గిరిజన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గిరిజన హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 24 గంటల రిలే నిరాహార దీక్షలను గురువారం విరమించింది.
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గిరిజన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గిరిజన హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 24 గంటల రిలే నిరాహార దీక్షలను గురువారం విరమించింది.
పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ సుబ్బరాయుడు, జిల్లా అధ్యక్షుడు జె.సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి బి.వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసులు, దళిత ప్రజాపార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ తదితరులు ఈ విషయాన్ని ఏజేసీకి వివరించారు. త్వరలో గిరిజన భవనానికి అవసరమైన స్థలాన్ని చూపెడతామని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని ఏజేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రనాయక్ పాల్గొన్నారు.