హాస్టల్‌లో కలెక్టర్ రాత్రి బస | Collector was stayed in government hostel the night | Sakshi
Sakshi News home page

హాస్టల్‌లో కలెక్టర్ రాత్రి బస

Published Wed, Oct 30 2013 1:46 AM | Last Updated on Sat, Sep 2 2017 12:06 AM

Collector  was stayed in government hostel the night

పత్తికొండ టౌన్, న్యూస్‌లైన్:  స్థానిక ఎస్సీ నంబర్ 2 హాస్టల్‌లో మంగళవారం కలెక్టర్ సుదర్శన్ రెడ్డి రాత్రి బస చేశారు. పది గంటలకు ఆయన హాస్టల్‌కు వచ్చారు. పదోతరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రణాళికబద్ధంగా చదవి విజయం సాధించాలన్నారు. ఉన్నతచదువులు చదివితేనే ఉజ్వలభవిష్యత్తు ఉంటుందని తెలిపారు.. జిల్లా పరిశ్రమల మేనేజర్ సుందర్‌రావు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్య, ఉద్యోగ అవకాశాలపై వివరించారు. అనంతరం కలెక్టర్ హాస్టల్‌లోని వంటగది, బాత్‌రూంలను పరిశీలించారు. ఆయన వెంట సాంఘికసంక్షేమశాఖ డీడీ శోభారాణి, డీ టీడబ్ల్యుఓ గిరిధర్‌రావు, జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి రవిచంద్ర, తహశీల్దార్ రామక్రిష్ణ, ఎంఈఓ కబీర్, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈఈ మురళీధర్, ఎఎస్‌డబ్యుఓ నాగభూషణం, వార్డెన్లు నాగరాజు, రమేష్ పాల్గొన్నారు.
 విద్యార్థిసంఘాల నాయకులపై ఆగ్రహం:
 పత్తికొండలోని ఆదర్శపాఠశాలకు రస్తాలేదని వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ విద్యార్థిసంఘాల నాయకులపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. ఉదయం రండి అని చెప్పినా విద్యార్థిసంఘాల నాయకులు వినకపోవడంతో వీరిని ఇక్కడికి ఎవరు పిలిపించారు, నేను వెళ్లిపోతా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement