కరెంట్‌.. ఇంట్లో కాదు ఒంట్లో కూడా..! | High Voltage Current in naresh body | Sakshi
Sakshi News home page

కరెంట్‌.. ఇంట్లో కాదు ఒంట్లో కూడా..!

Published Sun, Aug 13 2017 12:21 AM | Last Updated on Sun, Sep 17 2017 5:27 PM

కరెంట్‌.. ఇంట్లో కాదు ఒంట్లో కూడా..!

కరెంట్‌.. ఇంట్లో కాదు ఒంట్లో కూడా..!

నరేశ్‌కుమార్‌.. ఈయనది ముజఫర్‌నగర్‌. ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది. ఎంతటి హైవోల్టేజ్‌ కరెంట్‌ అయినా నరేశ్‌ను ఏమీ చేయలేదు. అంతేకాదండోయ్‌.. శరీరానికి కావాల్సిన శక్తిని అందరూ ఆహారం ద్వారా పొందుతుంటే ఈయన మాత్రం నేరుగా విద్యుత్‌ను తీసుకుని జీవిస్తున్నాడు. 42 ఏళ్ల నరేశ్‌ మాత్రం తనకున్న ఈ ప్రత్యేకతను అనుకోకుండా గ్రహించానని చెబుతున్నాడు. తానొకసారి పనిచేస్తుండగా అనుకోకుండా కరెంటు వైర్‌ను తాకానని అయితే అదృష్టం కొద్దీ ఎలాంటి హాని జరగలేదని చెప్పుకొచ్చాడు. అప్పటి నుంచి కరెంటు వైర్లను తాకడం.. నోట్లో పెట్టుకోవడం చేస్తుండేవాడు.

అలా తన ఆహారాన్నే విద్యుత్‌గా మార్చుకున్నాడు. ఇంట్లో తినడానికి ఏమీ లేకపోతే కరెంటు వైర్లను నోట్లో పెట్టుకుంటానని, అలా ఒక అర్ధ గంటలోపే తన ఆకలి తీరిపోతుందని నరేశ్‌ చెప్పాడు. ప్రస్తుతం తన శరీరంలో దాదాపు 80 శాతం ప్రస్తుతం కరెంటు ఉందని తెలిపాడు. ‘ఆయనను తాకితే ఎక్కడ షాక్‌ కొడుతుందోనని నేను, నా పిల్లలు నిత్యం భయపడుతున్నాం’ అని నరేశ్‌ భార్య భయంభయంగా చెప్పింది. నోటిలో, చేతుల్లో కరెంటు వైర్లు పట్టుకున్న నరేశ్‌ ఫొటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయాయి. అందరూ నరేశ్‌ను సోషల్‌ మీడియాలో ఇండియా లివింగ్‌ లైట్‌ బల్బ్‌గా పిలుచుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement