kothapally
-
మాట నిలబెట్టుకున్న పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
మాట ఇవ్వడం.. మరచిపోవడం.. ప్రజలు గుర్తు చేసినా పట్టించుకోకపోవడం.. ఎన్నికల సమయంలో మళ్లీ అదే మాట ఇవ్వడం.. ఓట్లు అభ్యరి్థంచడం.. కొందరు ప్రజాప్రతినిధులకు పరిపాటిగా మారింది. అయితే ఇందుకు భిన్నంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇచ్చిన మాటమీద నిలబడ్డారు. పత్తికొండ నియోజకవర్గంలో కొన్ని గ్రామాల ‘దారి’్రద్యాన్ని తొలగించారు. ఆయా ప్రాంతాల ప్రజల మధ్య అనుబంధాలకు ‘వారధి’ వేశారు. దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణం పూర్తి కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు(అర్బన్): వర్షాకాలం వచ్చిందంటే వారిలో వణుకు ప్రారంభమయ్యేది. ఊరి సమీపంలోని వాగు పొంగితే సమీప గ్రామాలకు రాకపోకలు ఆగిపోయేవి. పంట పొలాలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవి. అరోగ్యం బాగాలేకపోయి, అత్యవసర పరిస్థితుల్లో బయటకు వెళ్లాలన్నా నరకాన్ని అనుభవించాల్సి వచ్చేది.. ఈ దుస్థితిని ఆ గ్రామ ప్రజలు ఎందరికో వివరించారు. చూద్దాం.. చేద్దాం అన్నారు తప్పితే చిత్తశుద్ధితో ఎవరూ ప్రయత్నం చేయలేదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో పత్తికొండ వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంగాటి శ్రీదేవి.. గ్రామ ప్రజల కష్టాన్ని విన్నారు. తాను గెలిచిన వెంటనే బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుని దూదేకొండ – కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయించారు. త్వరలోనే ఈ బ్రిడ్జిని ప్రారంభించనున్నారు. రూ. 6.62 కోట్ల ఖర్చు పత్తికొండ మండలం దూదేకొండ – కొత్తపల్లి గ్రామాల మధ్యన పెద్దవాగుపై లోలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.6.62 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులు మంజూరయ్యాయి. దీంతో ఈ రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న మట్టి రోడ్డును పూర్తిగా తవ్వేసి, రోడ్డు మ«ధ్యలో ఉన్న వంకపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. బ్రిడ్జికి రెండు వైపులా 4 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును వేశారు. బ్రిడ్జి నిర్మాణానికి నాలుగు శ్లాబ్‌లను పూర్తి చేసి రోడ్డుకు అవసరమైన ప్రాంతాల్లో 10 కల్వర్టులను (మోరీలు) నిర్మించారు. ఈ బ్రిడ్జీ, రోడ్డు నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో దూదేకొండ నుంచి కొత్తపల్లి మీదుగా పులికొండ తదితర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమైంది. పెరగనున్న రవాణా సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఒక వైపు జాతీయ, జిల్లా రహదారులను అభివృద్ధి చేస్తూనే, మరో వైపు పల్లె రోడ్లకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్టు (ఏపీఆర్ఆర్పీ) నిధులతో జిల్లాలోని పలు రోడ్లు, బ్రిడ్జీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో రూ.30 కోట్ల వ్యయంతో పత్తికొండ నియోజకవర్గంలోని దూదేకొండ – కొత్తపల్లి, కోడుమూరు నియోజకవర్గంలోని గోరంట్ల హంద్రీ నదిపై బ్రిడ్జీల నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే ఒక బ్రిడ్జి, రోడ్డు పనులు పూర్తయ్యాయి. మరో రోడ్డు, బ్రిడ్జి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రెండు బ్రిడ్జీలు పూర్తి అయితే పది గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు జిల్లా కేంద్రానికి చేరుకునేందుకు 15 కిలోమీటర్ల దూరం కూడా తగ్గనుంది. ఈ రెండు ప్రాంతాల్లో బ్రిడ్జీలను నిర్మించాలనే ప్రజల కోరికను టీడీపీ నేతలు పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం గ్రామీణ రోడ్లపై ప్రత్యేక దృష్టి సారించడంతో ఈ బ్రిడ్జీలకు మోక్షం లభించింది. మరో రెండు వంతెనలకు రూ.8.10 కోట్లతో అంచనాలు పత్తికొండ నియోజకవర్గంలోని వేర్వేరు ప్రాంతాల్లో రెండు వంతెనల నిర్మాణాలకు సంబంధించి పంచాయతీరాజ్ ఇంజినీర్లు రూ.8.10 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. ఈఏడాది జూన్ 1వ తేదిన పత్తికొండకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఈ రెండు వంతెనల అంశాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి తీసుకువెళ్లారు. అందుకు ముఖ్యమంత్రి వెంటనే సమ్మతించిన నేపథ్యంలో పీఆర్ ఇంజినీర్లు అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపారు. రూ.70 లక్షలతో కంభాలపాడు – కోయిలకొండ మార్గంలో లోలెవెల్ వంతెన, కృష్ణగిరి మండలం గోకులపాడులో రూ.7.40 కోట్లతో హైలెవెల్ వంతెన నిర్మాణాలకు త్వరలోనే మంజూరు ఉత్తర్వులు వెలువడనున్నాయి. హంద్రీ నదిపై సాగుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు హంద్రీ నదిపై వేగంగా బ్రిడ్జి పనులు కోడుమూరు మండలం గోరంట్ల గ్రామానికి ఆనుకొని ప్రవహిస్తున్న హంద్రీ నదిపై రూ.24.12 కోట్ల ఏపీఆర్ఆర్పీ నిధులతో బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు. ఇప్పటి వరకు పియర్స్ పనులు పూర్తి అయ్యాయి. పియర్ క్యాప్స్, హెడ్ హారŠమ్స్ పూర్తి చేసిన అనంతరం శ్లాబ్ వేయనున్నారు. నిరీ్ణత సమయంలోగా ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయితే ... హంద్రీ నదికి ఇటు పక్క ఉన్న కృష్ణగిరి మండలంలోని బీ ఎర్రబాడు, మన్నేకుంట, ఎస్‌హెచ్ ఎర్రగుడి, కొత్తపల్లి, రామక్రిష్ణాపురం, మల్లాపురం తదితర గ్రామాల ప్రజలకు ఉన్న రాకపోకల ఇబ్బందులు తొలగిపోనున్నాయి. పైగా ఈ మండలంలోని కంభాలపాడు, ఎరుకులచెర్వు తదితర గ్రామాల నుంచి జిల్లా కేంద్రమైన కర్నూలుకు వచ్చేందుకు 15 కిలోమీటర్ల మేర దూరం తగ్గనుంది. 330 మీటర్ల పొడవుతో బ్రిడ్జి, 5.9 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించనున్నారు. ఈ ఏడాది మార్చి నెలలో ప్రారంభమైన ఈ పనులను నిరీ్ణత సమయంలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టారు. -
పెద్దపల్లి: రైలు ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి
సాక్షి, పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతుల్లో ఒకరు పర్మినెంట్ ఉద్యోగి మొకద్దం దుర్గయ్య కాగా.. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీనివాస్, వేణుగా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల మరణంతో బాధితుల కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. చదవండి: జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్ హత్య -
ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు
వర్ధన్నపేట: ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండటంతో తీవ్ర మానసిక ఒత్తిడి గురైన ఓ ఆర్టీసీ డ్రైవర్ గుండె పోటుకు గురయ్యాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కొత్తపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చీకటి వీరస్వామి తొర్రూరు డిపోలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెలాఖరున ఆయన రిటైర్మెంట్ ఉంది. ఈ క్రమంలో సమ్మె కొనసాగుతుండటంతో తాను ఒక్కడినే విధుల్లో చేరాలా.. వద్దా అని నిర్ణయించుకోలేక మానసిక సంఘర్షణకు లోనయ్యాడు. విధుల్లో చేరకపోతే రావాల్సిన డబ్బులు వస్తాయో రావో అని ఆందోళన చెందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఆర్టీసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం మేడ్చల్: నగరంలోని రాణిగంజ్ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్న ఆర్టీసీ కారి్మకుడు గురువారం ఉదయం ఆత్మహత్యాయత్నం చేశాడు. మండలంలోని డబీల్‌పూర్ గ్రామానికి చెందిన షేక్‌బాబా రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో మెకా నిక్‌గా పని చేస్తున్నాడు. ఆర్టీసీ సమ్మె ఎటూ తేలకపోవడంతో మనస్తాపం చెందిన షేక్‌బాబా ఇంట్లో ఉన్న గుళికల్ని కూల్‌డ్రింక్‌లో కలుపుకుని తాగా డు. షేక్బాబాను గమనించిన కుటుంబ సభ్యులు అతడిని చికిత్స కోసం నగర శివార్లలోని ఓ ఆస్పత్రికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. -
7న కొత్తపల్లి–మనోహరాబాద్ రైలే ్వ లైనుకు శంకుస్థాపన
ఏడాది చివరి నాటికి భూసేకరణ పూర్తి కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ కరీంనగర్ సిటీ : కరీంనగర్–హైదరాబాద్‌లను కలిపే కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లైనుకు ఆగస్టు 7న గజ్వేల్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ శంఖుస్థాపన చేస్తారని ఎంపీ బి.వినోద్‌కుమార్ తెలిపారు. శనివారం కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మెదక్, వరంగల్, కరీంనగర్ జిల్లాల మీదుగా 151.36 కిలోమీటర్లతో ఈ లైను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మెదక్ జిల్లాలో 1260 ఎకరాలు, వరంగల్ జిల్లాలో 60 ఎకరాలు, కరీంనగర్ జిల్లాలో 900 ఎకరాల భూమి అవసరమన్నారు. మెదక్ జిల్లాలో 900 ఎకరాలు సేకరించామని, వరంగల్ జిల్లాలోని 60 ఎకరాలు సేకరించి పెగ్‌మార్కింగ్ చేపట్టామన్నారు. జిల్లాలో ఈ ఏడాది చివరివరకు భూసేకరణ పూర్తవుతుందన్నారు. సీఎం కేసీఆర్ కరీంనగర్ ఎంపీగా ఉన్నపుడు జిల్లా కేంద్రం, రాజధానిలను కలిపేందుకు ఈ లైనును ప్రతిపాదించారన్నారు. మూడవ వంతు రాష్ట్ర వాటా కింద అప్పటి ప్రభుత్వం అంగీకరించి, ఉచితంగా భూమిని ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. మొదటి ఐదు సంవత్సరాల్లో రైల్వే శాఖకు నష్టం వస్తే భరించాలనే ప్రతిపాదనకూ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందన్నారు. పెద్దపల్లి–కరీంనగర్–నిజామాబాద్ రైల్వే లైను 26 సంవత్సరాలైనా పూర్తి కాలేదని, ఈ కొత్తపల్లి–మనోహరాబాద్ లైన్ మాత్రం వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. సిరిసిల్లలో బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్‌ప్రభుతో శంకుస్థాపన చేయిస్తామన్నారు. వేములవాడ, కొండగట్టు, ధర్మపురి, బాసర తదితర పుణ్యక్షేత్రాలను కలుపుతూ రైల్వే కారిడార్ నిర్మించనున్నట్లు చెప్పారు. పరిపాలన సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొత్త జిల్లాలు రెండే ఉంటాయన్నారు. స్మార్ట్‌సిటీగా ఎంపికైన కరీంనగర్ వేగవంతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేసేందుకు పీపుల్స్ కాంటాక్ట్ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. జిల్లాలో విమానాశ్రయానికి బదులు ఎయిర్స్ ట్రిప్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఎలగందుల, ఎల్ఎండీ ప్రాంతాలను ఇందుకు పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఎమ్మెల్యే బొడిగె శోభ, నగర మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద గుమడాపురంలో పెద్దపులుల కలకలం
కొత్తపల్లి (కర్నూలు) : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమడాపురం గ్రామంలో పులి సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి కంది చేను వద్ద కావలికి వెళ్తున్న వ్యక్తి పులిని గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశాడు. దీంతో 40 మంది గ్రామస్థులు కలిసి దాన్ని తరమడానికి ప్రయత్నించారు. అనంతరం తెల్లవారుజామున అదే గ్రామ సమీపంలోని చెంచు గూడెం వద్ద మూడు పులులు సేద తీరుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. దీంతో గ్రామంలో ఉండలేమంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు నిజంగా ఆ ప్రాంతంలో పులుల గుంపు సంచరిస్తుందేమో ఆరా తీసే పనిలో పడ్డారు. -
కొత్తపల్లి ఆంధ్రాబ్యాంక్‌లో కత్తితో వీరంగం
కరీంనగర్ : కత్తితో బ్యాంక్ లోపలికి ప్రవేశించిన ఓ వ్యక్తి విచక్షణారహితంగా అటెండర్ పై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో బ్యాంక్ అటెండర్ కి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి గ్రామంలోని ఆంధ్రాబ్యాంక్‌లో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కొత్తపల్లి గ్రామ ఆంధ్రాబ్యాంక్‌లో అటెండర్ గా పనిచేస్తున్న వెంకటస్వామిపై అదే గ్రామానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి కొబ్బరి బోండాలు నరికే కత్తితో దాడి చేశాడు .దీంతో అటెండర్ మెడ మీద తీవ్ర గాయమవడంతో అతను బ్యాంక్‌లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అటెండర్ వెంకటస్వామిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు గత కొద్ది రోజులుగా లోన్ కోసం బ్యాంక్‌కు పలుమార్లు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
కనుల పండువగా వసంత పంచమి
కొత్తపల్లి, న్యూస్‌లైన్: కొలనుభారతి పుణ్యక్షేత్రంలో మంగళవారం వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయాన్నే సరస్వతీ దేవి అమ్మవారికి గణపతిపూజ, సహస్రనామ కుంకుమార్చన చేశారు. శ్రీశైలం దేవస్థానం పంపిన పట్టువస్త్రాలను ప్రభుత్వ లాంఛనాలతో కలెక్టర్ సుదర్శన్‌రెడ్డి, ఆయన సతీమణి అపర్ణలు సమర్పించారు. ఆలయ ధర్మకర్త చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పురోహితులు వీరికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం పట్టువస్త్రాలతో అమ్మవారిని అలంకరించారు. కుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. వసంత పంచమి వేడుకల్లో దాదాపు 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. భక్తులంతా ముందుగా చారుఘోషిణి నదిలో స్నానాలాచరించి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం 600 మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. చిన్నారులకు పలకలు, పెన్నులు, బలపాలు పంపిణీ చేశారు. కాశిరెడ్డినాయన సంఘం, ఆర్యవైశ్య సంఘం ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించాయి. ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడిపారు.