భూపాలపల్లి సభలో మాట్టాడిన సిరికొండ, సభాస్థలికి చేరుకుంటున్ప్రన ప్రజలు, కార్యకర్తలు
సాక్షి, భూపాలపల్లి అర్బన్: గతంలో పనిచేసిన కొందరూ నాయకులు ప్రజా సమస్యలు విస్మరించి వారి పనులు, వ్యాపారాలు చేసుకుంటూ అక్రమ సంపాదనకు అలవాటు పడ్డారు.. నాకు అటువంటి ఆలోచన లేదు.. కేవలం ప్రజల సమస్యలను పరిష్కరించడానికే పదవి కావాలని కోరుకుటున్నానని టీఆర్‌ఎస్ భూపాలపల్లి అభ్యర్థి, స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ గతంలో భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నాయకుడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా సంపాదించాడని, ఆయన చేయని అక్రమ దందా లేదన్నారు. కాంగ్రెస్ నుంచి టికెట్ తెచ్చుకోవడానికే ముప్పతిప్పలు పడ్డ ఆ నాయకుడు నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తారని ప్రశ్నించారు. నియోజకవర్గ ప్రజలే నా ఆస్తి.. వారి కోసమే నేను పనిచేస్తున్నాను అని స్పీకర్ చెప్పారు. ఎండ, వాన, చలిని లెక్క చేయకుండా ఇబ్బందులు పడుతూ పల్లె నిద్రలు చేసి ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సమస్యలను తెలుసుకుని పరిష్కరించానని అన్నారు. హమీ మేరకు భూపాలపల్లి జిల్లా చేశాను, నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందంజలో ఉంచానని తెలిపారు. మరో సారి అవకాశం కల్పిస్తే ఎంజీఎం తరహాలో 100 పడకల ఆస్పత్రి కట్టిస్తానని, గణపురాన్ని ఎడ్యుకేషన్ హబ్‌గా మరుస్తానని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment