సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌... | CMRF check scam comes to light | Sakshi
Sakshi News home page

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల గోల్‌మాల్‌...

Published Thu, Mar 28 2024 2:12 AM | Last Updated on Thu, Mar 28 2024 2:12 AM

CMRF check scam comes to light - Sakshi

లబ్ధిదారులకు ఇవ్వకుండాకొల్లగొట్టిన ముఠా అరెస్ట్‌ 

మాజీ మంత్రి హరీశ్‌రావు ఆఫీస్‌లోపనిచేసిన నరేశ్‌కుమార్‌ 

సచివాలయంలోఅప్పగించాల్సిన చెక్కులు పక్కదారి.. మరో ముగ్గురితో కలసి అక్రమంగా నగదు డ్రా 

లబ్ధిదారుల ఫిర్యాదుతో వెలుగులోకి.. 

చెక్కుల మాయంపై డిసెంబర్‌లోనే పోలీసులకు ఫిర్యాదు చేశామని హరీశ్‌రావు కార్యాలయం వెల్లడి

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): పేదల వైద్య ఖర్చుల నిమి త్తం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) కింద మంజూరైన చెక్కుల గోల్‌మాల్‌ అంశం వెలుగులోకి వ చ్చింది. లబ్ధిదారులకు అందాల్సిన చెక్కులను కొల్లగొట్టి సొమ్ము చేసుకున్న ముఠాను హైదరాబాద్‌లోని జూబ్లీహి ల్స్‌ పోలీసులు అరెస్టు చేశారు.

బుధవారం వారిని కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. అయితే ఈ వ్యవ హారంలో సూత్రధారిగా వ్యవహరించిన నరేశ్‌కుమార్‌ అనే వ్యక్తి గతంలో మాజీ మంత్రి హరీశ్‌రావు కార్యాలయంలో పనిచేయడంతో.. హరీశ్‌రావు పీఏ సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల అక్రమాలకు పాల్పడ్డాడంటూ ప్రచారం జరిగింది. హరీశ్‌ రావు కార్యాలయం దీనిని ఖండిస్తూ ప్రకటన చేసింది.

ఆఫీసు మూసివేశాక అక్రమానికి తెగబడి..
గత ప్రభుత్వంలో హరీశ్‌రావు మంత్రి కావడంతో ఆయన నియోజకవర్గంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ప్రాంతాల వారు సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కోసం ఆయన ద్వారా దరఖాస్తు చేసుకునేవారు. వారికి మంజూరైన చెక్కులు హరీశ్‌రావు క్యాంపు ఆఫీసు ద్వారా పంపిణీ చేసేవారు. హైదరాబాద్‌ లోని కోకాపేటలో ఉన్న ఈ క్యాంప్‌ ఆఫీస్‌లో మెట్టుగూడ కు చెందిన జోగుల నరేశ్‌కుమార్‌ (40) కంప్యూటర్‌ ఆప రేటర్‌గా పనిచేశాడు.

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచి అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో.. డిసెంబర్‌ 6వ తేదీన హరీశ్‌రావు తన క్యాంపు కార్యాలయాన్ని మూసేశారు. వివిధ ప్రాంతాల లబ్ధిదారులకు చెందిన 240 సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులు ఆఫీసులో మిగిలిపోవడంతో.. వాటిని తిరిగి సచివాలయంలోని సీఎంఆర్‌ఎఫ్‌ కార్యాలయంలో అప్పగించాల్సిందిగా నరేశ్‌కుమార్‌కు సూచించారు. ఇక్కడే నరేశ్‌ తన తెలివితేటలు ప్రదర్శించాడు.

మరో ముగ్గురిని కలుపుకొని..
సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల సొమ్మును కొల్లగొట్టాలని భావించిన నరేశ్‌కుమార్‌.. అసెంబ్లీలో అటెండర్‌గా పనిచేస్తున్న బాలగోని వెంకటేశ్‌ (35), ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బీఆర్‌ఎస్‌ నేత కొర్లపాటి వంశీ (24), గోదావరిఖనికి చెందిన పులిపాక ఓంకార్‌(34)తో కలసి పథకం వేశాడు.

ఓంకార్‌ ఈ చెక్కులపై ఉన్న పేర్లను పోలిన పేర్లున్న ఇతర వ్యక్తులను గుర్తించి.. వారి ఖాతాల్లో చెక్కులను డిపాజిట్‌ చేయించాడు. వారి నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ చేయించుకుని.. నలుగురూ పంచుకుంటూ వచ్చారు. చెక్కులు మాయమైన విషయం తెలుసుకున్న హరీశ్‌రావు.. గత ఏడాది డిసెంబర్‌ 17వ తేదీనే నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు కూడా.

ఓ లబ్ధిదారు ఫిర్యాదుతో వెలుగులోకి..
తనకు సీఎంఆర్‌ఎఫ్‌ సాయం మంజూరైనా, చెక్కు రాకపోవడంతో మెదక్‌ జిల్లా పీర్ల తండాకు చెందిన రైతు రవినాయక్‌ ఆరా తీశారు. అయితే ఆయన పేరుపై సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు వచ్చిందని, సొమ్ము కూడా డ్రా అయిందని తేలింది. దీనిపై ఆయన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు లోతుగా దర్యాప్తు చేయగా.. నరేశ్, వంశీ, వెంకటేశ్, ఓంకార్‌ల నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వారు కోట్ల రూపాయలు కొల్లగొట్టినట్టు తేలింది.

గడువు తీరడంతో కొన్ని చెక్కులను దహనం చేశామని వంశీ పోలీసులకు చెప్పినట్టు తెలిసింది. చెక్కుల గోల్‌మాల్‌ విషయం తెలిసిన లబ్ధిదారులు ఠాణాకు క్యూకట్టారు. ఇప్పటికే 24 మంది ఫిర్యాదు చేసినట్టు సమాచారం. పోలీసులు నిందితులపై ఐపీసీ సెక్షన్లు 417, 419, 420, 120 (డి), 66 (సి) ఐపీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు . 

నరేశ్‌తో సంబంధం లేదు.. చెక్కులపై గతంలోనే ఫిర్యాదు..
హరీశ్‌రావు కార్యాలయం ప్రకటన
సాక్షి, హైదరాబాద్‌: సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల వ్యవహారం బయటపడటంతో.. వాటిని మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాజేశాడంటూ బుధవారం సోషల్‌ మీడి యాలో, బయటా ప్రచారం జరిగింది. దానిని ఖండిస్తూ హరీశ్‌రావు కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘నరేశ్‌ అనే వ్యక్తి మాజీ మంత్రి హరీశ్‌రావు పీఏ కాదు. అతను కంప్యూటర్‌ ఆపరేటర్, తాత్కాలిక ఉద్యోగి. మంత్రిగా హరీశ్‌రావు పదవీకాలం పూర్తయిన నేపథ్యంలో.. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2023 డిసెంబర్‌ 6న క్యాంపు కార్యాలయాన్ని మూసివేసి, సిబ్బందిని పంపించి వేశాం. ఆ రోజు నుంచి నరేశ్‌ అనే వ్యక్తితో హరీశ్‌రావు కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదు.

అయితే ఆఫీసు మూసివేసే క్రమంలో ఎలాంటి సమాచారం లేకుండా నరేశ్‌ కొన్ని సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను తన వెంట తీసుకువెళ్లినట్టు మా దృష్టికి వచ్చింది. దీనిపై డిసెంబర్‌ 17వ తేదీనే నార్సింగి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఈ వాస్తవాలను గుర్తించకుండా మాజీ మంత్రి పీఏ చెక్కులు కాజేశాడంటూ తప్పుడు ప్రచారం జరుగుతోంది. ఒక వ్యక్తి చేసిన తప్పును మొత్తం కార్యాలయానికి వర్తింపచేయడం బాధాకరం. వాస్త వాలను గుర్తించాలి’’ అని ప్రకటనలో పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement