మాస్‌కాపీయింగ్‌కు పాల్పడితే
ప్రయివేటు కళాశాలలపై కఠిన చర్యలు
యజమానులపై క్రిమినల్ కేసులు
ఎస్‌పీని ఆదేశించిన మంత్రి
అరగంట ముందే పరీక్షా కేంద్రానికి విద్యార్థులు
గూగుల్ సహాయంతో కేంద్రాలపై గట్టి నిఘా
కంఠేశ్వర్, న్యూస్‌లైన్ :
ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ నిరోధానికి అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. గత ఏడాది తీవ్ర ఆరోపణలు రావడంతో జిల్లా మంత్రి సుదర్శన్ రెడ్డి ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిం చారు. ఈసారి పరీక్షలు సజావుగా నిర్వహించాలని సూచించారు. మాస్ కాపీయింగ్ జరిగితే కేంద్రం ఉన్న కళాశాల నిర్వాహకులపై క్రిమినల్ కేసు లు నమోదు చేయాలని ఆదేశించినట్టు సమాచారం. ప్రయివేటు కళాశాల ల యజమానులు సమన్వయంతో మాస్ కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఎస్‌పీ తరుణ్‌జోషిని మంత్రి వారం రోజుల క్రితమే ఆదేశించినట్లు తెలిసింది.ఏ కేంద్రంలోనూ మాస్ కాపీయింగ్ జరుగకుండా చూడాలని పేర్కొన్నట్టు సమాచారం
.
అరగంట ముందే పరీక్ష కేంద్రానికి
ఈ ఏడాది ఇంటర్ బోర్డు కూడా కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం విద్యార్థులు పరీక్ష కేంద్రానికి అరగంట ముందుగానే రావాల్సి ఉంటుంది. ఉ దయం తొమ్మిది గంటలకు పరీక్ష ప్రారంభమవుతుంది. ఎనిమిదిన్నర వరకే విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించ రు. ఆలస్యంగా వచ్చిన విద్యార్థులపై నిఘా ఉంచుతారు. విద్యార్థుల సమక్షంలోనే ప్రశ్నపత్రాల బండిల్‌ను తెరుస్తారు. దీంతో పేపర్ లీకును అరికట్టే అవకాశం ఉంటుం దని, మాస్ కాపీయింగ్‌నూ నిరోధించవచ్చని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈసారి జీపీఎస్ అనుసంధానంతో, గూగూల్ సహాయంతో పరీక్ష కేంద్రాలపై నిఘా ఏర్పా టు చేస్తున్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో, పరీక్ష హాలులో ఎవరు ఎవరితో ఫోన్‌లో మాట్లాడుతున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకోనున్నారు. ఫోన్‌ల ద్వారా ఎస్‌ఎంఎస్ లు వచ్చిపోవడాన్ని గుర్తుపట్టనున్నారు. దీని ద్వారా సెల్‌ఫోన్ల ద్వారా జరిగే మాస్ కాపీయింగ్‌కు అడ్డుకట్ట పడుతుందనేది అధికారుల ఆలోచన.
ఉత్తమ ఫలితాల కోసం
జిల్లాలో ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగానే మాస్ కాపీయింగ్‌ను నిరోధిస్తున్నారు. మార్చి 12 నుం చి పరీక్షలు ప్రారంభమై 26వరకు కొనసాగుతాయి. ఫిబ్రవరి ఒకటి నుంచి 28 వరకు ప్రాక్టికల్ పరీక్షలు జరుగనున్నాయి. మొదటి సంవత్సరంలో 28,158 మంది విద్యా ర్థులు, రెండవ సంవత్సరంలో రెగ్యులర్ విద్యార్థులు 25,311 మంది, ప్రైవేట్ విద్యార్థులు 5,307 మంది పరీక్షలు రాయబోతున్నారు. 76 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చే శారు. గత ఏడాది జిల్లా రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. ఈ సారి మంచి స్థానాన్ని సంపాదించాలని అధికారులు భావిస్తున్నారు.
పకడ్బందీగా నిర్వహిస్తాం
ఈ ఏడాది ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. మాస్‌కాపీయింగ్ జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఈ ఏడాది కొత్తగా జీపీఎస్ సహాయంతో పరీక్ష కేంద్రాలపై నిఘా ఉంటుంది. విద్యార్థులు అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. మరిన్ని నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది.
-విజయ్‌కుమార్, ఆర్‌ఐఓ
నకలు నడవదు
Published Tue, Jan 28 2014 2:55 AM | Last Updated on Thu, Aug 16 2018 4:36 PM
Advertisement