sudharshan reddy
-
చాయ్‌కీ డబ్బులు లేవు.. సీఎం స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నా
సాక్షి, హైదరాబాద్: ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తే దేశం మొత్తం చర్చ జరుగుతుందని సమావేశాన్ని బహిష్కరించిన సీఎం కేసీఆర్‌లాగే సోమవారం ఆయన ఆధ్వర్యంలో నిర్వహించనున్న స్థానిక సంస్థల సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ఘట్కేసర్ ఎంపీపీ, ఎంపీపీల ఫోరం జిల్లా అధ్యక్షుడు ఏనుగు సుదర్శన్‌రెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా అవుషాపూర్‌లో ఆదివారం ఆయన ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల అభివద్ధికి నిధులు విడుదల చేయాలని మూడేళ్లుగా సర్పంచులు, ఎంపీటీసీలు, పాలకవర్గాల తరఫున మంత్రులు, అధికారుల చుట్టూ తిరిగినా నిధులు విడుదల చేయనందున మండల పరిషత్ కార్యలయం ఆవరణలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశానన్నారు. నిధుల విడుదలపై చర్చ జరగాలనే సీఎం నేతృత్వంలోని సమావేశానికి వెళ్లకూడదని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఎందుకంటే సీఎం సమావేశంలో చర్చించే అవకాశం తమకు రాదన్నారు. సమావేశాన్ని బహిష్కరిస్తే చర్చ జరిగి నిధులు వస్తాయన్న నమ్మకం ఉందని, మూడేళ్లుగా మండల పరిషత్ సమావేశాల్లో చాయ్ డబ్బులు చెల్లిద్దామన్న నిధులు లేని దుస్థితి ఉందన్నారు. నిధులు విడుదలపై అధికారులు, మంత్రులు కూడా స్పందించడం లేదని సుదర్శన్‌రెడ్డి ఆరోపించారు. చదవండి: ట్రాఫిక్ రద్దీకి చెల్లు.. సైబరాబాద్ పోలీసుల కీలక నిర్ణయం -
ఏకకాలంలో రూ.2 లక్షల మాఫీ
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డం పెట్టుకుని మాయ మాటలతో ప్రజలను మోసగించి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ బోధన్ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో మహకూటమి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుందని, తాము అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల చొప్పన పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పారు. బుధవారం మండలంలోని రాజీవ్‌నగర్ తాండ, బెల్లాల్, ఊట్పల్లి, అమ్దాపూర్ గ్రామాల్లో సుదర్శన్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు. హామీల అమలులో టీఆర్ఎస్ విఫలమైందని, స్వార్థ ప్రయోజనాల కోసం మిషన్ భగీరథ వంటి పథకాలను చేపట్టిందని మండిపడ్డారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలో వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. లక్ష ఉద్యోగాలు భర్తి చేస్తామని, అప్పటివకు నిరుద్యోగులకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అందిస్తామని చెప్పారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీ సర్కారు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. నల్లధనం వెనక్కి తెచ్చి అందరి ఖతాల్లో రూ.15లక్షలు వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యుల నడ్డి విరిచారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మండలాధ్యక్షుడు నాగేశ్వర్రావ్, నేతలు నరేందర్‌రెడ్డి, సంజీవ్‌రెడ్డి, ఖలీల్, శంకర్, సురేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
హామీలను టీఆర్ఎస్ విస్మరించింది
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టి, లేనిపోని హామీలను ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన విస్మరించి స్వలాభం, కమీషన్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన టీఆర్ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ అన్నారు. మంగళవారం బోధన్ మండలంలోని నాగన్‌పల్లి, కొప్పర్తి, జాడిజమాల్ పూర్, చిన్నమావంది, సాలూర క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి గ్రామాల్లో మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 100రోజులో ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇచ్చిన హామీని టీఆర్ఎస్ తుంగలో తొక్కిందన్నారు. ఫ్యాక్టరీ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని, పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. పలువురిని పార్టీలో చేర్చుకున్నారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించి బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందించడంతో పాటు వడ్డీ లేకుండా రూ.10లక్షలు రుణం అందిస్తామన్నారు. ప్రతి మహిళ సంఘం సభ్యులకు రూ.5లక్షల ప్ర మాద బీమా కూడ కల్పిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు.. పేదల సొతింటి కలను సహకారం చేసేందుకు కొ త్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఆర్థికసా యం అందిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలు అయితే రూ.6లక్షలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు. అమలు చేసే హామీలే చెపుతున్నాం.. రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న టీఆర్ఎస్, బీజేపీ పార్టీ లాగా తమ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇవ్వదని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందిపాల్జేస్తున్న టీఆర్ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నాగేశ్వర్రావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మాజీ ము న్సిపాల్ చైర్మన్ గౌసుద్దీన్, నాయకులు గణపతి రెడ్డి, వీరభద్ర రావ్, ఖలీల్ తదితరులున్నారు. -
అభివృద్ధి కోసం ఆదరించి గెలిపించండి
సాక్షి, నర్సంపేట: నియోజవకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తెప్పించి 30 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని చేసి చూపించానని తెలిపారు. ఈ ఎన్నికల్లో 105 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు. కేసీఆర్ కుటుంబం త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి జరిగిందన్నారు. రెండు పంటలకు సరిపోను నీటిని అందించి లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రత్యేక ప్రణాళికతో నర్సంపేటను మోడల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. తాను గెలిచిన వెంటనే అన్ని రకాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, జిల్లా నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, దార్ల రమాదేవి, గంప రాజేశ్వర్‌రావు, పుట్టపాక కుమారస్వామి, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్లో చేరికలు... నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. పార్టీలో చేరిన వారికి పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. -
నిజం చెప్పే బాధ్యత మీడియాదే
విశ్లేషణ గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 220 మందికి పైగా పాత్రికేయులను హతమార్చారు. బలమైన మార్పు వస్తోందని, ఎంతో మేధో మథనం జరగాల్సిన ఆవశ్యకత ఉన్నదని ఈ వాస్తవం సూచిస్తోంది. గౌరీ లంకేశ్ హత్య, ఆ మథనాన్ని మన ఇళ్లలోకి ఈడ్చుకొచ్చేసింది. అసమ్మతులకున్న ఉదారవాద అవకాశాలను హరించడమే లక్ష్యంగా పెట్టుకున్న సంస్థలు, బృందాలపై అప్పుడప్పుడూ చేపట్టే నిరసనలు ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు. ఆమె హత్య వెన్నంటే జరిగిన శంతను భౌమిక్ హత్య దీన్ని స్పష్టం చేసింది. ఈ సెమినార్లో కీలక ఉపన్యాసాన్ని చేయమని ఆహ్వానించినప్పుడు తొలుత నేను సున్నితంగా తిరస్కరించాలని అనుకున్నాను. కానీ ఇటీవల జరుగుతున్న వివిధ ఘటనల ధ్రుతి, ఉద్వేగాల తీవ్రత, అవి వ్యక్తమౌతున్న తీరు కారణంగా నిర్దిష్టమైన అభిప్రాయానికి చేరడం మరింత కష్టంగా మారిం దని మొదటగా అనిపించింది. బహుకోణాలూ, ప్రయోజనాలూ, సాంప్రదా యేతర దృక్పథాల నుంచి ప్రపంచాన్ని పరిశీలించవలసి ఉండగా తొందరపడి వ్యాఖ్యానించడం వల్ల సమంజసమైన, హేతుబద్ధమైన చర్చను పక్కదారి పట్టించినట్టు అవుతుంది. వివిధ రకాల సామాజిక, రాజకీయ, ఆర్థిక శక్తులు, కథనాలు, వివిధ అస్తిత్వ సమస్యలతో అవి కలసి ఏర్పడిన వివిధ కూటముల మిశ్రమం ఆవిష్కృతమౌతుంది. అది చాలా అస్పష్ట చిత్రాన్ని మాత్రమే అంది స్తుంది. కాబట్టి మనం ఎక్కడ, ఏ లక్ష్యాలతో ప్రారంభించాం, ఏం తప్పు జరిగింది అనే లోతైన పునరాలోచన అవసరం. అంతర్జాతీయ, జాతీయ, స్థానిక స్థాయిలలోని సమష్టి కార్యాచరణ రూపాలు, ఉద్దేశాల ప్రామాణిక ప్రాతిపదికలు వేగంగా బలహీనపడిపోతున్నాయనేది మాత్రమే తక్కువ అస్ప ష్టంగా ఉన్నట్టుంది. పలు దృక్కోణాల పట్ల సహనం, శాంతియుతమైన చర్చ, భావాల సంఘర్షణకున్న శక్తి వంటి ప్రామాణిక ప్రాతిపదికలు మానవ సంస్కృతిలో లోతుగా వేళ్లూనుకుని ఉన్నవని మనం మాట్లాడుకుని ఎంతో కాలం కాలేదు. గత ఏడేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 220 మందికి పైగా పాత్రికే యులను హతమార్చారనే వాస్తవం క్రమంగా మింగుడుపడుతూ ఇప్పుడు వీస్తున్న గాలి దిశలో బలమైన మార్పు వస్తోందని, ఎంతో మేధో మథనం జర గాల్సిన ఆవశ్యకత ఉన్నదని సూచిస్తోంది. గౌరీ లంకేశ్ హత్య, ఆ మథనాన్ని మన ఇళ్లలోకి ఈడ్చుకొచ్చేసింది. అస మ్మతులకున్న ఉదారవాద అవకాశాలను హరించడమే లక్ష్యంగా పెట్టుకున్న రాజకీయ సాంస్కృతిక సంస్థలు, బృందాలపై అక్కడక్కడా అప్పుడప్పుడూ చేపట్టే నిరసనలు, బహిరంగ చర్చ ఎలాంటి ప్రభావాన్ని చూపలేవని ఆమె హత్యను వెన్నంటే జరిగిన శంతను భౌమిక్ హత్య స్పష్టం చేసింది. ముందు ముందు మనం చేయాల్సి ఉన్న అనివార్యమైన గొప్ప పోరాటానికి ముందస్తు సూచనగా ఈ హత్యలు కనిపిస్తున్నాయి. మాట్లాడరాదు అన్న క్షణికమైన నా విముఖతను మాట్లాడాల్సిన అవసరం అధిగమించింది. దాడి జరుగుతున్నది సరిగ్గా మాట్లాడే హక్కుపైనే అనే అవగాహనే మాట్లాడాలన్న నా కోరకకు ప్రాతిపదిక. ఉదారవాద ప్రజాసామ్యం పునాదులపై దాడులు మన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికీ, మన పరిస్థితులను వివరించడా నికీ, వివిధ స్థాయిల సమష్టి కార్యాచరణ కోసం ఏర్పడిన వివిధ సంస్థలలో భాగం కావడానికీ మనుషులుగా మనకున్న ప్రాథమిక హక్కే దాడికి గురవు తోంది. అస్తిత్వపరమైన ఈ ముప్పును ముందుకు నెడుతున్నది అసమానతా వాద శక్తులేనని, వాటితో మనం పోరాడాల్సిఉందనే అవగాహన హేతు బద్ధంగా ఉండే వారిలో క్రమంగా పెరుగుతోంది. కొద్దిపాటి సంఖ్యలో ఉన్న వారు సామాజిక కార్యాచరణ వల్ల కలిగే ప్రయోజనాలలో అత్యధికాన్ని సొంతం చేసుకుని, మిగతా వారికి దాదాపుగా ఏమీ లేకుండా చేసే సామాజిక హక్కు తమకు ఉన్నదనే వాదన ఈ శక్తులను బలోపేతం చేస్తోందని కూడా వారు గుర్తిస్తున్నారు. ఈ శక్తులు ఉదారవాద ప్రజాస్వామ్యం పునాదులపైన దాడులను రోజురోజుకీ ముమ్మరం చేస్తున్నాయి. ఉదారవాద ప్రజాస్వా మ్యంలో అతి ముఖ్యమైన లక్ష్యం ఆత్మగౌర వ పరిరక్షణ. ఇతర లక్ష్యాలన్నిటికీ అదే ఆధారం. అన్నిటినీ సొంతం చేసుకునేవారికి మాట్లాడే స్వేచ్ఛ తప్పక సమస్యాత్మకమైనది అవుతుంది. కాబట్టి ప్రజలపైన, వారి అభిప్రాయాలు, స్వరాలపైన క్రమశిక్షణ ను రుద్దాలనే తర్కంలో వాక్ స్వాతంత్య్ర విధ్వంసం అనివార్యం అవుతుంది. ‘‘భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’కు రాజ్యాంగంలోని అధికరణం 19 హామీని, సమంజసత్వాన్ని కల్పిస్తోందని సుప్రీం కోర్టు పలు తీర్పుల ద్వారా చెప్పింది. పత్రికా స్వేచ్ఛను దానికి సమానమైనదిగా పరిగణించడాన్ని సైతం అనుమ తించారు. అలాంటి స్వేచ్ఛలు ప్రజాభీష్ట ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసి, పరిరక్షిస్తాయి కాబట్టి అది ప్రజాస్వామ్యపు ఆవశ్యకమైన లక్షణం అవుతుంది. సహేతుకమైన ఆంక్షలు తప్ప, పౌరులకు నిర్మొహమాటమైన బహిరంగ చర్చలు సాగించడానికి అవకాశాలు లభించడం ద్వారానే ప్రజాస్వామ్యం ప్రజల ప్రభుత్వంగా ఉండగలుగుతుందని మన రాజ్యాంగం చెబుతుంది. ప్రజల్లో నిరక్షరాస్యత, పేదరికం విస్తృతంగా ఉన్నాగానీ సార్వత్రిక ఓటు హక్కు ప్రాతిపదికపై నిర్మిస్తున్న మన ప్రజాస్వామ్యం ఎంతో కాలం మన లేదని పలువురు రాజ్యాంగ నిపుణులు గతంలో పెదవి విరిచారు. కానీ, పేదలు, నిరక్షరాస్యులైన వారే ఓటు హక్కును వినియోగించుకునేవారిలో అత్యధికులని తర్వాతి కాలంలో రుజువైంది. సహనం, రాజకీయ సమానత్వం అనే సూత్రాలపై వివిధ రాజ్యాంగబద్ధ సంస్థలను జాగ్రత్తగా నిర్మించుకునే రీతిలో మన ప్రజాస్వామ్యం దాదాపు 70 ఏళ్లుగా మనగలిగింది. అందుకు ప్రధాన కారణం ప్రజలు ఓటు హక్కును ఉపయోగించుకోవడమే. ఉదారవాద ప్రజాస్వామ్యం పునాదులపై దాడులు పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో జనాకర్షక నాయకత్వం, పోటీతత్వం గల పార్టీ రాజకీయాలు కలసి అధికారం కోసం ఎన్నికల బరిలోకి దిగే క్రమం అధికార కేంద్రీకరణకు దారి తీయవచ్చని భారత మానవతావాదులలో అత్యంత ప్రముఖులైన ఎంఎన్ రాయ్ (1946) హెచ్చరించారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పనితీరును సమీక్షించేది మళ్లీ ఎన్నికలప్పుడే కాబట్టి, ఈలోగా అధికారం నెరపేవారి అన్ని చర్యలు, ప్రత్యేకించి ప్రజలకు తెలి యకుండా చేసే పనులు కూడా సమంజసమైనవిగా ప్రజలకు కనిపించే అవకాశం ఉన్నదంటూ రాయ్ వ్యాఖ్యానించారు. పేదప్రజల పేరిట పెద్ద ఎత్తున అన్యాయాలకు పాల్పడే ప్రమాదం ఉన్నదంటూ ఆయన ఆందోళన వెలిబుచ్చారు. ఈ భయాందోళనలు సమంజసమైనవేనని చరిత్ర నిరూపిం చింది. ప్రజల తీర్పును ఫాసిస్టు ప్రభుత్వాలు వాడుకున్నాయి, నిర్ణయాలను తీసుకునే నిరపేక్ష అధికారాన్ని కట్టబెట్టేసుకుని పౌరులకు ప్రశ్నించే స్వేచ్ఛే లేకుండా చేశాయి. మతం, జాతి, భావజాలం, వ్యక్తిత్వం, భాష, వర్ణం వంటి రకరకాల ఉద్వేగపరమైన అంశాలను అందుకు అధికారంలో ఉన్నవారు విని యోగించుకున్నారు. వాటి సహాయంతో పౌరులలో చీలికలు తెచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మీడియా ఆవశ్యకంగా కావలిదారు పాత్ర పోషిం చాలి. ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలనూ, వాటి పర్యవసానాలనూ వార్తలూ, వ్యాఖ్యల ద్వారా మీడియా పౌరులకు తెలియజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునే క్రమంలో విధిగా జరగవలసిన సలహా సంప్రదింపుల కార్యక్రమానికి ప్రజలను దూరం చేయడం ద్వారా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా నివారించవలసిన బాధ్యత ప్రధానంగా మీడియాదే. ఈ అర్థంలో ప్రజాస్వామ్యం అంటే వోటు హక్కు వినియోగించు కోవడం మాత్రమే కాదు, అధికార దుర్వినియోగాన్నీ, అమాయక ప్రజల హక్కులకు గండి కొట్టడాన్నీ నివారించడంతో పాటు మీడియా వంటి పౌర సమాజ సంస్థలను నిర్మించడం కూడా. కాబట్టి, ‘‘వాక్ స్వాతంత్య్రం’’ ప్రజా స్వామిక భాగస్వామ్యాన్ని విస్తరింపజేసే సాధనమని చెప్పవచ్చు. కానీ, వాక్ స్వాతంత్య్రం అత్యంత ఆవశ్యకంగా మనిషి ఆత్మగౌరవం అనే భావనలో స్థాపితమై ఉంది. అది, మానవుడు కావడం వల్ల ప్రతి పౌరుడికీ/మనిషికీ ఉండే హక్కులన్నిటిలోనికీ కీలకమైనదీ, ప్రాథమికమైనదీ. గౌరీ లంకేశ్, జాతీయ లేదా రాష్ట్ర స్థాయిలో సుప్రసిద్ధమైన అనే అర్థంలో ‘‘విజయవంతమైన’’ పాత్రికేయురాలేమీ కారు. పరిమితమైన నిధులతో, తరచుగా ఎదురయ్యే అర్థిక ఇబ్బందులతో ఆమె దాదాపు పది వేల సర్క్యు లేషన్ ఉన్న ఒక ప్రాంతీయ పత్రికను నడిపారు. కానీ ఆమె భావాల శక్తి అంత కంటే ఎక్కువ ప్రాధాన్యం గలది. పేదలను, నిర్లక్ష్యానికిగురైన వారిని, దోపి డీకి గురయ్యే వారిని లెక్కలోకి తీసుకోకుండా వదిలేస్తున్న సువ్యవస్థిత రాజకీయ ఆర్థిక వ్యవస్థకు ఆమె ప్రమాదంగా కనిపించారు. సామాజిక న్యాయంకోసం నినదించిన ఆమె గొంతును శాశ్వతంగా మూగబోయేలా చేశారు. ఇంతకు ముందెన్నోసార్లు జరిగినట్టు, భారత రాజ్యాంగపు స్ఫూర్తిని, జాతి అంతరాత్మను దారుణంగా దెబ్బతీశారు. ఆమె హత్య మనందరికీ పంపిన హెచ్చరిక ఆమె హత్యా దృశ్యం తక్కువ భీకరమైనదేం కాదు. తన సొంత ఇంటి ముందే కారు పార్క్ చేసుకుందామని గేటు తీస్తుండగా మహిళను చీకట్లోంచి వచ్చిన హంతకుడు పాశవికంగా హతమార్చాడు. ఆ హత్య పంపిన సందేశం స్పష్టమే. రాజ్యాంగపరమైన సాధనాల గురించి మాట్లాడే వారు, వాక్ స్వాతంత్య్రం సహజ హక్కని చాటేవారు, కొందరి బాగు కోసం దేశాన్ని కొల్ల గొడుతున్న వారికి వ్యతిరేకంగా నిర్లక్ష్యానికి గురవుతున్నవారి పక్షాన మాట్లాడే వారు ఎవరైనాగానీ.. వారి ఇళ్లల్లో సైతం సురక్షితంగా ఉండరు. మనం చేయాల్సింది ఏమిటి? ఇలాంటి ప్రపంచంలో మనం భయం ఎరుగని పాత్రికేయతను ఎలా ముందుకు తీసుకుపోగలం? అధికారంతో నిజం మాట్లాడటం అనేది పాత్రికేయ వృత్తిలోని ప్రథమ సూత్రం. ఆ సూత్రాన్ని పాటించడమే జాతి ద్రోహమనే చోట ఏమి చేయాలి? ఈ ప్రశ్నకు ఎన్నో సమాధానాలు ఉండొచ్చు. అయితే నేను ఒక చిన్న సూచన చేస్తాను. పాత్రికేయవృత్తి, దానికి అవిభాజ్యమైన వాక్ స్వాతంత్య్రం ‘‘అధికారంతో నిజం మాట్లాడటం’’ కోసమే అయితే... అప్పుడు దాన్ని నిజాయితీగా చెప్పండి. ప్రత్యేకించి ప్రజాబాహుళ్యపు ఆత్మగౌరవాన్ని దిగ జారుస్తుండటం గురించి మాట్లాడండి. మన ఎదుట నిలిచిన ఒకే ఒక్క సత్యం అదే. దాన్ని గుర్తించడానికి, దాని గురించి మనలో మనం మాట్లాడుకోడానికి, మన పేరిట, మన తరఫున అధికారాన్ని చెలాయిస్తున్న వారితో మాట్లాడటా నికి మనం నిరాకరిçస్తున్నాం. ప్రభుత్వంతో నిజం మాట్లాడేవారికి హాని జరిగితే ప్రజలు తమను శిక్షిస్తారని శక్తివంతులు, వారి నియంత్రణలోని బృందాలు గుర్తించేలా చేయాలి. లేకపోతే మనమంతా గౌరి, శంతను ఎదుర్కొన్న పరిస్థితినే ఎదు ర్కోవాల్సి వస్తుంది. తిరోగమించే అవకాశం మనకు లేదు. అలాచేసినా మరో నెపంతో మనపై మరోసారి దాడి చేస్తారు. ప్రభుత్వంతో నిజం మాట్లాడ టాన్ని, శక్తిహీనులైన ప్రజాశ్రేణులకు ఏం జరుగుతోంది, ఏం చేస్తున్నారు అనే ప్రశ్నలపైన నిజాయితీగా మాట్లాడటాన్ని మనం తిరిగి నేర్చుకోవడం అవ సరం. పాలకులకు నిజం చెప్పేందుకు దోహదం చేసే నైతిక వ్యవస్థ పునా దులను తిరిగి పటిష్ఠం చేసేందుకు మీలో ప్రతి ఒక్కరూ నడుం బిగిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. (హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో సెప్టెంబర్ 25న ‘మాట్లాడే హక్కు ఎవరి కోసం?’ అనే అంశంపైన జరిగిన సెమినార్లో చేసిన కీలకోపన్యాసం సంక్షిప్తంగా) వ్యాసకర్త సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి -
రాజీనామాలు చేయనున్న ఏజీ, అదనపు ఏజీ!
