నరకయాతన!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి గొంతులో దిగబడ్డ ఇనుప కడ్డీ
తొండూరు: వైఎస్‌ఆర్ జిల్లా పులివెందుల- ముద్దనూరు ప్రధాన రహదారిలోని మల్లేల ఘాట్‌లో బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి గొంతులోకి ఇనుప కడ్డీ దిగబడింది. పులివెందుల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు శనివారం సాయంత్రం ప్రొద్దుటూరుకు వెళుతుండగా.. మల్లేల ఘాట్ వద్ద ముద్దనూరు వైపు నుంచి వస్తున్న లారీ అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రొద్దుటూరుకు సొంత పని మీద బస్సులో వెళ్తున్న పులివెందులకు చెందిన ఆర్య వైశ్య సంఘం మాజీ అధ్యక్షుడు సుగుణాకర్ కుమారుడు నరేష్‌కుమార్‌కు గొంతు పక్క భాగంలో బస్సుకు సంబంధించిన ఇనుప రాడ్డు దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అతన్ని పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేసి కడ్డీ తొలగించడానికి వైద్యులు ప్రయత్నిస్తున్నారు.