Peddapalli: 3 Railway Employees Died After Bengaluru Rajdhani Express Hit - Sakshi
Sakshi News home page

విషాదం.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు మృతి

Published Tue, Sep 20 2022 5:44 PM | Last Updated on Tue, Sep 20 2022 7:01 PM

Peddapalli: 3 Railway Employees Died After Bengaluru Rajdhani Express Hit - Sakshi

సాక్షి, పెద్ద‌ప‌ల్లి: పెద్దపల్లి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. న్యూఢిల్లీ నుంచి బెంగుళూరు వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ ఢీకొని ముగ్గురు రైల్వే ఉద్యోగులు దుర్మరణం చెందారు. చీకురాయి, కొత్తపల్లి గ్రామాల మధ్య రైలు పట్టాలపై మరమత్తులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

మృతుల్లో ఒకరు పర్మినెంట్‌ ఉద్యోగి మొకద్దం దుర్గయ్య కాగా.. ఇద్దరు కాంట్రాక్టు ఉద్యోగులు శ్రీనివాస్‌, వేణుగా గుర్తించారు. రైల్వే ఉద్యోగుల మరణంతో బాధితుల కుటుంబాల్లో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు.
చదవండి: జనగామ: కిడ్నాపైన బాలుడు షబ్బీర్‌ హత్య

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement