కొత్తపల్లి, న్యూస్‌లైన్: కొలనుభారతి పుణ్యక్షేత్రంలో మంగళవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే సరస్వతీ దేవి అమ్మవారికి గణపతిపూజ, సహస్రనామ కుంకుమార్చన చేశారు. శ్రీశైలం దేవస్థానం పంపిన పట్టువస్త్రాలను ప్రభుత్వ లాంఛనాలతో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆయన సతీమణి అపర్ణలు సమర్పించారు. ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులు వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకల్లో దాదాపు 10వేల మంది భక్తులు పాల్గొన్నారు.
భక్తులంతా ముందుగా చారుఘోషిణి నదిలో స్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం 600 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు పలకలు, పెన్నులు, బలపాలు పంపిణీ చేశారు. కాశిరెడ్డినాయన సంఘం, ఆర్యవైశ్య సంఘం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు.
కనుల పండువగా వసంత పంచమి
Published Wed, Feb 5 2014 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement