కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: స్వామి వివేకానందను యువత ఆదర్శంగా తీసుకోవాలని కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. స్థానిక మెడికల్ కాలేజీ మైదానంలో వివేకానంద జయంతి ఉత్సవాల ముగింపు సమావేశం నిర్వహించారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ఏకాగ్రత, పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అందుకోవాలన్నారు. ప్రతిరోజు వివేకానందుని సూక్తులను గుర్తు చేసుకుంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సరస్వతి విద్యా పీఠం క్షేత్ర సంఘటన కార్యదర్శి(హైదరాబాద్) లింగం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. బలమే జీవనం, బలహీనతే మరణం అని చాటి చెప్పిన మహనీయుడు వివేకానందుడన్నారు. సంకల్పం మంచిదైతే, దాన్ని ప్రణాళికాబద్ధంగా ఆచరణలో పెడితే విజయం తప్పక వరిస్తుందని రవీంద్ర విద్యా సంస్థల డెరైక్టర్ పుల్లయ్య అన్నారు. వివేకానంద జయంతి ఉత్సవ సమితి ఒక ఉత్తమ సంకల్పంతో కర్నూలు నగరంలోని రాజ్‌విహార్ సర్కిల్‌లో వివేకానందుడి విగ్రహం ప్రతిష్టించిందన్నారు.
ఆకట్టుకున్న ర్యాలీ : ఉదయం 10 గంటల నుంచి నగరంలోని వివిధ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు వివేకానందుని చిత్ర పటాల ఫ్లెక్సీలతో ర్యాలీగా కదిలి వచ్చారు. కొందరు విద్యార్థులు వివేకానందుని వేషధారణలో ర్యాలీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ సూర్యప్రకాష్, నగరపాలక సంస్థ కమిషనర్ వివిఎస్.మూర్తి, కట్టమంచి స్కూల్ డెరైక్టర్ జనార్దన్ రెడ్డి, వివేకానంద ఉత్సవ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు రామక్రిష్ణారెడ్డి, కార్యదర్శి ఎన్.శ్రీనివాసరెడ్డి, కార్యాధ్యక్షులు కిష్టన్న, కోశాధికారి శివ ప్రసాదరావు,రవీంద్ర ఇంజినీరింగ్ కళాశాలల డెరైక్టర్ రామమోహన్, సుబ్బయ్య, కాళంగి నరసింహ వర్మ, సందడి సుధాకర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
వివేకానందుడే ఆదర్శం
Published Fri, Jan 24 2014 2:06 AM | Last Updated on Sat, Sep 2 2017 2:55 AM
Advertisement