నర్సంపేట రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్
సాక్షి, నర్సంపేట: రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేసిన కేసీఆర్‌ను ఎదుర్కోలేకనే పాము, ముంగీస లాంటి పార్టీలు ఏకమై ప్రజలను నట్టేట ముంచేందుకు కూటమిగా ఏర్పడ్డాయని కేటీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్ధి పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపించాలని మంగళవారం నర్సంపేట పట్టణంలో రోడ్‌షో నిర్వహించారు. గతంలో సోనియాగాంధీని ఇటలీ దెయ్యం అని తిట్టిన చంద్రబాబునాయుడితో జతకట్టడం కాంగ్రెస్ పార్టీకి చేతగాని తనానికి నిదర్శమనన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను నుంచి తెలంగాణను నడిపించాలనే కుట్రను ప్రజలు గమనిస్తున్నారని, వారి ఆటలకు చెక్ పెట్టాలని కోరారు. ఓటుకు నోటు కేసులో దొంగలుగా తేలిన వ్యక్తులే నేడు ప్రగల్బాలు పలకడం విడ్డూరమన్నారు. ఉద్యమ సమయంలో పోరాడిన నాయకులను అరెస్టు చేసినప్పుడు ఎక్కడ దాక్కున్నారని, నేడు చిల్లర దొంగను అరెస్టు చేస్తు ఆగమాగం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధిలో 17 శాతం పురోగతి సాధించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో 43 లక్షల మందికి పింఛన్లు అందించామని, ఈసారి ఎన్నికల్లో ఆదరిస్తే పింఛన్ రెండితలు చేస్తామని తెలిపారు.
45 ఏళ్లలో చేయని అభివృద్ధిని నాలుగున్నరేళ్లలో చేసి చూపామని, లబ్ధి కోసం కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తూ కొన్ని పార్టీలు ఏకమైనప్పటికీ ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటారన్నారు. నర్సంపేట నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ది సుదర్శన్‌రెడ్డి నిరంతరం కష్టపడ్డారని, ముఖ్యమంత్రిని ఒప్పించి నిధులు తీసుకువచ్చారని తెలిపారు. ఆయనను గెలిపించాల్సిన బాధ్యత ఈ ప్రాంత ప్రజలపై ఉందన్నారు. అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి మాట్లాడుతూ.. తనను గెలిపిస్తే అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు అవుతుందని, ఆదరాభిమానంతో అసెంబ్లీకి పంపాలని కోరారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్, మునిసిపల్ చైర్మన్ నాగెల్లి వెంకటనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తిని శ్రీనివాస్, ఎన్నారై టీఆర్‌ఎస్ సెల్ వెంగల్, జిల్లా నాయకుడు రాయిడి రవీందర్‌రెడ్డి, మునిగాల వెంకట్‌రెడ్డి, నల్లా మనోహర్‌రెడ్డి, రుద్ర ఓంప్రకాశ్, బాల్నె సర్వేశం, గటిక అజయ్‌కుమార్, భీరం సంజీవరెడ్డి, కామగోని శ్రీనివాస్, గోగుల రాణాప్రతాప్‌రెడ్డి, లెంకల విద్యాసాగర్‌రెడ్డి , అబ్దుల్‌నబీ, మారం రాము, శివకుమార్, కృష్ణ, దార్ల రమాదేవి, పెండెం రాజేశ్వరి, చిలువేరు రజినీభారతి, చెట్టుపల్లి మురళీధర్, గోనె యువరాజు, నాగిశెట్టి ప్రసాద్, పెండెం వెంకటేశ్వర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment