కొత్తపల్లి (కర్నూలు) : కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పెద్ద గుమడాపురం గ్రామంలో పులి సంచరిస్తుందనే వార్త కలకలం రేపుతోంది. ఆదివారం రాత్రి కంది చేను వద్ద కావలికి వెళ్తున్న వ్యక్తి పులిని గుర్తించి గ్రామస్థులను అప్రమత్తం చేశాడు. దీంతో 40 మంది గ్రామస్థులు కలిసి దాన్ని తరమడానికి ప్రయత్నించారు.
అనంతరం తెల్లవారుజామున అదే గ్రామ సమీపంలోని చెంచు గూడెం వద్ద మూడు పులులు సేద తీరుతున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు హడలిపోయారు. దీంతో గ్రామంలో ఉండలేమంటూ అధికారులకు మొర పెట్టుకుంటున్నారు. రంగంలోకి దిగిన అటవీ అధికారులు నిజంగా ఆ ప్రాంతంలో పులుల గుంపు సంచరిస్తుందేమో ఆరా తీసే పనిలో పడ్డారు.
పెద్ద గుమడాపురంలో పెద్దపులుల కలకలం
Published Mon, Dec 28 2015 5:25 PM | Last Updated on Sun, Sep 3 2017 2:42 PM
Advertisement
Advertisement