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో నేడు అపాయింట్మెంట్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అడ్వొకేట్ జనరల్(ఏజీ)గా ఉన్న ఎ. సుదర్శన్‌రెడ్డి, అదనపు అడ్వొకేట్స్ జనరల్ కె.జి.కృష్ణమూర్తి, బి. భాస్కరరావు తమ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో వారు మంగళవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ సీఎం కె. చంద్రశేఖరరావును కలవనున్నారు. ఈ మేరకు సీఎంతో వారికి అపాయింట్మెంట్ కూడా ఖరారైనట్టు సమాచారం. కేసీఆర్‌కే వారు స్వయంగా తమ రాజీనామా లేఖలను అందజేయనున్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో సుదర్శన్‌రెడ్డి ఏజీగా నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందే, ప్రస్తుతం ఉన్న ఏజీ, అదనపు ఏజీలు, ప్రభుత్వ న్యాయవాదులను తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యే వరకు ఆ పోస్టుల్లోనే కొనసాగాలని ప్రభుత్వం గత వారం ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ సుదర్శన్‌రెడ్డి రాజీనామాకు సిద్ధపడటం న్యాయవాద వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన సన్నిహితులతో చర్చించిన తర్వాతనే సుదర్శన్‌రెడ్డి ఏజీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నించారు. అయితే కేసీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా సాధ్యం కాలేదు. దీంతో మంగళవారం ఉదయం వారు కేసీఆర్‌ను కలవనున్నారు. -
నేడే.. పల్లె ఫలితాలు
మూడు కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ఒక టేబుల్లో ఓ ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ఒక్కో రూములో ఆరు టేబుళ్లు మధ్యాహ్నంలోపు ఎంపీటీసీ ఫలితాలు సాయంత్రానికల్లా జెడ్పీటీసీ ఫలితాలు కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ మాల్యాద్రి కడప : ప్రతిష్టాత్మకంగా సాగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలపై ఉత్కంఠతకు మంగళవారంతో తెరపడనుంది. జిల్లాలో రెండు విడతల్లో ఏప్రిల్ 6, 11 తేదీల్లో 535 ఎంపీటీసీ స్థానాలు, 50 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఎంపీటీసీ బరిలో 1695 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ బరిలో 237 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇప్పటికే 24 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాజంపేట డివిజన్‌కు సంబంధించి శ్రీనివాస ఇంజనీరింగ్ కళాశాలలో, కడప డివిజన్ లెక్కింపు కేశవరెడ్డి స్కూలులో, జమ్మలమడుగు డివిజన్ లెక్కింపు మదీనా ఇంజనీరింగ్ కళాశాలలో జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 50 మండలాలకు సంబంధించి మూడు కౌంటింగ్ కేంద్రాలలో 50 రూములలో ఒక్కొక్క రూముకు ఆరు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేశారు. ఒక్కొక్క ఎంపీటీసీ ఫలితాల లెక్కింపును ఒక్కో టేబుల్‌పైన చేపడతారు. జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాల లెక్కింపులో ఒక్కో రౌండ్‌కు వెయ్యి ఓట్ల చొప్పున లెక్కిస్తారు. ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మధ్యాహ్నం లోపే వెల్లడి కానున్నాయి. జెడ్పీటీసీ ఫలితాలు సాయంత్రంలోగా రానున్నాయి. మొదటగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు చేపడతారు. కౌంటింగ్ కేంద్రాలకు ఆరు గంటల్లోపే బాక్సుల తరలింపు కొత్త కలెక్టరేట్లోని స్ట్రాంగ్ రూములో ఎంపీటీసీ, జెడ్పీటీసీ బ్యాలెట్ పత్రాలను భద్రపరిచారు. వీటిని ఆయా మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓలు, ఆర్వోల నేతృత్వంలో ఉదయం 3 నుంచి ఆర్టీసీ డీజీటీల ద్వారా కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన తాత్కాలిక స్ట్రాంగ్ రూములకు చేరుస్తారు. వీటిని తరలించే సమయంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ కేంద్రంలోకి కౌంటింగ్ ఏజెంటుతోపాటు అభ్యర్థినిమాత్రమే అనుమతిస్తారు. అభ్యర్థి ఆర్వో వద్ద ఉంటే కౌంటింగ్ సరళిని ఏజెంటు పరిశీలిస్తారు. ఒక్కో టేబుల్ వద్ద ఒక సూపర్‌వైజర్‌తోపాటు ముగ్గురు కౌంటింగ్ అసిస్టెంట్లను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ఒక్కొక్క కౌంటింగ్ కేంద్రం వద్ద 400 మందికి పైగా పోలీసులను మోహరిస్తున్నారు. 2200 మందికి పైగా సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొంటున్నారు. కడప డివిజన్‌కు సంబంధించి కౌంటింగ్ కేంద్రంలో బందోబస్తు ఏర్పాట్లను కడప డీఎస్పీ రాజేశ్వరరెడ్డి పరిశీలించారు. కౌంటింగ్ ఏర్పాట్లను పరిశీలించిన జెడ్పీ సీఈఓ కౌంటింగ్ కేంద్రంలో ఓట్ల లెక్కింపునకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా జెడ్పీ సీఈఓ మాల్యాద్రి తమ సిబ్బందితో మూడు కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. లెక్కింపు సందర్బంగా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. సంబంధిత డీఎస్పీలతో బందోబస్తుపై చర్చించారు. పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటుచేసిన వసతులపై సిబ్బందితో ఆరా తీశారు. కౌంటింగ్ రోజున ఓట్ల లెక్కింపును జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎన్నికల పరిశీలకులు మురళీధర్‌రెడ్డి, బాల దిగంబర్, జేసీ రామారావు, ఏజేసీ సుదర్శన్‌రెడ్డితోపాటు సంబంధిత మూడు రెవెన్యూ డివిజన్ల అధికారులు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఆర్వోలు పర్యవేక్షిస్తారు. -
ముంపు మురిపెం
ఓవైపు ఎన్నోఏళ్లుగా ఎదురుచూస్తున్న నక్కలగండి( డిండి బ్యాలెన్సింగ్) రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేయడం.. మరో వైపు ముంపు పరిహారం విషయంలో బాధితులు చేస్తున్న పోరుకు స్పందించిన మంత్రులు స్పష్టమై హామీ ఇవ్వడం.. ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తంచేయడం.. ఆదివారం దేవరకొండ నియోజకవర్గంలో జరిగిన మంత్రుల పర్యటలో ఇవన్నీ ఆవిష్కృతమయ్యాయి. భారీనీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె. జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని ముంపుబాధితులతో మాట్లాడి భరోసా కల్పించారు. దేవరకొండ, న్యూస్‌లైన్ : నక్కలగండి రిజర్వాయర్ పనులకు శంకుస్థాపన చేసేందుకు వచ్చిన మంత్రుల ఎదుట ముంపుబాధితులు తమ గోడును వినిపించారు. ఒక్కొక్కరి సమస్యను అడిగి తెలుసుకున్నారు. సమస్యను పరిష్కరించాలంటూ అక్కడికక్కడే ఉన్నతాధికారులకు మంత్రులు సూచించారు. రెండు, మూడు రోజుల్లో తమకు నివేదిక పంపాలని ఆదేశాలిచ్చారు. సాక్షి కథనానికి స్పందన నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంలో భూని ర్వాసితులకు పరిహారం అందనివైనంపై ‘పరిహారమేలేదు.. ప్రారంభమా?’ అనే శీర్షికన సాక్షి దినపత్రికలో ఆదివారం ప్రచురితమైన కథనానికి మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి స్పందించారు. పరిహారం విషయంలో మొదట సర్వే చేసిన అధికారులు డీఅండ్డీడీ, జాయింట్ ఇన్స్పెక్షన్ అయిన తర్వాత ఎండిపోయిన బత్తాయి చెట్ల విషయంలో పరిహారాన్ని పరిగణనలోకి తీసుకోవడంలేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మంత్రి సుదర్శన్‌రెడ్డి భూసేకరణ అధికారి నిరంజన్‌తో మాట్లాడారు. పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గతంలో రిజర్వాయర్ కట్ట నిర్మాణానికి సేకరించిన 225 ఎకరాల భూమికి పరిహారాన్ని బలవంతంగా ఇవ్వడంపై రైతులు, స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ అభ్యంతరం చెప్పారు. దీంతో స్పందించిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి ..భూసేకరణ చట్టం-2013 ప్రకారం భూమికి పరిహారం తీసుకున్న తరువాత దానికి కొత్త భూసేకరణ చట్టం వర్తించదని పేర్కొనడంతో పాటు రెండు సార్లు ముంపునకు గురైన రైతుల విషయంలో మినహాయింపులుంటాయన్నారు. ఈ విషయమై రైతులకు న్యాయం జరిగేలా చూడాలని భూసేకరణ అధికారులను కోరారు. భూములు కోల్పోవడంతో పాటు సీపెజ్ (రిజ ర్వాయర్ వల్ల వచ్చే జాలు నీళ్లు) కారణంగా ఇళ్లల్లో ఉండడానికి వీల్లేని పరిస్థితులుంటాయని రైతులు మొరపెట్టుకోవడంతో స్పందించిన మంత్రి జానారెడ్డి.. ఈ విషయంలో దుగ్యాలను ఉదాహరణగా తీసుకుంటామన్నారు. రూ. 50 కోట్లు ఎక్కువైనా పర్వాలేదు కానీ ఆ ఆవాస ప్రాంతాలకు తప్పకుండా పునరావాసం కల్పిస్తామన్నారు. రెండు రోజుల్లోనే ఆవాసాల పూర్తి వివరాలు తమకు ఇవ్వాలని నీటిపారుదల శాఖ అధికారులను, భూసేకరణ అధికారులను ఆదేశించారు. చందంపేట మండలంలోని అటవీ ప్రాంతంలో ఉన్న మూడు గ్రామాలకు కృష్ణానది నుంచి మోటార్ల ద్వారా జలాలను అందించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని మంత్రి జానా హామీ ఇచ్చారు. -
కనుల పండువగా వసంత పంచమి
కొత్తపల్లి, న్యూస్‌లైన్: కొలనుభారతి పుణ్యక్షేత్రంలో మంగళవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే సరస్వతీ దేవి అమ్మవారికి గణపతిపూజ, సహస్రనామ కుంకుమార్చన చేశారు. శ్రీశైలం దేవస్థానం పంపిన పట్టువస్త్రాలను ప్రభుత్వ లాంఛనాలతో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆయన సతీమణి అపర్ణలు సమర్పించారు. ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులు వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకల్లో దాదాపు 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులంతా ముందుగా చారుఘోషిణి నదిలో స్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం 600 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు పలకలు, పెన్నులు, బలపాలు పంపిణీ చేశారు. కాశిరెడ్డినాయన సంఘం, ఆర్యవైశ్య సంఘం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు. -
నకలు నడవదు
మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే ప్రయివేటు కళాశాలలపై కఠిన చర్యలు యజమానులపై క్రిమినల్ కేసులు ఎస్పీని ఆదేశించిన మంత్రి అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు గూగుల్ సహాయంతో కేంద్రాలపై గట్టి నిఘా కంఠేశ్వర్, న్యూస్‌లైన్ : ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ నిరోధానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది తీవ్ర ఆరోపణలు రావడంతో జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిం చారు. ఈసారి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ జరిగితే కేంద్రం ఉన్న కళాశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రయివేటు కళాశాల ల యజమానులు సమన్వయంతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎస్పీ తరుణ్జోషిని మంత్రి వారం రోజుల క్రితమే ఆదేశించినట్లు తెలిసింది.ఏ కేంద్రంలోనూ మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని పేర్కొన్నట్టు సమాచారం . అరగంట ముందే పరీక్ష కేంద్రానికి ఈ ఏడాది ఇంటర్ బోర్డు కూడా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే రావాల్సి ఉంటుంది. ఉ దయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఎనిమిదిన్నర వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ రు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై నిఘా ఉంచుతారు. విద్యార్థుల సమక్షంలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరుస్తారు. దీంతో పేపర్ లీకును అరికట్టే అవకాశం ఉంటుం దని, మాస్ కాపీయింగ్‌నూ నిరోధించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈసారి జీపీఎస్ అనుసంధానంతో, గూగూల్ సహాయంతో పరీక్ష కేంద్రాలపై నిఘా ఏర్పా టు చేస్తున్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో, పరీక్ష హాలులో ఎవరు ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు. ఫోన్ల ద్వారా ఎస్ఎంఎస్ లు వచ్చిపోవడాన్ని గుర్తుపట్టనున్నారు. దీని ద్వారా సెల్ఫోన్ల ద్వారా జరిగే మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పడుతుందనేది అధికారుల ఆలోచన. ఉత్తమ ఫలితాల కోసం జిల్లాలో ఇంటర్లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మాస్ కాపీయింగ్‌ను నిరోధిస్తున్నారు. మార్చి 12 నుం చి పరీక్షలు ప్రారంభమై 26వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. మొదటి సంవత్సరంలో 28,158 మంది విద్యా ర్థులు, రెండవ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 25,311 మంది, ప్రైవేట్ విద్యార్థులు 5,307 మంది పరీక్షలు రాయబోతున్నారు. 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే శారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ఈ సారి మంచి స్థానాన్ని సంపాదించాలని అధికారులు భావిస్తున్నారు. పకడ్బందీగా నిర్వహిస్తాం ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. మాస్‌కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కొత్తగా జీపీఎస్ సహాయంతో పరీక్ష కేంద్రాలపై నిఘా ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. -విజయ్‌కుమార్, ఆర్ఐఓ -
వివేకానందుడే ఆదర్శం
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మెడికల్ కాలేజీ మైదానంలో వివేకానంద జయంతి ఉత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. ప్రతిరోజు వివేకానందుని సూక్తులను గుర్తు చేసుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సరస్వతి విద్యా పీఠం క్షేత్ర సంఘటన కార్యదర్శి(హైదరాబాద్) లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బలమే జీవనం, బలహీనతే మరణం అని చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడన్నారు. సంకల్పం మంచిదైతే, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెడితే విజయం తప్పక వరిస్తుందని రవీంద్ర విద్యా సంస్థల డెరైక్టర్ పుల్లయ్య అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఒక ఉత్తమ సంకల్పంతో కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ సర్కిల్లో వివేకానందుడి విగ్రహం ప్రతిష్టించిందన్నారు. ఆకట్టుకున్న ర్యాలీ : ఉదయం 10 గంటల నుంచి నగరంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వివేకానందుని చిత్ర పటాల ఫ్లెక్సీలతో ర్యాలీగా కదిలి వచ్చారు. కొందరు విద్యార్థులు వివేకానందుని వేషధారణలో ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, నగరపాలక సంస్థ కమిషనర్ వివిఎస్.మూర్తి, కట్టమంచి స్కూల్ డెరైక్టర్ జనార్దన్ రెడ్డి, వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరెడ్డి, కార్యాధ్యక్షులు కిష్టన్న, కోశాధికారి శివ ప్రసాదరావు,రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలల డెరైక్టర్ రామమోహన్, సుబ్బయ్య, కాళంగి నరసింహ వర్మ, సందడి సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. -
పేగుబంధం తెంచుకున్నారు
జమ్మికుంట, న్యూస్‌లైన్ : కని పెంచిన చేతులే కన్నకొడుకును అంతమొందించాయి. జులాయి తిరుగుళ్లు, వేధింపులు భరించలేక తల్లిదండ్రులే పేగు బంధా న్ని తెంపుకున్నారు. కాంట్రాక్ట్ మాట్లాడుకుని మరీ మట్టుబెట్టించారు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యారు. జమ్మికుంట మండ లం బిజిగిరి షరీఫ్ గుట్టల్లో యువకుడి హత్యకేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. తల్లిదండ్రులు, సోదరుడే కాంట్రాక్ట్ హత్య చేయించారని తేల్చారు. నిందితులను ఆదివారం అరెస్టు చూపిన డీఎస్పీ సుధీంద్ర, ఎస్సై పాపయ్యనాయక్తో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి మండలం పర్లపల్లికి చెందిన బొల్లు సుదర్శన్‌రెడ్డి-రమాదేవి దంపతులకు ఇద్దరు కుమారులు రంజిత్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి(26) ఉన్నారు. రంజిత్‌రెడ్డికి పెళ్లి కాగా, హోటల్ మేనేజ్మెంట్ చదివిన రణధీర్‌రెడ్డికి ఖాళీగా ఉంటున్నాడు. అతడికి పెళ్లి కాలేదు. తల్లిదండ్రుల నుంచి వేరుగా ఉంటున్న రణధీర్‌రెడ్డి ఆస్తి పంచాలంటూ కొన్నేళ్లుగా తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నాడు. అవసరాల కోసం డబ్బులు ఇవ్వాలంటూ తరచూ వేధిస్తున్నాడు. ఆస్తి పంచిస్తే అమ్ముకుంటానంటూ గొడవకు దిగుతున్నాడు. అతడి వేధింపులు నానాటికి ఎక్కువయ్యాయి. వేధింపులు భరించలేని తల్లిదండ్రులు... ఆస్తి పంచిస్తే మొత్తం అమ్ముకుం టాడనే ఉద్దేశంతో కొడుకును మట్టుబెట్టాలని పథకం వేశారు. ఇందుకు తమ బంధువైన వీణవంక మండలం చల్లూరుకు చెందిన శ్రీనివాస్‌రెడ్డితో ఒప్పందం కుదుర్చుకున్నారు. రణధీర్‌రెడ్డిని చంపిస్తే రూ.50 వేలు ఇస్తామని చెప్పారు. దీంతో శ్రీనివాస్‌రెడ్డి చల్లూరుకు చెందిన దోతుల రమేశ్‌తో కాంట్రాక్ట్ మాట్లాడుకున్నాడు. రూ.20 వేలు అప్పగించాడు. ఒప్పందం ప్రకారం గత నెల 25న పర్లపల్లిలో శ్రీనివాస్‌రెడ్డి, రమేశ్‌లు రణధీర్‌రెడ్డికి పర్లపల్లిలో మద్యం తాగించి బైక్‌పై బిజిగిరి షరీఫ్ గుట్టల వద్దకు పని ఉందం టూ తీసుకెళ్లారు. అక్కడ రణధీర్‌రెడ్డిని బండతో మోది చంపారు. అనంతరం శరీరాన్ని ఎవరూ గుర్తించకుండా పెట్రోల్ పోసి నిప్పంటించారు. రెండు రోజులకు స్థానికులకు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి గుర్తు తెలియని మృతదేహంగా కేసు నమోదు చేశారు. మృతదేహంపై లభించిన దుస్తుల ఆధారంగా విచారణ ప్రారంభించారు. అప్పటికే పర్లపల్లిలో రణధీర్‌రెడ్డి కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులకు లభించిన క్లూ ఆధారంగా మృతుడు రణధీర్‌రెడ్డి అని గుర్తించారు. కేసును లోతుగా విచారించగా మృతుడి కుటుంబసభ్యులపైనే అనుమానం కలిగింది. వారిని విచారించగా కుటుంబసభ్యులే కాంట్రాక్ట్ హత్య చేశారని నిర్ధారించారు. హత్యకు సంబంధించి చేసుకున్న ఒప్పందపత్రంతోపాటు నిందితుడి వద్ద ఉన్న రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నారు. మృతుడి తల్లిదండ్రులు సుదర్శన్‌రెడ్డి, రమాదేవి, సోదరుడు రంజిత్‌రెడ్డితోపాటు ప్రధాన నిందితుడు రమేశ్, శ్రీనివాస్‌రెడ్డిలను ఆదివారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
కష్టపడితేనే ఫలితాలు
నిజామాబాద్ సిటీ, న్యూస్‌లైన్: ఈ ఆర్థిక సంవత్సరం ముగి యడానికి మరో మూడు నెలల సమ యం ఉన్నందున అధికార యంత్రాం గం,ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేస్తే మంచి ఫలితాలు వస్తాయని మంత్రి సుదర్శన్‌రెడ్డి అన్నారు. నూ తన సంవత్సర వేడుకలలో భాగంగా గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో అధికారులు, మీడియా ప్రతినిధుల ‘గెట్ టు గెదర్’ నిర్వహించారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ నందిపేట మండలంలో 400 ఎకరాలలో 17 ర కాల ఆహార పదార్థాలు తయారు చేసే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు అనుమతి వచ్చిందన్నారు. రూ. 50 కోట్ల సబ్సిడీ ఈ పరిశ్రమకు లభించనుందన్నారు. ఐదు నుంచి పది వేల మందికి ఉపాధి దొరికే అవకాశముం దన్నారు. 2014లో జిల్లా ప్రజలకు ఇదొక శుభ పరిణామమన్నారు. వ్యవసాయం ద్వారా ఆదాయం జిల్లాలో రైతులు బాగా కష్టపడుతున్నందున వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా ఈ సంవత్సరం రెండు పంటలకుగాను రూ. నాలుగు వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులకు విత్తనాల ఇబ్బంది లేకుండా ఈ సంవత్స రం సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సంవత్సరంలో సోయా పంట మూడు లక్షల ఎకరాలలో పండిస్తున్నారని, రైతులను ఆదుకుంటామన్నా రు. జిల్లాలో పాల కేంద్రం సక్రమంగా లేదని, దీనిపై కలెక్టర్ దృష్టి సారిస్తే చిన్న పిల్లలకు నా ణ్యమైన పాలు అందించవచ్చన్నారు. జిల్లాలో మంచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేకంగా ప్రసూతి ఆస్పత్రి 15 రోజులలో వైద్య కళాశాలకు, ఆస్పత్రికి కొత్త గా అధికారులు,సిబ్బంది వస్తున్నారని మంత్రి తెలిపారు. ఈఎస్ఐ ఆస్పత్రిని 150 పడకలకు పెంచి, దానిని కేవలం ప్రత్యేకంగా ప్రసూతి కోసం కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ను అనువైన చోటుకు తరలించేందుకు అధికారులు ఆలోచించాలన్నారు. తద్వారా ఆస్పత్రికి మరిం త అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వీలవుతుందన్నారు. కొత్త కలెక్టర్ కార్యాలయం కోసం నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. ఇంజినీరింగ్ అధికారుల పనితీరు బాగుండాలి ఈ సంవత్సరం జిల్లా అధికారులు, ముఖ్యంగా ఇంజినీరింగ్ అధికారులు మరింతగా కష్టపడాలని కలెక్టర్ ప్రద్యుమ్న సూచించారు. పనులను సకాలంలో పూర్తి చేసి ల క్ష్యాలను అధిగమించాలన్నారు. మండల, డివిజన్ స్థాయి అధికారు లు క్షేత్ర స్థాయిలో పనులు పూర్తి చేయడానికి చ ర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా స్థాయి అధికారులు సరైన సూచనలు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ హర్షవర్ధన్, అదనపు జేసీ శేషాద్రి, బోధన్ సబ్ కలెక్టర్ హరి నారాయణన్, ఎస్పీ తరుణ్‌జోషీ, రాష్ట్ర గిడ్డం గుల అభివృద్ధి మండలి చైర్మన్ మహేష్‌కుమార్‌గౌడ్, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
తీపి కబురు అందేనా !
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: బోధన్‌లోని నిజాం షుగర్స్ భవిత వ్యం తేల్చేందుకు ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తెలంగా ణ రాష్ట్రం సిద్ధిస్తున్న తరుణంలో తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్యాక్టరీ సైతం ప్రభుత్వ ప రం అవుతుందన్న ఆశాభావంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడి హయాంలో ఈ ఫ్యాక్టరీని ప్రైవేట్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయాన్ని సమీక్షించేందుకు తెలంగాణ మంత్రుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం ఈనెల 13న కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు పి.సుదర్శన్‌రెడ్డి, డి.శ్రీధర్‌బాబు, గీతారెడ్డి, సునీత లక్ష్మారెడ్డితో పాటు సీమాంధ్రకు చెందిన మరో ముగ్గురు మంత్రులు సభ్యులుగా ఉన్నారు. ఈ సబ్‌కమిటీకి పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ప్రదీప్‌చంద్ర కన్వీనర్‌గా వ్యవహరి స్తున్నారు. పది రోజుల్లో నివేదిక సమర్పిం చాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సబ్‌కమిటీని ఆదేశించారు. ఆసియా ఖండంలో నే ఒకప్పుడు అతి పెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమగా ప్రఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ(ఎన్ఎస్ఎఫ్)ని 1936లో నిర్మించారు. 16 వేల ఎకరాలలో చెరు కు సాగుకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలు గా నిజాంసాగర్ ప్రాజెక్టును నిర్మించారు. కార్మికులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. నిజాం పాలన ముగిసిన తర్వాత ఫ్యాక్టరీ ప్రభుత్వ స్వాధీనమైంది. జిల్లా అభివృద్ధికే కాక రాష్ట్రంలో చక్కెర పరిశ్రమ విస్తరణకు దోహదపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించింది. పొరుగు జిల్లా కరీంనగర్‌తో పాటు మహారాష్ట్ర ప్రాంతవాసులు ఫ్యాక్టరీలో పని చేసి, ఇక్కడే స్థిరపడ్డారు. బాబు హయాంలో.. చాలాకాలం లాభాల్లో నడిచిన ఈ చక్కెర కర్మాగారం పాలకులు, ఫ్యాక్టరీ ఉన్నతాధికారుల స్వార్థానికి బలైంది. నష్టాల సాకు చూపిన చంద్రబాబు ప్రభుత్వం 2002లో ప్రైవేట్‌పరం చేసింది. రూ.300 కోట్ల విలువ చేసే ఫ్యాక్టరీ ఆస్తులను రూ.67 కోట్లకే డెల్టా పేపర్ సంస్థకు కట్టబెట్టింది. ప్రైవేట్ సంస్థకు 51 శాతం, ఎన్ఎస్ఎఫ్కు 49 శాతం వాటాతో జాయింట్ వెంచర్ పేరుతో వారికి స్వాధీనం చేసింది. దీం తో నిజాం షుగర్ ఫ్యాక్టరీ కాస్తా నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్‌గా రూపాంతరం చెందింది. బోధన్‌లోని శక్కర్‌నగర్ ప్రధాన యూనిట్‌తో పాటు కరీంనగర్ జిల్లాలోని మెట్పల్లి, మెదక్ జిల్లాలోని ముంబాజీపేట ఫ్యాక్టరీలూ ప్రైవేట్ సంస్థ పరమయ్యాయి. రైతు, కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో వ్యతిరేకించినా అప్పటి ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. రోడ్డున పడ్డ కార్మికులు ప్రైవేటీకరణతో ఫ్యాక్టరీ గత వైభవాన్ని కోల్పోయింది. వేలాది కార్మిక కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఫ్యాక్టరీ గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో రైతన్నకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితులు ఏర్పడ్డాయి. పైగా బిల్లుల కోసం నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోం ది. దీంతో ప్రతి క్రషింగ్ సీజన్లో మద్దతు ధర కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితులున్నాయి. వైఎస్ఆర్ హయాంలో.. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నిజాం షుగర్స్ ప్రైవేటీకరణలో అవినీ తి అక్రమాలను నిగ్గుతేల్చేందుకు శాసనసభా కమిటీని ఏర్పాటు చేశారు. అప్పటి దేవాదాయ శాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు పి.సుదర్శన్‌రెడ్డి, ఎస్.గంగారాం, సురేశ్ షెట్కార్, బాజిరెడ్డి గోవర్ధన్, జి.చిన్నారెడ్డి, పద్మాదేవేందర్‌రెడ్డి, కళా వెంకట్రావు, మర్రి శశిధర్‌రెడ్డి సభ్యులుగా సభా సంఘాన్ని నియమించారు. ఈ సంఘం విచారణ చేసి 350 పేజీ ల నివేదికను ప్రభుత్వానికి అందించింది. ప్రైవేటీకరణ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించిన సంఘం.. ఫ్యాక్టరీని ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలని సిఫారసు చేసింది. హైకోర్టులో అప్పీలు నిజాం షుగర్స్ పరిరక్షణ కమిటీ కన్వీనర్ అప్పిరెడ్డి సభా సంఘం సిఫారసులు అమలు చేయాలని కోరుతూ 2007లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని కార్మిక సంఘాలు సైతం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. పలుమార్లు కోర్టులో విచారణకు వచ్చింది. ఏవో సాకులు చూపి ప్రభుత్వం తప్పించుకుంటోంది. విజయమ్మ పిటిషన్ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ జరపాలని 2011 అక్టోబర్‌లో వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశా రు. ఇందులో నిజాం షుగర్స్ ప్రైవేటీకరణ వ్యవహారాన్నీ చేర్చారు. రోశయ్య, కిరణ్‌ల హయాంలో.. 2010 నవంబర్11న అప్పటి సీఎం రోశయ్య సభా సంఘం సిఫారసులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. దీంతో బోధన్ ప్రాంత ప్రజల్లో హర్షం వ్యక్తమయ్యింది. ఫ్యాక్టరీ వద్ద పటాకులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఆ తర్వాత ఈ విషయం మరుగున పడింది. సీఎం కిరణ్ కుమార్‌రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా శంకర్రావు 2011 నవంబర్ 21న నిజామాబాద్ వచ్చారు. చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేట్ సంస్థతో ఉన్న జాయింట్ వెంచర్ రద్దు జీవోపై సంతకం చేశానని అప్పట్లో ప్రకటించారు. దీంతో బోధన్ ప్రాంత రైతులు, కార్మికులు మళ్లీ సంబరాలు జరుపుకున్నారు. కానీ శంకర్రావు పదవీచ్యుతులు కావడంతో సభా సంఘం సిఫారసుల్లో పురోగతి లేదు. మళ్లీ ఆశలు.. బోధన్‌లోని చక్కెర కర్మాగారం ప్రైవేటీకరణ వ్యవహారంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించడంతో రైతులు, కార్మికుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నా యి. పైగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వేగంగా సాగుతుండడం వారి ఆశలకు జీవం పోస్తోంది. ఇప్పుడు కాకపోయినా తెలంగాణ రాష్ట్రంలోనైనా ఫ్యాక్టరీ ప్రభుత్వ పరం అవుతుం దని నమ్ముతున్నారు. మంత్రులు ఒత్తిడి తెచ్చి శాసనసభా సంఘం సిఫారసులు త్వరగా అమలయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. -
లక్ష్యం ‘నీరు’గారింది!
కర్నూలు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: ప్రచారమే తప్పిస్తే ఇందిర జలప్రభ పథకంలో పురోగతి లోపిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు కల్పతరువని చెప్పుకోవడమే కానీ.. చేకూరుతున్న ప్రయోజనం నామమాత్రమే. పథకం చుట్టూ సమస్యలు ముసురుకోగా.. గట్టెక్కించేందుకు కలెక్టర్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో లక్ష్యం దరిదాపులకు కూడా చేరుకోలేకపోతున్నారు. 2010-11లో మొదలైన ఈ పథకం లక్ష్యాలను మూడేళ్లలోపు సాధించాల్సి ఉన్నా.. ఇప్పటికీ ఓ కొలిక్కి రాకపోవడం విమర్శలకు తావిస్తోంది. పథకం కింద 50 మండలాల్లోని 608 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ రైతులకు చెందిన 50131.29 ఎకరాల్లో బోర్లు వేసి విద్యుత్ కనెక్షన్‌తో పాటు మోటార్లు బిగించి సాగునీటి వసతి కల్పించాలనేది లక్ష్యం. ఈ భూముల్లో పండ్ల తోటలను అభివృద్ధి చేసి రైతులకు శాశ్వత ప్రయోజనం కల్పించాల్సి ఉంది. మొత్తం రూ.104.39 కోట్ల ఖర్చుతో 4,531 బోర్లు వేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం జిల్లా నీటి యాజమాన్య సంస్థ, భూగర్భ జలశాఖ, ఏపీసీపీడీసీఎల్, ఏపీఎంఐపీ తదితర శాఖలు కలసికట్టుగా పనిచేయాల్సి ఉన్నా సమన్వయకం కొరవడింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా లక్షా్యాలను పూర్తి చేయాల్సి ఉండగా ఇప్పటికీ ముక్కుతూమూల్గుతుండటం పథకం పట్ల అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం. ఇప్పటి వరకు 34,240 ఎకరాల్లో మాత్రమే గ్రౌండ్ వాటర్ సర్వే పూర్తయింది. ఇందులో 1,626 బోర్లు వేసేందుకు జియాలజిస్ట్‌లు ప్రతిపాదించగా.. 1002 బోర్లు మాత్రమే వేశారు. ఇందులో 578 బోర్లు మాత్రమే సక్సెస్ కాగా.. విద్యుత్ అధికారులు 263 బోర్లకు మాత్రమే కనెక్షన్ ఇవ్వగలిగారు. మొత్తంగా అధికారుల లెక్కల ప్రకారం 2,490 ఎకరాలకు సాగునీరు అందించగలిగారు. అయితే 669.79 ఎకరాల్లో మాత్రమే హార్టికల్చర్ కింద పండ్ల మొక్కలు నాటగలిగారు. పండ్ల మొక్కలకు డ్రిప్ సౌకర్యం కల్పించే ప్రక్రియ ఇప్పటికీ ప్రాథమిక దశలోనే ఉండటం గమనార్హం. నిర్లక్ష్యం ఎక్కడ..: ఇందిర జలప్రభ అమలులో అడుగడుగునా నిర్లక్ష్యం నెలకొంది. జియాలజిస్టుల కొరతతో భూగర్భ జలసర్వే ముందుకు సాగడం లేదు. ఏడుగురు జియాలజిస్టులు మాత్రమే ఈ సర్వే చేస్తున్నారు. వీరిలోనూ ఎక్కువ మంది జూనియర్లే కావడం వల్ల పాయింట్లు గుర్తించినా ఫెయిల్యూర్ శాతమే ఎక్కువగా ఉంటోంది. బోర్లు వేయడంలో అంతులేని జాప్యం జరుగుతోంది. 1,626 బోర్లు వేసేందుకు రెకమెండ్ చేస్తే 1002 బోర్లు మాత్రమే వేశారు. అయితే విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంలో విద్యుత్ అధికారులు చేస్తున్న జాప్యం అంతా ఇంతా కాదు. తరచూ కలెక్టర్ విద్యుత్ అధికారులకు చీవాట్లు పెట్టినా ఫలితం లేకపోతోంది. 578 బోర్లు సక్సెస్ అయితే 263 బోర్లకు మాత్రమే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. డ్వామా అధికారులు 280 బోర్లకు విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు అవసరమైన బడ్జెట్‌ను విడుదల చేసినా వారి నుంని స్పందన లేకపోవడం గమనార్హం. ఈ కారణంగా వచ్చే ఏడాది మార్చిలోపు లక్ష్యంలో 20 శాతం కూడా సాధించడం కష్టమయ్యే పరిస్థితి నెలకొంది. ఈ మూడేళ్లలో రూ.17 కోట్లు ఖర్చు చేసి 2,490 ఎకరాలకు మాత్రమే సాగునీటి సౌకర్యం కల్పించడం కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది. అవకతవకలకు కొదవ లేదు..: ఇందిర జలప్రభ అమలులో అవకతవకలు తక్కువేమీ కాదు. బోర్లు తవ్వకం మొదలుకొని, విద్యుత్ కనెక్షన్ వరకు అక్రమాలు చోటు చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బోర్లు వేసిన తర్వాత ఎలాంటి కేసింగ్ పైపులు అమర్చాలనే విషయమై స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. అయితే నాసిరకం పైపులు వేస్తూ నిధులు కాజేస్తున్నారు. ఈ పరిస్థితి ఆత్మకూరు, పాములపాడు, కొత్తపల్లి తదితర మండలాల్లో అధికంగా ఉంది. బోర్లు కూడా తక్కువ లోతులో వేసి ఎక్కువ లోతు వేసినట్లు రికార్డు చేస్తున్నట్లు సమాచారం. విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు వేసిన ఎస్టిమేట్లలోనూ అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
ఆయకట్టులో ఆనందం
హాలియా, న్యూస్‌లైన్: నీటి విడుదల ప్రకటనతో నాగార్జునసాగర్ ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ నెల 20వ తేదీ నుంచి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కుడి, ఎడమ కాల్వల నుంచి రబీ సాగుకు నీటిని వదిలేందుకు రాష్ట్ర భారీ, నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. నిన్నమొన్నటి దాకా నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. నిండా ముంచిన ఖరీఫ్ ఈ ఖరీఫ్ ఆయకట్టు రైతులను నిండా ముంచింది. ఓవైపు వరుస తుపాన్లు, మరోవైపు దోమకాటుతో పంట దిగుబడి గణనీయంగా తగ్గింది. ఎకరాకు 20 నుంచి 30 బస్తాల లోపే ధాన్యం దిగుబడి వచ్చింది. రైతులకు పెట్టుబడి కూడా వెళ్లలేదు. అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితి నెలకొంది. ఈ తరుణంలో ప్రభుత్వం సాగర్ ఎడమ కాల్వ కింద 4,31,300 ఎకరాలకు సాగునీరు ఇస్తామని ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ మిగిల్చిన అప్పును తీర్చేందుకు సాగర్ ఎడమ కాల్వ కింద ఉన్న రైతులు వరిసాగుకు సమాయత్తమవుతున్నారు. 4.31 లక్షల ఎకరాలకే సాగునీరు ... సాగర్ ఎడమ కాల్వ కింద 10.33 లక్షల ఎకరాల సాగుభూమి ఉంది. అందులో నల్లగొండ జిల్లాలో 3,80,000, ఖమ్మం జిల్లా పరిధిలోని 2,77,000, కృష్ణాజిల్లాలో 3,75,000 ఎకరాల సాగుభూమి ఉంది. ఈ రబీలో ప్రభుత్వం మాత్రం నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లోని 4,31,000ఎకరాలకే సాగునీరు ఇచ్చేందుకు నిర్ణయించింది. 150 టీఎంసీల నీటి విడుదలకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం : సీఈ ఎల్లారెడ్డి ఈ ఏడాది రబీలో వరి సాగుకు కుడి, ఎడమ కాల్వలతో పాటు డెల్టాకు 50 టీఎంసీల చొప్పున నీటిని విడుదల చేసేందుకు వీలున్నట్లు గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. నాగార్జునసాగర్ జలాశయంలో నీరుండడంతో పాటు ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు, రైతుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం రబీలో వరిసాగుకు నీటి విడుదలకు నిర్ణయం తీసుకుంది. -
ఏజేసీ హామీతో దీక్షల విరమణ
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : గిరిజన భవన నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని అదనపు జాయింట్ కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి హామీ ఇవ్వడంతో గిరిజన హక్కుల పోరాట సమితి కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న 24 గంటల రిలే నిరాహార దీక్షలను గురువారం విరమించింది. పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ సుబ్బరాయుడు, జిల్లా అధ్యక్షుడు జె.సుబ్బరాయుడు, జిల్లా కార్యదర్శి బి.వెంకట సుబ్బయ్య, సహాయ కార్యదర్శి కె.శ్రీనివాసులు, దళిత ప్రజాపార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్ తదితరులు ఈ విషయాన్ని ఏజేసీకి వివరించారు. త్వరలో గిరిజన భవనానికి అవసరమైన స్థలాన్ని చూపెడతామని, ఎస్సీ ఎస్టీ సబ్‌ప్లాన్ కింద భవన నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూరుస్తామని ఏజేసీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ బీసీ మహాసభ కన్వీనర్ అవ్వారు మల్లికార్జున, గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేంద్రనాయక్ పాల్గొన్నారు. -
అల్గిరెడ్డి వర్సెస్ కేతిరి
హుస్నాబాద్, న్యూస్‌లైన్ : హుస్నాబాద్ కాంగ్రెస్‌లో విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డి మధ్య ఏర్పడిన విభేదాలు ఇప్పటికీ రగులుతూ నే ఉన్నాయి. హుస్నాబాద్ అసెంబ్లీ టికెట్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన సుదర్శన్‌రెడ్డి, బొమ్మ వెంకటేశ్వర్లు, ప్రవీణ్‌రెడ్డి ఆశించగా.. అధిష్టానం ప్రవీణ్‌రెడ్డి వైపు మొగ్గుచూపడంతో ఇద్దరు నేతలు మనస్తాపానికి గురయ్యారు. అధిష్టానం కలుగజేసుకుని వారిని సముదాయించింది. దీం తో వారు ఎన్నికల్లో ప్రవీణ్‌రెడ్డికి మద్దతుగా నిలవడంతో.. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిం చింది. టికెట్ విషయంలో జరిగిన అన్యాయం, ఎన్నికల అనంతరం జరుగుతున్న పార్టీ కార్యక్రమాలు, ఇతర పరిణామాలు తమను కార్యకర్తల నుంచి దూరం చేస్తున్నారనే భావన వారిలో ఏర్పడింది. దీనికితోడు తాజాగా హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్ నియామకం విషయంలో ప్రవీణ్‌రెడ్డి అడ్డుపడుతున్నాడంటూ సుదర్శన్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. బహిరంగంగానే అసంతృప్తి పార్టీ కార్యక్రమాల విషయంలో ఎమ్మెల్యే తన ను, తమ వర్గాన్ని దూరం పెడుతున్నారంటూ పలు వేదికలపై సుదర్శన్‌రెడ్డి బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతోపాటు పార్టీ నాయకులకు సైతం ఫిర్యాదు చేశారు. జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆరు నెలల క్రితం ప్రవీణ్‌రెడ్డి, సుదర్శన్‌రెడ్డిని సమన్వయపరిచి, హుజూరాబాద్ నియోజకవర్గంపై కేతిరి దృష్టి పెట్టేలా ఒప్పించినట్లు సమాచారం. హుజూరాబాద్ మార్కెట్ చైర్మన్‌గా సుదర్శన్రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చేలా నేతలు అంగీకారానికి రావడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి, శ్రీధర్‌బాబు, ఎంపీ, విప్, ఎమ్మెల్యేలతో సీఎంకు ఐదు నెలల క్రితమే సిఫారసు లేఖలు పంపారు. దీనిపై సీఎం ఆమోదం తెలిపే సందర్భంలో ప్రవీణ్‌రెడ్డి సీఎంతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించి ఫైల్‌ను నిలిపివేయించారని సుదర్శన్‌రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. హుజూరాబాద్ మార్కెట్ పరిధిలోకి హుస్నాబాద్ నియోజకవర్గంలోని మూడు మండలాలు కూడా వస్తున్నందున తమ నియోజకవర్గానికే చైర్మన్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే అడ్డుకోవడంతోనే కమిటీ నియామకం నిలిచిపోయిందని ప్రచారం జరుగుతోంది. టార్గెట్.. సహకార ఎన్నికలు మార్కెట్ చైర్మన్ పదవి రాకుండా అడ్డుపడుతున్నారనే భావనతో నేరుగా ప్రవీణ్రెడ్డితోనే తల పడేందుకు సుదర్శన్‌రెడ్డి సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రవీణ్‌రెడ్డికి పట్టున్న ముల్కనూర్ సహకార గ్రామీణబ్యాంకు ఎన్నికలను ఎంచుకున్నారు. బ్యాంకు పరిధిలో ఐదు డెరైక్టర్ పదవులకు ఎన్నికలు జరుగుతుండగా.. ప్రవీణ్‌రెడ్డి ప్యానెల్‌ను ఎలాగైనా ఓడించాలని సుదర్శన్‌రెడ్డి పట్టుదలగా ఉన్నారని ఆయన వర్గీయులు తెలిపారు. ఇటీవల తన వర్గీయులతో వరంగల్‌లో సమావేశం నిర్వహించిన సుదర్శన్‌రెడ్డి తాజాగా టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐతోపాటు జేఏసీలను ఒకతాటిపైకి తీసుకువచ్చేదిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ మేర కు కొత్తకొండలో శుక్రవారం సమావేశం నిర్వహి ంచనున్నట్లు తెలిసింది. ఈ ఎన్నికల్లో దెబ్బతీస్తే ఆ ప్రభావం వచ్చే అసెంబ్లీ ఎన్నికలపైనా ఉం టుందని ఆ దిశగా పావులు కదుపుతున్నారు. వీరికి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యనాయకుడు సైతం మద్దతిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రవీణ్‌రెడ్డి సైతం దీన్ని ఎదుర్కొనేందుకు ఒంట రిగానే సిద్ధమవుతున్నారు. మొత్తానికి ఈ వ్యవహారం పార్టీ కార్యకర్తలను ఇరకాటంలో పడేస్తోంది. నాయకుల వర్గపోరుతో బ్యాంకు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. ఒకే పార్టీ నాయకులు ప్రత్యర్థులుగా ప్రచారం సాగించడంతో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. -
ఆపేవారెవరు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: తుంగభద్ర నది. జిల్లాకు సాగు, తాగునీటిని అందించే వరప్రదాయిని. అంతేకాదు.. ఇటీవల కాలంలో ఒళ్లంతా గుళ్ల చేసుకొని అక్రమార్కులకు కాసుల వర్షం కూడా కురిపిస్తోంది. అధికారం ‘చేతి’లో పెట్టుకొని.. అధికారులను కనుసైగలతో శాసిస్తూ నదీ పరీవాహక ప్రాంతాల్లోని చోటామోటా నాయకులు సైతం ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అనతికాలంలోనే కోట్లకు పడగలెత్తుతున్నారు. ముఖ్య నాయకుల అండదండలతో వీరి హవా కొనసాగుతోంది. ఇక వీఆర్వో నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తృణమోపణమో ముడుతుండటంతో వారు కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి. వివిధ స్థాయిల్లో నెల మామూళ్లే కోటి రూపాయలకు పైమాటే కావడం అక్రమ రవాణా ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. జిల్లాతో పాటు మహబూబ్‌నగర్ జిల్లా అధికారులు, నాయకులు కూడా తుంగభద్రపై పెత్తనం చెలాయిస్తున్నారు. ఎక్కడ.. ఎవరు అడ్డొచ్చినా అంతమొందించేందుకూ వెనుకాడకపోవడం ఆందోళన కలిగించే విషయం. సీమ ముఖద్వారమైన కర్నూలు కేంద్రంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాతో పర్యావరణానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నా నోరు మెదిపేందుకు ఎవరూ సాహసించకపోవడం గమనార్హం. అక్రమార్కులు పక్కా ప్రణాళికతో ఇసుకను సరిహద్దులు దాటిస్తున్నారు. వ్యాపారం ఉన్నా.. లేకపోయినా ముందుగానే ఇసుకను తోడి నిల్వ చేసుకుంటున్నారు. ప్రధానంగా పంచలింగాల, గొందిపర్ల, దేవమడ, ఇ.తాండ్రపాడు, నిడ్జూరు, పుల్లూరు, కలుగొట్ల, నెంపాడు, మద్దూరు, కొర్రిపాడు తదితర ప్రాంతాల్లో ఈ తరహా వ్యవహారం సాగుతోంది. నిల్వ చేసుకున్న ఇసుకను చీకటి వేళ 12 టైర్ల లారీల్లో నింపి హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. రోజూ 500 లారీలతో పాటు వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలిపోతున్నా నిలువరించలేని పరిస్థితి నెలకొంది. ఒక లారీలో ఇసుకను నింపేందుకు రూ.36వేలు చెల్లిస్తుండగా.. 100 టన్నుల ఇసుకను హైదరాబాద్‌లో రూ.1.20 లక్షలకు విక్రయిస్తున్నారు. ఇక ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా ఆయా ప్రాంతాల్లోని పోలీసుస్టేషన్ల ఎస్ఐలకు నెలకు రూ.లక్ష, కానిస్టేబుళ్లకు రూ.50వేల చొప్పున చెల్లిస్తున్నట్లు సమాచారం. వీఆర్వో విషయానికొస్తే లారీ రోడ్డెక్కితే రూ.2వేలు ముట్టజెబుతున్నారు. అలా ఎన్ని లారీలు వెళితే అంత డబ్బు ఇవ్వాల్సిందే. అక్రమ రవాణా చేస్తున్న లారీల యజమానులంతా కలసి రెవెన్యూ, పోలీసు, మైన్స్, అధికార పార్టీ నాయకులకు ప్రతి నెలా కోటి రూపాయలకు పైగా ‘మామూళ్లు’ ఇస్తున్నట్లు చర్చ జరుగుతోంది. కర్నూలు, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు ఈ విషయంలో అక్రమార్కులకు అండగా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక నెల మామూళ్లు అందకపోతే.. కేసులు బనాయించి హడావుడి చేయడం పరిపాటిగా మారింది. రోజూ ఎన్ని లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారనే విషయాన్ని తెలుసుకునేందుకు ప్రజాప్రతిధులకు చెందిన రెండు సుమోలు నిత్యం పర్యవేక్షిస్తుండటం ఈ దంత ఏ స్థాయిలో సాగుతుందో తెలియజేస్తోంది. ఇటీవల కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ రఘురామిరెడ్డి సంయుక్తంగా దాడులు నిర్వహించి హద్దు మీరితే ఊరుకోబోమని హెచ్చరించారు. అయితే ఆ తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడం అధికారులంటే వారికి ఏమాత్రం భయం ఉందో అద్దం పడుతోంది. -
పెద్దాసుపత్రిలో కాంట్రాక్టు ఉద్యోగులకు గండం
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులతో పనిచేస్తూ జీతాలు తీసుకుంటున్న కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించేందుకు రంగం సిద్ధమైంది. అయితే వారిని తిరిగి అవుట్సోర్సింగ్ పద్దతిలో నియమించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నవంబర్ ఒకటి నుంచే ఈ ప్రక్రియ మొదలు పెట్టాలని జిల్లా కలెక్టర్ సైతం ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ శాఖల్లో రెగ్యులర్ నియామకాలకు స్వస్తి చెప్పి కాంట్రాక్టు విదానంలో పోస్టుల భర్తీకి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారు. దీంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో 2002 నుంచి వివిధ విభాగాల్లో ఖాళీ అయిన పోస్టుల స్థానంలో రెగ్యులర్ నియామకాలు గాకుండా కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేస్తూ వెళ్తున్నారు. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో కాంట్రాక్టు పద్దతిలో 120 మందికి పైగా ఉద్యోగులను నియమించారు. వారిలో ఆసుపత్రి అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 34 మందితో పాటు 14 మంది పంప్ ఆపరేటర్లు, కార్డియాలజిలో నలుగురు వార్డుబాయ్‌లు, నలుగురు స్వీపర్లు కలిపి 54 మంది పనిచేస్తున్నారు. వారికి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నుంచి అధికారులు జీతాలు ఇస్తూ వస్తున్నారు. అయితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ నిధులను కేవలం అభివృద్ధికి మాత్రమే వాడాలని, ఉద్యోగులను నియమించి జీతాలు ఇవ్వకూడదని రాష్ట్ర ఉన్నతాధికారులు ఇటీవల ఆసుపత్రి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో కాంట్రాక్టు పద్దతిపై పనిచేస్తున్న 58 మందిని ఈ నెలాఖరులోగా తీసివేయాలని అధికారులు నిర్ణయించారు. అయితే వారిని ఉన్నఫలంగా ఉద్యోగంలో నుంచి తీసేయకుండా వారిని అవుట్ సోర్సింగ్ పద్దతిలో తిరిగి నియమించుకునే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ సుదర్శన్‌రెడ్డితో ఆసుపత్రి అధికారులు చర్చించారు. దీనికి జిల్లా కలెక్టర్ సైతం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని కాంట్రాక్టు ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. ఇలా తమను తొలగించి, అవుట్సోర్సింగ్ ద్వారా నియమిస్తే ఇన్నేళ్లుగా తాము చేసిన సర్వీస్ పోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాము సమ్మె చేస్తూ లేబర్ కోర్టుకు వెళతామని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి. కుమార్ చెప్పారు. -
హాస్టల్లో కలెక్టర్ రాత్రి బస
పత్తికొండ టౌన్, న్యూస్‌లైన్: స్థానిక ఎస్సీ నంబర్ 2 హాస్టల్లో మంగళవారం కలెక్టర్ సుదర్శన్ రెడ్డి రాత్రి బస చేశారు. పది గంటలకు ఆయన హాస్టల్‌కు వచ్చారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రణాళికబద్ధంగా చదవి విజయం సాధించాలన్నారు. ఉన్నతచదువులు చదివితేనే ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని తెలిపారు.. జిల్లా పరిశ్రమల మేనేజర్ సుందర్రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. అనంతరం కలెక్టర్ హాస్టల్లోని వంటగది, బాత్రూంలను పరిశీలించారు. ఆయన వెంట సాంఘికసంక్షేమశాఖ డీడీ శోభారాణి, డీ టీడబ్ల్యుఓ గిరిధర్‌రావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రవిచంద్ర, తహశీల్దార్ రామక్రిష్ణ, ఎంఈఓ కబీర్, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ మురళీధర్, ఎఎస్డబ్యుఓ నాగభూషణం, వార్డెన్లు నాగరాజు, రమేష్ పాల్గొన్నారు. విద్యార్థిసంఘాల నాయకులపై ఆగ్రహం: పత్తికొండలోని ఆదర్శపాఠశాలకు రస్తాలేదని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థిసంఘాల నాయకులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం రండి అని చెప్పినా విద్యార్థిసంఘాల నాయకులు వినకపోవడంతో వీరిని ఇక్కడికి ఎవరు పిలిపించారు, నేను వెళ్లిపోతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఒక్క పూటే!
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్: ఒంటిపూట బడులు. అదేంటి ఎండాకాలంలో కదా ఈ తరహా తరగతులు నిర్వహించేదనే ఆశ్చర్యపోతున్నారా. ఉద్యమంలో తలమునకలైన ఉపాధ్యాయులు కొందరు పాఠశాలలు పునఃప్రారంభమై పది రోజులవుతున్నా ఇప్పటికీ చుట్టపు చూపుగానే హాజరవుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు తీసుకొచ్చేందుకు జిల్లా ఉన్నతాధికారులు శతవిధాల ప్రయత్నిస్తున్నా మార్పు కరువవుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా రెండున్నర నెలలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చదువుకు దూరమయ్యారు. యూనిట్ టెస్ట్‌లు, క్వార్టర్లీ పరీక్షలు కూడా రాయలేకపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో పాఠశాలలు పునఃప్రారంభమైనందున ఉపాధ్యాయులు మరింత అంకితభావంతో పనిచేయాల్సి ఉంది. అలాంటిది కొందరు ఎవరేమైతే మేకేమిటన్న ధోరణితో విధులకు డుమ్మా కొడుతున్నారు. విషయం తెలుసుకున్న కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి, డీఈవో నాగేశ్వరరావులు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. ఈ నెల 18న కర్నూలు మండలం మిలటరీ కాలనీలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను, గార్గేయపురంతో పాటు నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లను.. చివరగా నందికొట్కూరు జిల్లా పరిషత్ బాలికలు, ప్రభుత్వ బాలుర పాఠశాలలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఈవో అనుమతి లేకుండా సెలవు పెట్టిన బ్రాహ్మణకొట్కూరు జిల్లా పరిషత్ స్కూల్ హెచ్ఎంకు మెమో జారీ చేశారు. సమ్మెకాలంలో పాఠశాలలు మూతపడినందున.. శని, ఆదివారాల్లోనూ పని చేయాలని నిర్ణయించడం తెలిసిందే. దీంతో సెలవు రోజుల్లో పాఠశాలలు ఎలా నడుస్తున్నాయో తెలుసుకునేందుకు తనిఖీకి వెళ్లిన కలెక్టర్, డీఈవోలు గత ఆదివారం ఉయ్యాలవాడ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులను మధ్యాహ్నం 1.30 గంటలకే ఉపాధ్యాయులు ఇంటికి పంపడం గుర్తించారు. ఈ విషయంలో ప్రధానోపాద్యాయుడు వెంకటేశ్వర్లును సస్పెండ్ చేశారు. డీఈఓ ఈ ఆదివారం కూడా కర్నూలు నగరంలోని బాలికల, బాలుర ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. -
నిండా ముంచింది!
కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్: తుపాను ధాటికి రైతుల కష్టమంతా తుడిచిపెట్టుకుపోయింది. ఐదు రోజులుగా ఒక మోస్తరు నుంచి భారీ స్థాయిలో కురిసిన వర్షాలు శనివారం తెరిపిచ్చాయి. చేతికొచ్చిన పంటలు కళ్లెదుటే నీట మునగడంతో అన్నదాత కన్నీరుమున్నీరవుతున్నాడు. అతివృష్టితో వాగులు, వంకలు పొంగి పొర్లడంతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపించాయి. ఈ నేపథ్యంలో శనివారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్ తుపాను బాధిత ప్రాంతాల్లో పర్యటించి చలించిపోయారు. కొత్తపల్లి మండలం దుద్యాలలో దెబ్బతిన్న వరి పైరు, నందికుంటలో వర్షాలకు తడిచి మొలకలు వచ్చిన మొక్కజొన్నను పరిశీలించారు. ఆత్మకూరులో ముంపునకు గురైన లోతట్టు ప్రాంతాల్లోనూ ఆయన పర్యటించారు. ఆయా ప్రాంతాలను పరిశీలిస్తున్న వికాస్‌రాజ్‌తో పాటు జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిలను బాధిత రైతులు, స్థానికులను చుట్టుముట్టి ఆదుకోవాలని వేడుకున్నారు. అన్నివిధాల అండగా ఉంటామని వారు భరోసానిచ్చారు. 2009లో అతివృష్టి.. 2010లో అధిక వర్షాలతో రైతులు నష్టాలను మూటగట్టుకున్నారు. 2011, 2012 సంవత్సరాల్లో అనావృష్టి రైతులను వెక్కిరించింది. 2013లో ఖరీఫ్ సీజన్ బాగుందని సంతోషిస్తున్న తరుణంలో తుపాను వారిని తీవ్ర నిరాశకు గురి చేసింది. అధికారిక లెక్కల ప్రకారమే కొత్తపల్లి, మహానంది, బండిఆత్మకూరు, గడివేముల, పాణ్యం, బనగానపల్లె, చాగలమర్రి, గోస్పాడు, శిరువెళ్ల, ఆత్మకూరు, పాములపాడు, వెలుగోడు, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో 38,137.5 ఎకరాల్లో పంట 50 శాతం పైగా దెబ్బతినింది. ఎకరాకు కనీసం రూ.10 వేల చొప్పున నష్టం వాటిల్లింది. వరి 14,850 ఎకరాలు, మొక్కజొన్న 10,415, వేరుశెనగ 3,792, పత్తి 2,920, జొన్న 1,577.50, శనగ 1380, పొగాకు 50, కొర్ర 85, పొద్దుతిరుగుడు 575, ఆముదం 225, కంది 1640, మినుములు 500, పెసలు 127.50 ఎకరాల్లో దెబ్బతిన్నట్లు నిర్ధారించారు. అనధికార అంచనాల ప్రకారం 90వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం. శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. పంట నష్టంపై సమగ్ర సర్వే శుక్రవారం ఉదయం నుంచి శనివారం ఉదయం వరకు జిల్లా మొత్తం మీద సగటున 3 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. అక్టోబర్ నెల సాధారణ వర్షపాతం 114.5 మి.మీ కాగా, ఇప్పటి వరకు 135.8 మి.మీ వర్షం కురిసింది. భారీ వర్షాల వల్ల పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేసిన వ్యవసాయాధికారులు సమగ్ర సర్వేకు చర్యలు చేపట్టారు. 14 మండలాల్లో పంట నష్టం సత్వరం ఎన్యుమరేషన్ చేయాలని జిల్లా కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా సర్వే చేయనున్నారు. పంట నష్టం సర్వేతో పాటు, రైతుల బ్యాంక్ అకౌంట్ నెంబర్లు కూడా తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. వీలైనంత త్వరగా సర్వే చేసి నివేదిక ఇవ్వాలని పేర్కొన్నారు. ఇదిలాఉండగా కర్నూలు, నంద్యాల డివిజన్లలో మొత్తం 1,674 ఇళ్లు దెబ్బతినగా, ఇందులో 320 ఇళ్లు పూర్తిగా కూలిపోయాయి. వీటికి మరో మూడు రోజుల్లో ఆర్థిక సహాయం అందించేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
నీటియుద్ధాలే రేపటి నిజం
రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ మధ్యన నదీ జలాల గురించి పత్రికల వారి సమావేశంలో మా ట్లాడారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు ఈ చర్చ అవసరాన్ని మరింత స్ప ష్టం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగినా నీటి కోసం ఎలాంటి యుద్ధాలు, వివాదాలు తలెత్తబో వని మంత్రి మాటల సారాంశం. తెలంగాణవాదులు కూడా ఇదే చెప్పారు. మంత్రివర్యులు తన మీడియా ప్రసంగంలో కృష్ణా-గోదావరి పరీవాహక ప్రాంతాలకు చెందిన కేటాయింపుల వివరాలు కూడా అందించారు. మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం - ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్న వారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెంతైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవసాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. ఈ గణాంకాలన్నీ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు రెండున్నాయి. ఒకటి బచావత్ ట్రిబ్యునల్ స్థానంలో వచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేయబోయే నీటి కేటాయింపుల వల్ల జరిగే అనర్థాలు. రెండవది, మిగులు జలాలకు సంబంధించినది. తెలంగాణవాదులు మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తున్న అంశం-నీటి దోపిడి. తెలంగాణవాదుల ఆరోపణ ప్రకారం, మిగులు జలాలతో కట్టిన ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు లేవు. కాగా, జూరాల నుంచి హైదరాబాద్‌కు నీటిని తెచ్చుకునే ఉద్దేశం ఉంది. కొత్త ప్రాజెక్టులకు జాతీయ హోదా సాధించడం కూడా ఇందులో ఉంది. మొన్న పాలమూరులో జరిగిన బీజేపీ సభలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ కూడా ఇదే ధోరణిలో మాట్లాడటం జరిగింది. అంటే సముద్రాన్ని హైదరాబాద్‌కు తెస్తాం అనే ధోరణి ఈ అభిప్రాయాలలో ప్రతిబింబిస్తున్నది. అయినా మన మంత్రివర్యులకు ఇవేమీ కనిపించలేదు. వీటిని బట్టి మనం అర్థం చేసు కోవలసినది - నీటి యుద్ధాలు పొంచి ఉన్నాయి. అంటే మహబుబ్‌నగర్-కర్నూలు జిల్లాలలో వియ్యంకుల మధ్య, మొగుడు-పెండ్లాల మధ్య, అన్నా-చెల్లెళ్ల మధ్య, బావ - బావమరుదుల మధ్య నీటి యుద్ధాలు జరగడం అనివా ర్యంగా కనిపిస్తోంది. నిజానికి విభజనవాదులు మొదట వాదించిన తీరు ఇదే, నీటి యుద్ధాలు జరుగుతాయనే. ఇప్పుడు మాత్రం జరగవంటున్నారు. దీనిలో పరమార్ధ మేమిటో వారే చెప్పాలి. బ్రిజేష్ కుమార్ కొత్త ట్రిబ్యునల్ నీటి కేటాయింపుల లో జరిగే అనర్థాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పటికే సమాచారం అందుతోంది. బచావత్ ట్రిబ్యునల్ 78 సంవత్సరాల వరద నీటిని పరిగణనలోనికి తీసుకుంది. దీనిలో మంచి వర్షాల కాలం, తక్కువ వర్షాల కాలం రెండు ఉన్నాయి. అదే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 47 సంవత్సరాల వరద నీటిని తీసుకుంటే, అది మంచి వర్షాల కాలం మాత్రమే. అంటే తక్కువ వర్షాల కాలాన్ని తీసుకో లేదన్న మాట. దీని ద్వారా నీటి లభ్యతను పెంచి పంచడం జరిగింది. అదేగాక 75 శాతం ప్రాబబిలిటి కాకుండా 65 శాతం ప్రాబబిలిటిని పరిగణనలోకి తీసుకోవడం ద్వారా కూడా లభ్యత నీటిని పెంచడం జరిగింది. అంటే ఈ నీటి లభ్యత గణాంకాలలో చాలా మార్పులు చోటుచేసు కున్నాయి. కుడి పక్కన ఉన్న పట్టికలో ఆ మార్పుల తీరును చూడవచ్చు. దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? బ్రిజేష్, అంతకు ముందు నియమించిన బచావత్ కమిటీల మధ్య వ్యత్యాసం ప్రకారం సగటున (మంచి వర్షాలు - తక్కువ వర్షాలు నమోదైన సంవత్సరాల ప్రకారం) మన రాష్ట్రానికి కేటాయించిన నీరు 100 సంవత్సరాలలో 55 సంవత్సరాలు మాత్రమే రావటం జరుగుతుంది. అదే తక్కువ వర్షాల సంవత్సరాల ప్రకారం చూస్తే 40 నుంచి 45 సంవత్సరాల కంటే తక్కువ. అంతేకాదు, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చే కొత్త అనుమతుల (ఆలమట్టి ఎత్తు పెంచడం, మహారాష్ట్రలో విద్యుత్ ప్లాంటులకు నీరు, చట్ట వ్యతిరేకంగా నిర్మించుకున్న ప్రాజెక్టులకు చట్టబద్ధత కల్పించడం, వగైరాల) వల్ల ఈ సగటు నీటి లభ్యత 55 శాతం నుంచి 40 శాతానికి పడిపోయే ప్రమాదం ఉంది. అదే తక్కువ వర్షాల కాలంలో ఇది 30 శాతానికి పడిపోయే ప్రమాదం కూడా ఉంది. మనం ఇక్కడ ముఖ్యంగా గమ నించాల్సిన విషయం-ప్రత్యేక రాష్ట్ర విభజన కమిటీలో ఉన్నవారు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంత రాజకీయ నాయకులే. ఈ విషయాలపై చర్చించాల్సిన అవసరమెం తైనా ఉన్నది. వీటిన్నిటిని బట్టి మనకు అర్ధమయ్యేది, విభజన జరిగితే వచ్చేది ముందుగా నీటి యుద్ధాలే. దీనితో వ్యవ సాయం, వ్యవసాయదారుడు, ఆహార ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి వగైరాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. డాక్టర్ సజ్జల జీవానందరెడ్డి -
ప్రజల ఆకాంక్ష మేరకే ‘తెలంగాణ’
నిజామాబాద్‌సిటీ, న్యూస్‌లైన్ : తెలంగాణను వ్యతిరేకించే పార్టీలకు ఇక్కడ తావు లేదని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష మేరకే సోనియా గాంధీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనికి సీమాంధ్ర నేతలు అడ్డుతగలడం సరికాదన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని శ్రావ్యగార్డెన్‌లో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందా న్ అధ్యక్షతన పార్టీ జిల్లా విస్తృత్త స్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణపై తెలుగుదేశం పార్టీ మాటమార్చిందని ఆరోపించారు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను కాంగ్రెస్ అధిష్టానం గుర్తిం చిందని, అందువల్లే పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిందని పేర్కొన్నారు. ఇటీవల సర్పంచ్‌లుగా, సహకార సంఘాల చైర్మన్లుగా గెలిచిన కాంగ్రెస్ మద్దతుదారులు గ్రామాల అభివృద్ధి లో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అన్ని స్థానాలు గెలిపించి.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి సోనియా గాంధీ రు ణం తీర్చుకుందామని ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. తెలంగాణను సీమాంధ్రులు అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. వ్యాపారాల పేరుతో అన్ని వనరులను వినియోగించుకుం టూ వారే అభివృద్ధి చెందారన్నారు. తెలంగాణపై రాద్ధాంతాలు చేసుకుంటూపోతే భావోద్వేగాలు పెరిగిపోతాయని పేర్కొన్నారు. తెలంగాణపై సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి సీమాంధ్రకు చెందిన అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. అక్టోబర్ 2లోపు అన్ని గ్రామాల్లో తెలంగాణతో కూడిన కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని కార్యకర్తలకు సూచించారు. నిర్ణయం జరిగిపోయింది తెలంగాణపై నిర్ణయం జరిగిపోయిందని, నెలాఖరులోపు రాష్ర్ట ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సోనియాగాంధీ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోరని, ఎవరూ పార్టీని విడిచి వెళ్లవద్దని కోరారు. ఈనెల 24 వ తేదీన తెలంగాణ ప్రాంతానికి చెందిన మం త్రులు, ముఖ్య నేతలం ఢిల్లీకి వెళ్లి సోనియాను కలుస్తామని, తెలంగాణ ప్రక్రియ వేగవంతం చేయాలని కోరతామని పేర్కొన్నారు. తెలంగాణకు అడ్డుపడ్డ టీడీపీతో పొత్తుకోసం బీజేపీ వెంపర్లాడుతోందని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఆరోపించారు. పుష్కరకాలంగా ఎంతో కష్టపడ్డామని, దాని ఫలంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత పేర్కొన్నారు. నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీగౌడ్, ప్రభుత్వ విప్ అనిల్ సమావేశానికి హాజరు కాలేదు. అయితే వారు తమ సందేశాన్ని ఫ్యాక్స్ ద్వారా డీసీసీ అధ్యక్షుడికి పంపారు. ఆయన దానిని చదివి వినిపించారు. తెలంగాణ ప్రజల అకాంక్షను గౌరవిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై ప్రకటన చేసిన సోనియాగాంధీకి ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. కార్యక్రమంలో పార్టీకి చెందిన సర్పంచ్‌లు, సింగిల్ విండో చైర్మన్లను సన్మానించారు. సమావేశంలో జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్సీ రాజేశ్వర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వెంకుల్, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి తిరుపతిరెడ్డి, పీసీసీ కార్యదర్శులు సురేందర్, రత్నాకర్, పీసీసీ సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్, డీసీసీ మాజీ అధ్యక్షుడు గడుగు గంగాధర్, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.