని మూసేశారు. వివిధ ప్రాంతాల లబ్ధిదారులకు చెందిన 240 సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆఫీసులో మిగిలిపోవడంతో.. వాటిని తిరిగి సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ కార్యాలయంలో అప్పగించాల్సిందిగా నరేశ్‌కుమార్‌కు సూచించారు. ఇక్కడే నరేశ్ తన తెలివితేటలు ప్రదర్శించాడు. మరో ముగ్గురిని కలుపుకొని.. సీఎంఆర్ఎఫ్ చెక్కుల సొమ్మును కొల్లగొట్టాలని భావించిన నరేశ్‌కుమార్.. అసెంబ్లీలో అటెండర్‌గా పనిచేస్తున్న బాలగోని వెంకటేశ్ (35), ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బీఆర్ఎస్ నేత కొర్లపాటి వంశీ (24), గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్(34)తో కలసి పథకం వేశాడు. ఓంకార్ ఈ చెక్కులపై ఉన్న పేర్లను పోలిన పేర్లున్న ఇతర వ్యక్తులను గుర్తించి.. వారి ఖాతాల్లో చెక్కులను డిపాజిట్ చేయించాడు. వారి నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయించుకుని.. నలుగురూ పంచుకుంటూ వచ్చారు. చెక్కులు మాయమైన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. గత ఏడాది డిసెంబర్ 17వ తేదీనే నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా. ఓ లబ్ధిదారు ఫిర్యాదుతో వెలుగులోకి.. తనకు సీఎంఆర్ఎఫ్ సాయం మంజూరైనా, చెక్కు రాకపోవడంతో మెదక్ జిల్లా పీర్ల తండాకు చెందిన రైతు రవినాయక్ ఆరా తీశారు. అయితే ఆయన పేరుపై సీఎంఆర్ఎఫ్ చెక్కు వచ్చిందని, సొమ్ము కూడా డ్రా అయిందని తేలింది. దీనిపై ఆయన జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్‌ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వారు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది. గడువు తీరడంతో కొన్ని చెక్కులను దహనం చేశామని వంశీ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. చెక్కుల గోల్మాల్ విషయం తెలిసిన లబ్ధిదారులు ఠాణాకు క్యూకట్టారు. ఇప్పటికే 24 మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 417, 419, 420, 120 (డి), 66 (సి) ఐపీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు . నరేశ్‌తో సంబంధం లేదు.. చెక్కులపై గతంలోనే ఫిర్యాదు.. హరీశ్‌రావు కార్యాలయం ప్రకటన సాక్షి, హైదరాబాద్: సీఎంఆర్ఎఫ్ చెక్కుల వ్యవహారం బయటపడటంతో.. వాటిని మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాజేశాడంటూ బుధవారం సోషల్ మీడి యాలో, బయటా ప్రచారం జరిగింది. దానిని ఖండిస్తూ హరీశ్‌రావు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నరేశ్ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాదు. అతను కంప్యూటర్ ఆపరేటర్, తాత్కాలిక ఉద్యోగి. మంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్ 6న క్యాంపు కార్యాలయాన్ని మూసివేసి, సిబ్బందిని పంపించి వేశాం. ఆ రోజు నుంచి నరేశ్ అనే వ్యక్తితో హరీశ్‌రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు. అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా నరేశ్ కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై డిసెంబర్ 17వ తేదీనే నార్సింగి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాం. ఈ వాస్తవాలను గుర్తించకుండా మాజీ మంత్రి పీఏ చెక్కులు కాజేశాడంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. వాస్త వాలను గుర్తించాలి’’ అని ప్రకటనలో పేర్కొంది. -
చీఫ్ సెక్రటరీని తొలగించండి
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను బాధ్యతల నుంచి తప్పించాలని ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్(ఎల్జీ)ని సీఎం కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. నరేశ్ కుమార్ తన కుమారుడికి చెందిన సాఫ్ట్వేర్ కంపెనీకి, ఐఎల్బీ అనే సంస్థతో ఎంవోయూ కుదిరేందుకు అధికార దురి్వనియోగానికి పాల్పడినట్లు విజిలెన్స్ మంత్రి అతీషి ఆరోపించారు. ఈ మేరకు నివేదికను ఇటీవల సీఎం కేజ్రీవాల్‌కు అందజేశారు. ఆ నివే దికను కేజ్రీవాల్ శనివారం లెఫ్టినెంట్ జనరల్ వీకే శుక్లాకు పంపారు. అతీషి సిఫారసుల మేరకు ప్రధాన కార్యదర్శి నరేశ్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలను చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తనకుమారుడికి ఎటువంటి కంపెనీతోను, ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేశారు. ఐఎల్‌బీఎస్ సంస్థ కూడా అతీషి చేసిన ఆరోపణలు నిరాధారాలంటూ ఖండించింది. -
నన్ను చంపేస్తానని బెదిరించాడు.. సీఎస్‌పై మంత్రి సంచలన ఆరోపణలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ సంచలన ఆరోపణలు చేశారు. చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్ తనను చంపుతానని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈమేరకు ఆయన శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయంపై దర్యాప్తు చేపడతామన్నారు. రాత్రి 9:30 గంటల సమయంలో తన కార్యాలయానికి వచ్చిన సీఎఎస్.. 'నిన్ను చంపేస్తా' అని భయభ్రాంతులకుగురి చేశారని మంత్రి పేర్కొన్నారు. కాగా చీఫ్ సెక్రెటరీ తనను బెదిరిస్తున్నారని లెఫ్టినెంట్ గవర్నర్‌కు కూడా భరద్వాజ్ ఫిర్యాదు చేశారు. కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిపారు. చదవండి: ఢిల్లీలో భారీ సైబర్ క్రైం -
లియాండర్ పేస్ గురువు కన్నుమూత
భారత టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్.. తన గురువులా భావించే మాజీ టెన్నిస్ ప్లేయర్, డేవిడ్ కప్ మాజీ కెప్టెన్ నరేశ్ కుమార్ బుధవారం రాత్రి కన్నుమూశారు.16 ఏళ్ల టీనేజర్ లియాండర్ పేస్‌కు మెంటార్‌గా వ్యవహరించిన నరేశ్ కుమార్.. పేస్ తన కెరీర్లో ఎదగడంలో పరోక్షంగా కీలకపాత్ర పోషించాడు. ఇక 1990 డేవిస్ కప్‌లో పేస్‌కు మెంటార్‌గా వ్యహరించిన నరేశ్ కుమార్ నాన్ ప్లేయింగ్ కెప్టెన్‌గా, ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 93 ఏళ్ల నరేశ్ కుమార్ గత కొంతకాలంగా వయోభారంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం తెల్లవారుజామున నిద్రలోనే మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యలు తెలిపారు. ఇక నరేశ్ కుమార్ 1928 డిసెంబర్ 22న లాహోర్‌లో జన్మించారు. ఆయనకు భార్య సునీత. కొడుకు అర్జున్, ఇద్దరు కూతుర్లు గీతా, ప్రియాలు సంతానం. 1949లో ఆసియా చాంపియన్‌షిప్స్ ద్వారా టెన్నిస్‌లో అరంగేట్రం చేసిన నరేశ్ కుమార్.. ఆ తర్వాత మరో టెన్నిస్ ప్లేయర్ రమానాథన్ కృష్ణన్‌తో కలిసి దాదాపు దశాబ్దానికి పైగా భారత్ నుంచి టెన్నిస్‌లో కీలకపాత్ర పోషించాడు. ఇక 1952లో డేవిస్ కప్ జర్నీ ఆరంభించిన నరేశ్ కుమార్ ఆ తర్వాత భారత్ తరపున డేవిడ్ కప్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇక 1955లో నరేశ్ కుమార్ తన టెన్నిస్ కెరీర్లో ఒక గోల్డెన్ ఇయర్ అని చెప్పొచ్చు. ఆ ఏడాది వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సింగిల్స్ విభాగంలో భారత్ తరపున తొలిసారి నాలుగో రౌండ్‌కు చేరిన తొలి ఆటగాడిగా నిలిచాడు.అయితే నాలుగో రౌండ్లో అప్పటి టెన్నిస్ ప్రపంచ నెంబర్‌వన్ టోనీ ట్రేబర్ట్ చేతిలో ఓడినప్పటికి అతన్ని ముప్పతిప్పలు పెట్టి ఔరా అనిపించాడు. ఇక నరేశ్ కుమార్ ఖాతాలో ఐదు సింగిల్స్ టైటిల్స్ ఉన్నాయి. 1952, 1953లో ఐరిస్ చాంపియన్‌షిప్స్.. 1952లో వెల్ష్ చాంపియన్స్, 1957లో ఎసెక్స్ చాంపియన్షిప్స్లు సొంతం చేసుకున్నాడు. ఇక 1969లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లో నరేశ్ కుమార్ తన ఆఖరి మ్యాచ్ ఆడాడు. అర్జున అవార్డు అందుకున్న నరేశ్ కుమార్.. 2000వ సంవత్సరంలో ద్రోణాచార్య లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న తొలి భారత టెన్నిస్ కోచ్‌గా నిలిచారు. -
స్ప్రింట్ ఫైనల్లో నిత్య, నరేశ్
సాక్షి, వరంగల్ స్పోర్ట్స్: జాతీయ ఓపెన్ అథ్లెటిక్ చాంపియన్íÙప్ స్ప్రింట్‌లో తెలంగాణ అమ్మాయి గంధి నిత్య స్ప్రింట్‌లో సత్తా చాటింది. మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో ఫైనల్స్‌కు అర్హత సంపాదించింది. హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో కొత్తగా నిర్మించిన సింథటిక్ ట్రాక్‌పై బుధవారం ఈ పోటీలు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఎక్కువగా పలు ఈవెంట్లకు సంబంధించి క్వాలిఫయింగ్ పోటీలు జరిగాయి. ఇందులో భాగంగా మహిళల 100 మీ. పరుగు పందెం హీట్స్‌లో నిత్య నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల వంద మీటర్ల స్ప్రింట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కె. నరేశ్ కుమార్ ఫైనల్లోకి ప్రవేశించాడు. హీట్స్‌లో అతను నాలుగో స్థానంలో నిలువడం ద్వారా ఫైనల్స్‌కు అర్హత సంపాదించాడు. మహిళల 400 మీటర్ల పరుగు పందెంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి దండి జ్యోతికశ్రీ ఫైనల్స్‌కు అర్హత పొందింది. హీట్స్‌లో ఆమె మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు రైల్వేస్ అథ్లెట్ల హవా నడిచింది. మొదటి రోజు మూడు మెడల్ ఈవెంట్లలో నలుగురు రైల్వేస్ అథ్లెట్లు పతకాలు గెలుపొందారు. 5000 మీటర్ల పరుగు పందెంలో పురుషుల కేటగిరీలో అభిõÙక్ పాల్, మహిళల ఈవెంట్లో పారుల్ చౌదరీ విజేతలుగా నిలిచారు. పురుషుల విభాగంలో అభిõÙక్ (రైల్వేస్) పోటీని అందరికంటే ముందుగా 14 నిమిషాల 16.35 సెకన్లలో పూర్తి చేసి బంగారు పతకం నెగ్గాడు. సర్వీసెస్‌కు చెందిన ధర్మేందర్ (14ని.17.20 సె.), అజయ్ కుమార్ (14 ని.20.98 సె.) వరుసగా రజత, కాంస్య పతకాలు గెలిచారు. మహిళల 5000 మీ. పరుగులో పారుల్ చౌదరి 15 ని.59.69 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణం గెలిచింది. ఇందులో మహారాష్ట్ర అమ్మాయిలు కోమల్ జగ్దలే (16ని. 01.43 సె.), సంజీవని బాబర్ (16 ని.19.18 సె.) రజతం, కాంస్యం గెలుపొందారు. మహిళల పోల్‌వాల్ట్ ఫైనల్లో పవిత్ర (తమిళనాడు; 3.90 మీ.) బంగారు పతకం సాధించింది. మరియా (రైల్వేస్; 3.80 మీ.) రజతం, కృష్ణ రచన్ (రైల్వేస్ 3.60 మీ.) కాంస్యం నెగ్గారు. మంత్రి చేతుల మీదుగా... మునుపెన్నడూ లేనివిధంగా చారిత్రక ఓరుగల్లులో జాతీయ క్రీడా పోటీలు జరుగుతుండడం గొప్ప విశేషం అని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో కలిసి లాంఛనంగా పోటీలను ప్రారంభించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పుడు ఇలాంటి జాతీయస్థాయి పోటీలకు హనుమకొండ నోచుకోలేదన్నారు. కేంద్రాన్ని ఒప్పించి రామప్పకు యునెస్కో గుర్తింపు తీసుకువచ్చామని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ‘శాట్స్’ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సైకిల్‌పై చెన్నై టు జర్మనీ
సురేష్ కుమార్ ఉన్నత విద్యను అభ్యసించాడు. విదేశాల్లో ఉన్నతోద్యోగం కూడా సాధించాడు. అయినా లోలోన ఏదో అసంతృప్తి. చదువు, ఉద్యోగం, వివాహం... ఇంతేనా జీవితం! దేశం కోసం, ఈ సమాజం కోసం ఏదైనా సాధించాలి అనే ఆలోచన, తపన ఆ యువకుడిని నింపాదిగా ఉండనీయలేదు. ఉద్యోగాన్ని వదిలేయమని చెప్పి సైకిలెక్కించింది. ఆ రెండు చక్రాలపైనే పదమూడు దేశాలు చుట్టివచ్చేలా చేసింది. చిత్తూరు జిల్లా సత్యవేడుకు చెందిన కొండూరు నరేష్కుమార్ ఎంజీఆర్ యూనివర్సిటీలో ట్రిబుల్ఈ పూర్తి చేశాడు. మూడేళ్ల పాటు బెంగళూరులో, ఆరేళ్లు అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేశాడు. సమాజానికి తనవంతుగా ఏదైనా చేయాలన్న తపనతో సామాజిక సేవా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. వారాంతపు రోజుల్లో యూనివర్సిటీలు, కాలేజీలు, ఐటీ కంపెనీల్లో యువతలో వ్యక్తిత్వ వికాసం, సామాజిక ప్రేరణ కలిగించే తరగతులు నిర్వహించడం ప్రారంభించాడు. ఐదేళ్ల నుంచీ పూర్తిస్థాయి సామాజిక కార్యకర్తగా మారిపోయాడు. ఆలోచన రేకెత్తించిన అనుభవాలు ‘‘వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నపుడు నా దృష్టికి వచ్చిన కొన్ని విషయాలు నా గుండెను పిండేశాయి. నేపాల్ పర్యటనకు వెళ్లినపుడు సెక్స్ ట్రాఫికింగ్ నా కళ్లెదురుగా జరిగింది. ఈ నేరాల బారినపడకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మొదటిసారిగా న్యూజిలాండ్‌లో 3 వేల కిలోమీటర్లు పరుగెత్తాను. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు భారత్ టూ జర్మనీకి సైకిల్ పర్యటన చేయాల్సిందిగా గత ఏడాది జరిగిన ఒక రోటరీ సమావేశంలో సభ్యులు కోరినప్పుడు వెంటనే ఒప్పుకున్నాను. ఎంజీఆర్ యూనివర్సిటీ వారు ఈ యాత్రను స్పాన్సర్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 27వ తేదీన 13 దేశాల పర్యటనకు బయలుదేరాను. మొత్తం 85 రోజులు పట్టింది. చెన్నై నుంచి ముంబయికి సైకిల్ మీద, ముంబయి నుంచి మస్కట్‌కు విమానంలో, షార్జా నుంచి ఇరాన్‌కు నౌకలో మినహా మొత్తం ప్రయాణం అంతా సైకిల్లోనే సాగింది. ఇస్తాంబుల్ వద్ద ఆసియా ఖండం నుంచి యూరోప్లోకి ప్రవేశించాను. మొత్తం అన్ని రోజులూ ప్రయాణించి నా గమ్యం అయిన జర్మనీలోని హ్యాంబర్గ్కు చేరుకున్నాను. ప్రయాణానికి ముందు ‘‘న్యూజిలాండ్‌కు చెందిన ఒక స్నేహితుడు పన్నెండు అడుగుల పొడవున్న ఒక సైకిల్‌ను ప్రత్యేకంగా తయారుచేసి చెన్నైకి పంపాడు. సైకిల్‌కు వెనుక భాగంలో దుస్తులు, మధ్యలో చాప, అత్యవసర మరమ్మత్తు సామగ్రి, ముందుభాగాన జీపీఎస్ సిస్టమ్, సోలార్ సెల్‌ఫోన్ చార్జర్, ఒకరోజుకు సరిపడా ఆహారం ఉంటుంది. యాత్ర మొత్తంలో 34 సార్లు పంక్చర్లు పడ్డాయి. మొత్తం 8646 కిలోమీటర్ల ప్రయాణంలో 50 వేల మీటర్లు పైకి ఎక్కి దిగాల్సి వచ్చింది. అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఐదుసార్లు ఎక్కి దిగినదానితో సమానం’’ .– నరేష్ అడ్డంకులు.. అవాంతరాలు తమిళనాడు రాష్ట్రం వేలూరులో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను దాటుకుని ప్రయాణిస్తూ టర్కీలో మైనస్ 6 డిగ్రీని కూడా చవి చూసాను. ఎదురుగాలులు, పూర్తిగా భిన్నమైన వాతావరణ పరిస్థితులు సవాలుగా మారాయి. టర్కీలో భారీ మంచును ఎదుర్కొవాల్సి రావడంతో రెండురోజులు నిలబడి పోయాను. మంచులో సైకిల్ చక్రం తిరగలేదు. ఆస్ట్రియా దేశం వియన్నాలో వైరల్ జ్వరం, జలుబు, దగ్గు సోకడంతో రెండురోజులు ఇన్‌పేషెంట్‌గా ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. ‘ఎండ్ స్లేవరీ నౌ’ (నేటి నుంచే బానిసత్వ నిర్మూలన) పేరున ఈ ఏడాది జూన్ 1వ తేదీన జర్మనీలో రోటరీ అంతర్జాతీయ సమావేశం జరిగింది. సైకిల్‌పై పర్యటిస్తూ ఆ సమావేశం తేదీకి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అయితే నేను మే 25వ తేదీ నాటికే.. అంటే ఐదురోజులు ముందుగానే జర్మనీకి చేరుకున్నాను.ఒకే కుమారుడిని కావడంతో సైకిల్ పర్యటనకు తొలుత తల్లిదండ్రులు బాధపడ్డారు. ఆ తరువాత వారే మద్దతు పలుకుతూ ధైర్యం చెప్పారు. యూరోప్ టూ అమెరికా పర్యటించాలని నా తదుపరి లక్ష్యం. ఇందుకు 12 వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.– కొట్రా నందగోపాల్, సాక్షి ప్రతినిధి, చెన్నై -
కరెంట్.. ఇంట్లో కాదు ఒంట్లో కూడా..!
నరేశ్‌కుమార్.. ఈయనది ముజఫర్‌నగర్. ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతటి హైవోల్టేజ్ కరెంట్ అయినా నరేశ్‌ను ఏమీ చేయలేదు. అంతేకాదండోయ్.. శరీరానికి కావాల్సిన శక్తిని అందరూ ఆహారం ద్వారా పొందుతుంటే ఈయన మాత్రం నేరుగా విద్యుత్‌ను తీసుకుని జీవిస్తున్నాడు. 42 ఏళ్ల నరేశ్ మాత్రం తనకున్న ఈ ప్రత్యేకతను అనుకోకుండా గ్రహించానని చెబుతున్నాడు. తానొకసారి పనిచేస్తుండగా అనుకోకుండా కరెంటు వైర్‌ను తాకానని అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి హాని జరగలేదని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి కరెంటు వైర్లను తాకడం.. నోట్లో పెట్టుకోవడం చేస్తుండేవాడు. అలా తన ఆహారాన్నే విద్యుత్‌గా మార్చుకున్నాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే కరెంటు వైర్లను నోట్లో పెట్టుకుంటానని, అలా ఒక అర్ధ గంటలోపే తన ఆకలి తీరిపోతుందని నరేశ్ చెప్పాడు. ప్రస్తుతం తన శరీరంలో దాదాపు 80 శాతం ప్రస్తుతం కరెంటు ఉందని తెలిపాడు. ‘ఆయనను తాకితే ఎక్కడ షాక్ కొడుతుందోనని నేను, నా పిల్లలు నిత్యం భయపడుతున్నాం’ అని నరేశ్ భార్య భయంభయంగా చెప్పింది. నోటిలో, చేతుల్లో కరెంటు వైర్లు పట్టుకున్న నరేశ్ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అందరూ నరేశ్‌ను సోషల్ మీడియాలో ఇండియా లివింగ్ లైట్ బల్బ్‌గా పిలుచుకుంటున్నారు. -
నరకయాతన!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గొంతులో దిగబడ్డ ఇనుప కడ్డీ తొండూరు: వైఎస్ఆర్ జిల్లా పులివెందుల- ముద్దనూరు ప్రధాన రహదారిలోని మల్లేల ఘాట్‌లో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి గొంతులోకి ఇనుప కడ్డీ దిగబడింది. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం ప్రొద్దుటూరుకు వెళుతుండగా.. మల్లేల ఘాట్ వద్ద ముద్దనూరు వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రొద్దుటూరుకు సొంత పని మీద బస్సులో వెళ్తున్న పులివెందులకు చెందిన ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సుగుణాకర్ కుమారుడు నరేష్‌కుమార్‌కు గొంతు పక్క భాగంలో బస్సుకు సంబంధించిన ఇనుప రాడ్డు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి కడ్డీ తొలగించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు. -
ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠా అరెస్ట్
ములకలచెరువు: ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను అరెస్ట్ చేసి వారి నుంచి 400 కిలోల రాగి తీగలు స్వాధీనం చేసుకున్నట్టు సీఐ రామాంజీనాయక్, ఎస్ఐ నరేష్కుమార్ సోమవారం తెలిపారు. వారి కథనం మేరకు..సోమవారం తెల్లవారుజామున తంబళ్లపల్లె ఎస్ఐ నరేష్కుమార్, తన సిబ్బందితో కోసువారిపల్లె క్రాస్‌వద్ద వాహనాల తనిఖీలు చేశారు. రెండు ఆటోలను తనిఖీ చేయగా వంద కిలోల రాగితీగలు ఉన్నట్టు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మదనపల్లెకు చెందిన దనియాల పెద్దరమణ (43), సద్దాం(25), రమేష్(26) ఆటో డ్రైవర్లు మల్లేశ్వర్రావు(29), నాగరా జు (26)ను అరెస్ట్ చేశారు. వీరంతా ఆవుల శంకర్(30)నేతృత్వంలో ఏడుగురి సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడి ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు పాల్పడుతున్నట్టు విచారణలో తేలింది. అలాగే, కురబలకోట రైల్వే స్టేషన్ సమీపంలోని కొండలో నిందితులు దాచి ఉంచిన 300 కేజీల రాగితీగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆవుల శంకర్(30), మచ్చ రమేష్(25) కోసం గాలిస్తున్నామని, ఆవుల శంకర్, దనియాల పెద్దరమణపై అనంతపురం, వైఎస్ఆర్ కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఇంతకు ముందు దాదాపు 200 ట్రాన్స్ఫార్మర్ల చోరీ కేసులు ఉన్నట్లు సీఐ వెల్లడించారు. నిందితులను రిమాండ్ నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఇదలా ఉంచితే, వీరు జిల్లాలో వివిధ మండలాల్లో 82 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని రాగితీగలను చోరీ చేసినట్టు తేలిందని చెప్పారు.. రాగితీగలను కొన్న వారినీ అరెస్ట్ చేస్తాం : సీఐ ట్రాన్స్ఫార్మర్ల చోరీ ముఠా నుంచి రాగితీగలను కొన్న మదనపల్లెకు చెందిన నలుగురు గుజిరీ వ్యాపారులను కూడా అరెస్ట్ చేస్తామని సీఐ తెలిపారు. వీరు నిందితుల నుంచి కిలో రాగి తీగలు *300 చొప్పున కొని బెంగళూరులో 1000 రూపాయల వంతున విక్రయిస్తున్నట్టు తేలిందని వెల్లడించారు. 82 ట్రాన్స్ఫార్మర్ల చోరీకి సంబంధించి ఇంకనూ 946 కేజీల రాగి తీగలను రికవరీ చేయాల్సి ఉందని చెప్పారు. సమావేశంలో ఎస్ఐలు నరేష్కుమార్, శ్రీకాంత్‌రెడ్డి, ఏఎస్ఐ నారాయణస్వామి, సిబ్బం ది, శ్రీకాంత్, కుమార్, సిరాజ్, శంక ర్, మారుతిరెడ్డి, రమణకుమార్, నరసింహులు పాల్గొన్నారు. -
కేన్సర్ కాటు
వారికి ఇద్దరు కుమార్తెలు.. ఇద్దరు కుమారులు.. కుమార్తెలకు ఎలాగోలా పెళ్లి చేశారు.. కుమారుల సాయంతో బతుకుబండి సాగుతోంది.. ఇంతలో విధి వారితో ఆడుకోవడం మొదలు పెట్టింది.. చిన్న కుమారుడు నరేష్‌కుమార్‌కు జబ్బు చేసింది.. పరీక్షల్లో బోన్ కేన్సర్ అని తేలింది.. పైసాపైసా కూడబెట్టిన సొమ్ముతో నరేష్‌కుమార్‌కు ఆపరేషన్ చేయించారు. కొద్దికొద్దిగా కోలుకుంటుండగానే మరో షాక్.. పెద్ద కుమారుడు మల్లికార్జునకు పేగు కేన్సర్ చివరి దశలో ఉన్నట్లు వైద్యుల రిపోర్ట్.. ఆ కుటుంబానికి నోట మాట రాలేదు.. కొద్ది రోజులకే కేన్సర్‌తో పోరాడలేక మల్లికార్జున కన్ను మూశాడు.. పెద్ద కుమారుడితో పాటు ఆ కుటుంబం ఉన్నదంతా పోగోట్టుకుంది.. అయినా విధికి ఆ కుటుంబంపై పగ చల్లారలేదు.. ఈసారి ఇంటిపెద్దపైనే కేన్సర్ గురిపెట్టింది.. బోన్కేన్సర్ ముదిరిపోవడంతో ఇంటిపెద్ద మనోహర్ పెద్ద కుమారుడి వద్దకే వెళ్లిపోయాడు. భర్తను.. పెద్ద కుమారుడిని పోగోట్టుకున్న నాగలక్ష్మి చిన్నకుమారుడు నరేష్కుమార్పైనే ప్రాణాలు పెట్టుకుంది.. విధి తన కాఠిన్యాన్ని మానలేదు.. బోన్కేన్సర్ నుంచి తప్పించుకున్నావు.. ఇప్పుడు చూడు... అంటూ కంటి కేన్సర్‌ను ప్రయోగించింది.. ప్రస్తుతం నరేష్కుమార్ కంటి కేన్సర్‌తో పోరాటం చేస్తున్నాడు.. పెనిమిటిని.. పెద్దకొడుకును బలి తీసుకుని చిన్నకుమారుడిని కూడా కాటేయాలని కేన్సర్ చూస్తుండటంతో ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోతోంది..