సాక్షి, నర్సంపేట: నియోజవకవర్గం అన్ని విధాల అభివృద్ధి జరగాలంటే తనను ఈ ఎన్నికల్లో ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించాలని టీఆర్‌ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి కోరారు. పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో తాను ఓడిపోయిన సీఎం కేసీఆర్ సహకారంతో ప్రత్యేక నిధులు తెప్పించి 30 సంవత్సరాల్లో జరుగని అభివృద్ధిని చేసి చూపించానని తెలిపారు. ఈ ఎన్నికల్లో 105 స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలిచి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని తెలిపారు.
కేసీఆర్ కుటుంబం త్యాగం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో పాటు అన్ని రకాల అభివృద్ధి జరిగిందన్నారు. రెండు పంటలకు సరిపోను నీటిని అందించి లక్షా 20 వేల ఎకరాలకు సాగునీరు అందే విధంగా కృషి చేస్తానన్నారు. ప్రత్యేక ప్రణాళికతో నర్సంపేటను మోడల్ సిటీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. తాను గెలిచిన వెంటనే అన్ని రకాల అభివృద్ధి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణగౌడ్, జిల్లా నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, లెక్కల విద్యాసాగర్‌రెడ్డి, నాయిని నర్సయ్య, దార్ల రమాదేవి, గంప రాజేశ్వర్‌రావు, పుట్టపాక కుమారస్వామి, మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్‌లో చేరికలు...
నియోజకవర్గం పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు ఆయా పార్టీలకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీలో చేరిన వారికి పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment