కొప్పర్తిలో మహిళలతో మాట్లాడుతున్న సుదర్శన్ రెడ్డి
సాక్షి,బోధన్(నిజామాబాద్): తెలంగాణ సెంటిమెంట్ తో ప్రజలను మభ్యపెట్టి, లేనిపోని హామీలను ఇచ్చి 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్ర భుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన విస్మరించి స్వలాభం, కమీషన్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేసిన టీఆర్‌ఎస్ నాయకులకు రానున్న ఎన్నికల్లో ప్రజలు సరైన బుద్ధి చెప్పాలని మాజీమంత్రి, బోధన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ అన్నారు. మంగళవారం బోధన్ మండలంలోని నాగన్‌పల్లి, కొప్పర్తి, జాడిజమాల్ పూర్, చిన్నమావంది, సాలూర క్యాంప్, సాలంపాడ్, కుమ్మన్‌పల్లి గ్రామాల్లో మాజీమంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 100రోజులో ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి ఇచ్చిన హామీని టీఆర్‌ఎస్ తుంగలో తొక్కిందన్నారు. ఫ్యాక్టరీ విషయాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లామని, పార్టీ అధికారంలోకి వస్తే తప్పనిసరిగా ఫ్యాక్టరీ తెరిపిస్తామన్నారు. పలువురిని పార్టీలో చేర్చుకున్నారు.
ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ
తమ పార్టీ అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అన్ని పంటలకు బీమా సౌకర్యం కల్పించి బీమా సొమ్మును కూడా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. మహిళల కోసం ప్రత్యేకంగా ప్రతి మహిళ సంఘానికి రూ.లక్ష గ్రాంటు అందించడంతో పాటు వడ్డీ లేకుండా రూ.10లక్షలు రుణం అందిస్తామన్నారు. ప్రతి మహిళ సంఘం సభ్యులకు రూ.5లక్షల ప్ర మాద బీమా కూడ కల్పిస్తామన్నారు.
ఇళ్ల నిర్మాణాలకు రూ.5లక్షలు..
పేదల సొతింటి కలను సహకారం చేసేందుకు కొ త్తగా ఇళ్లు కట్టుకునే వారికి రూ.5లక్షలు ఆర్థికసా యం అందిస్తామన్నారు. ఎస్సీ,ఎస్టీలు అయితే రూ.6లక్షలు అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
అమలు చేసే హామీలే చెపుతున్నాం..
రాష్ట్రంలో, కేంద్రంలో ఉన్న టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీ లాగా తమ కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలు ఇవ్వదని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి అన్నారు. గ్యాస్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందిపాల్జేస్తున్న టీఆర్‌ఎస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత కెప్టెన్ కరుణాకర్ రెడ్డి, ఎంపీపీ గంగాశంకర్, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులు నాగేశ్వర్‌రావ్, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లె రమేశ్, మాజీ ము న్సిపాల్ చైర్మన్ గౌసుద్దీన్, నాయకులు గణపతి రెడ్డి, వీరభద్ర రావ్, ఖలీల్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment