8న జిల్లా అధికారుల రిలే దీక్ష | 8th on wards relay fast on the district officers | Sakshi
Sakshi News home page

8న జిల్లా అధికారుల రిలే దీక్ష

Published Thu, Sep 5 2013 4:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:16 PM

8th on wards  relay fast on the district officers

కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జిల్లా స్థాయి అధికారులు ఈ నెల 8న కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే నిరాహారదీక్షను చేపట్టాలని నిర్ణయించామని జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. బుధవారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు.

అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు తమ సిబ్బందితో కలిసి ఆ రోజు దీక్షల్లో పాల్గొంటారని తెలిపారు. కలెక్టరేట్ వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు చేస్తున్న రిలే దీక్షా శిబిరాలను తాము ప్రతిరోజూ సందర్శించి సంఘీభావం ప్రకటిస్తామన్నారు. ఈనెల 7వ తేది హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న సేవ్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమానికి జిల్లా నుంచి ఉద్యోగులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో డీఆర్‌ఓ ఈశ్వరయ్య, ఆర్డీఓ వీరబ్రహ్మయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి ప్రభాకర్‌రావు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి వెంకటేశ్వర ప్రసాద్, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ తిప్పేస్వామి, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రభుదాస్, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ఖాదర్‌బాష, రాజీవ్ విద్యామిషన్ పీఓ సూర్యనారాయణరెడ్డి, ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ లీలావతి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోహిణి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement