wandering
-
తెలంగాణ సచివాలయంలో నాగుపాము కలకలం
సాక్షి, హైదరబాద్: గ్రేటర్ నగరంలో విష సర్పాలు బుసలు కొడుతున్నాయి. విస్తరిస్తోన్న కాంక్రీట్ జంగిల్, చెట్ల నరికివేత..బ్లాస్టింగ్..తదితర అభివృద్ధి ప్రక్రియలతో విషసర్పాలకు ఆవాస సమస్య తలెత్తి పుట్టల్లోంచి బయటకు వస్తున్నాయి. బహుళ అంతస్తుల భవంతులు, అపార్ట్మెంట్లు, విల్లాలు వెలుస్తుండడంతో పాముల మనుగడ కూడా ప్రశ్నార్థకమౌతోంది. గతేడాదిగా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సభ్యులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 వేల పాములను సంరక్షించారు. వీటిలో సుమారు 4 వేల వరకు గ్రేటర్ పరిధిలోనివే కావడం గమనార్హం. ఇందులోనూ 60 శాతం విషసర్పాలున్నాయి. కాగా మంగళవారం సచివాలయం (బీఆర్కే భవన్)లో ఒక నాగుపాము కనిపించడంతో కలకలం మొదలైంది. ఉద్యోగులు ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీకి సమాచారం అందించారు. సొసైటీ సభ్యులు అక్కడికి చేరుకునేలోగానే పాము భవన్ సమీపంలో ఉన్న కలుగులో నుంచి వెళ్లిపోయిందని..దానిని పట్టుకోవడం సాధ్యపడలేదని స్నేక్ సొసైటీ కార్యదర్శి అవినాష్ ‘సాక్షి’కి తెలిపారు. పాముల జాగాలో మనుషుల ఆవాసాలు.. ⇔ ఒకప్పుడు పాములు మనుగడ సాగించిన ప్రాంతాల్లో ఇప్పుడు బహుళ అంతస్తుల భవంతులు..గేటెడ్ కమ్యూనిటీలు వెలుస్తుండడంతో పాముల సహజసిద్ధమైన ఆవాసాలు దెబ్బతింటున్నాయి. ⇔ ప్రధాన నగరంలోని జూబ్లీహిల్స్‌తోపాటు శివార్లలోని గచ్చిబౌలి, కొండాపూర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, నెక్నాంపూర్, లింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్, వనస్థలిపురం, సాగర్‌రింగ్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో పాముల సంఖ్య పెరిగింది. ⇔ వీటిలో విషసర్పాలుగా పేరొందిన నాగుపాము లు, స్పెక్టకిల్డ్ కోబ్రా, రస్సెల్ వైపర్, కామన్ కైరా ట్, స్కా స్కేల్డ్ వైపర్ వంటి విషసర్పాలే అధికం. ⇔ జనావాసాల్లోకి పాములు వస్తే 8374233366 నెంబర్‌కు ఫోన్ చేయాలని ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ ప్రధాన కార్యదర్శి అవినాష్ తెలిపారు. -
రాజేరేంద్రనగర్ లో చిరుత సంచారం
-
పదేళ్ల తర్వాత జిల్లాలో పులుల సంచారం!
సాక్షి, ములుగు: పదేళ్ల తర్వాత ములుగు జిల్లాలో పులి అడుగు జాడలు కనిపించాయి. దాదాపు రెండు నెలల క్రితం భూపాలపల్లి, మహాముత్తారం, కాటారం అడవుల్లో పులులు సంచరించాయి. అదే సమయంలో జిల్లాలో పులి సంచరించినట్లు పుకార్లు వినిపించారు. అయితే ఈ పుకార్లను కొట్టిపారేస్తూ గత నెల 12వ తేదీన ఏటూరునాగారం వైల్డ్ లైఫ్ పరిధి కన్నాయిగూడెం మండలంలోని అటవీ ప్రాంతాల్లో పులి సంచరించినట్లుగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అనంతరం 20 రోజుల సమయంలో ఏటూరునాగారం అడవుల్లో పులి జాడ ఎక్కడా కనిపించలేదు. అయితే వారం పది రోజుల క్రితం మహబూబాబాద్ జిల్లా గూడురు, కొత్తగూడ అడవుల్లో పులి సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించగా.. తాజాగా ఈ నెల 6న వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం ఖానాపురం మండలంలోని బండమీది మామిడితండా అడవుల్లో పులి సంచరించినట్లు అడుగు జాడలు కనిపించాయి. కాగా ఏటూరునాగారం అభయారణ్యానికి కొత్తగూడ, పాకాల అభయారణ్యాలకు కనెక్టివిటీ ఉండడంతో ఒకే పులి ఆయా అడవుల్లో సంచరిస్తుందా లేదా మరోటి ఉందా అనే అనుమానంలో అధికారులు ఉన్నారు. ఈ మేరకు స్థానికంగా ఉన్న గిరిజనులు, గొత్తికోయ గూడేల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇదిలా ఉండగా గోదావరి సరిహద్దు ప్రాంతాల్లో నాలుగు పులులు సంచరిస్తున్నట్లుగా రెండు నెలలుగా వార్తలు వినిపిస్తుండడంతో పులుల సంఖ్య అంశం సమస్యగా మారింది. సీసీ కెమెరాలపై ప్రత్యేక దృష్టి మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల నుంచి రాష్ట్రంలోని అభయారణ్యాల్లోకి పులులు ప్రవేశించాయానే సమాచారం మేరకు జిల్లా అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గత 10 సంవత్సరాల క్రితం జిల్లాలోని ఏటూరునాగారం వైల్డ్‌లైఫ్ అటవీ ప్రాంతంలో పులి సంచరించినట్లుగా సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. గత 25 రోజులుగా కెమెరాలను పరిశీలిస్తున్నా అధికారులకు పులి సంచారం విషయంలో స్పష్టత రావడంలేదని తెలిసింది. రాష్ట్రానికి సరిహద్దుల్లో ఉన్న మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి రాష్ట్ర సరిహద్దుల్లోకి ఐదు నెలల కాలంలో ఆరు పులులు వచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ విషయంలో అధికారులు స్ప ష్టతనివ్వడం లేదు. ప్రతీ 10 రోజుల సమయంలో పులులు ఆయా జిల్లాల అభయారణ్యంలో కన్పించడంతో స్పష్టమైన వివరాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. బిక్కుబిక్కుమంటున్న ఏజెన్సీ.. పులి సంచారం విషయంలో ములుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల గిరిజనులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ప్రజలు తీవ్ర బయాందోళనకు గురవుతున్నారు. ఇదే క్రమంలో ఏటూరునాగారం ఆభయారాణ్యాన్ని టైగర్ జోన్‌గా మార్పు విషయంలో అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టేందుకు ముందుకు సాగుతుండటంతో ఏజెన్సీ అటవీ గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
వరంగల్‌లో చిరుత?
సాక్షి, హసన్‌పర్తి: వరంగల్ అర్బన్ జిల్లా హసన్‌పర్తి మండలం సీతంపేటలో ఓ జంతువు కనిపించడంతో భయాందోళనకు గురైన స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా వారు ఆదివారం గ్రామాన్ని సందర్శించి ఆ జంతువు పాద ముద్రలను పరిశీలించి పెద్ద పులివి కావని చెప్పారు. అయితే చిరుత పిల్ల, జంగపిల్లి జాతికి చెందిన లిపోడి క్యాట్‌గా అనుమానిస్తున్నారు. గ్రామ పంచాయతీ నర్సరీ నిర్వాహకుడు గుర్రాల చంద్రమౌళికి శనివారం సాయంత్రం పరిసరాల్లో ఓ జంతువు కనిపించింది. ముందుగా ఏదో జంతువుగా భావించాడు. అయితే అరగంట వరకు అది పొలం వద్దే ఉండడంతో కర్ర తీసుకుని వెళ్లేగొట్టే ప్రయత్నం చేశాడు. అయితే ఆ జంతువు పులిలా శబ్దం చేయడంతో కొంత వెనక్కి తగ్గాడు. ఆ తర్వాత జంతువు ముందుకు పరుగెత్తుతుండగా పులిలా కనిపించిందని చెప్పాడు. ఈ విషయం గ్రామస్తులకు తెలియడంతో భయాందోళనకు గురై ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వగా ఎల్కతుర్తి ఫారెస్ట్ రేంజర్ సందీప్, సెక్షన్ ఆఫీసర్లు హుస్సేన్, రమేష్, ముజీబ్ అక్కడి చేరుకున్నారు. ఆ జంతువు సంచరిస్తున్న సమయంలో తీసిన వీడియో క్లిపింగ్‌లు, పాద ముద్రలను పరిశీలించారు. ఇక్కడి వచ్చింది పెద్ద పులి మాత్రం కాదని, చిరుతపులి పిల్ల, లిపోడి క్యాట్‌గా అనుమానం వ్యక్తం చేశారు. ఒకవేళ చిరుత పిల్ల పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని, లేదంటే తిమ్మాపురం, గంటూరుపల్లి వైపునకు వెళ్లే అవకాశాలున్నాయని స్థానికులు అనుమానిస్తున్నారు. వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జంతువులను పట్టుకోవడానికి స్థానికులు ఎవరూ వేటకు వెళ్లొద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఒక వేళ ఆకస్మాత్తుగా చిరుత పిల్లను వేటాడినట్లయితే కేసులు నమోదు చేస్తామని ఫారెస్ట్ రేంజర్ సందీప్ హెచ్చరించారు. -
తిరుమలలో యధేచ్ఛగా వన్యమృగాల సంచారం
-
ఆసిఫాబాద్‌లో పెద్దపులి సంచారం
సాక్షి, ఆదిలాబాద్: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత 15 రోజులుగా రెబ్బన, ఆసిఫాబాద్ మండలాల్లో పులి సంచారం చేస్తూ స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇప్పటికే రెండు ఆవులను చంపటంతో పశువులు, గొర్రెల కాపరులు బయటకు వెళ్లేందుకు వణుకుతున్నారు. గత శనివారం ఉదయం పెద్దపులది చిర్రకుంట గ్రామం వద్ద రోడ్డు దాటుతూ ఫారెస్ట్ సిబ్బందికి కనిపించినట్లు సమాచారం. ఇక అదే రోజు రాత్రి కూడా పులి రోడ్డు మీదకు వచ్చేందుకు ప్రయత్నించగా ఆటవీ సిబ్బంది దానిని అడవిలోకి పంపించారు. ఈరోజు ఉదయం కైరిగూడ ఓసిసి వద్ద వాగు దాటుతుండగా చూసిన స్థానికులు మొబైల్లో వీడియో తీసి అధికారులకు పంపించారు. కాగా ఏప్రిల్ 21న మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో లాక్డౌన్ విధుల్లో ఉన్న పోలీసులకు కూడా పెద్దపులి కనిపించినట్లు సమాచారం. -
లాక్డౌన్: 128 ఏళ్లనాటి వాతావరణం..!
సాక్షి, తిరుమల: నిత్యం భక్తుల గోవింద నామాలతో మారుమోగే తిరుమలగిరుల్లో లాక్‌డౌన్‌తో రెండు వారాలుగా నిశ్శబ్ద వాతావరణం నెలకొనడంతో వన్యమృగాలు జన సంచారంలోకి వచ్చేస్తున్నాయి. మనుషుల అలికిడి లేకపోవడంతో శేషాచల అడవుల్లోని జంతువులు తిరుమల వీధుల్లోకి వచ్చి స్థానికులను, ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. అటవీ ప్రాంతానికి సమీపంలో ఉన్న కల్యాణ వేదిక, శ్రీవారి సేవ సదన్ వద్ద చిరుత, ఎలుగు బంట్లు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. మ్యూజియం వెనుక భాగంలో ఉన్న అటవీ ప్రాంతంలో రేసు కుక్కలు దుప్పిలపై దాడికి దిగిన ఘటనలతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. స్థానికులు నివాసం ఉంటున్న బాలాజీ నగర్, ఈస్ట్ బాలాజీ నగర్లలో సైతం చిరుతలు, అడవి పందులు, దుప్పి, పాముల సంచారం అధికంగా ఉంటోంది. ఇక పాపవినాశనం మార్గంలో గజరాజుల గుంపు సంచరిస్తోంది. ఘాట్ రోడ్డులో అధికం.. ముఖ్యంగా రెండు ఘాట్ రోడ్లలో చిరుతల సంచారం పెరిగింది. నాలుగు రోజుల క్రితం రెండు ఘాట్ రోడ్లను అనుసంధానం చేసే లింక్ రోడ్డులో చిరుత కనపడింది. దీంతో అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారు. మొదటి ఘాట్ రోడ్డుపై జింకలు, కణితి, దుప్పిలు సైతం గంపులు గుంపులుగా తిరుగుతున్నాయి. వన్య మృగాలు జనావాసంలోకి వస్తుండడంతో సాయంత్రం తరువాత బయట తిరగరాదని టీటీడీ, పోలీసు అధికారులు స్థానికులకు గట్టి ఆంక్షలు విధించారు. 128 ఏళ్లనాటి వాతావరణం..! 1900 తర్వాత నుంచి తిరుమలకు భక్తుల రాక క్రమంగా పెరుగుతూ రావడంతో వన్యమృగాలు జనసంచారంలోకి రావడంతో క్రమంగా తగ్గిపోతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా రెండు వారాలుగా ఆలయం మూత, ఘాట్‌రోడ్లపై రాకపోకల నిషేధంతో ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది. దీంతో వన్యమృగాలు స్వేచ్ఛగా తిరుమల వీధుల్లోకి ఘాట్ రోడ్లపైకి వచ్చేశాయి. 128 ఏళ్ల క్రితం మాత్రం ఒకసారి రెండు రోజుల పాటు గుడి మూతపడిన సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. అప్పట్లో ఆలయం చుట్టూ దట్టమైన అటవీ ప్రాంతం కావడం, శ్రీవారి ఆలయం మాత్రమే తిరుమలలో ఉండడంతో ఉదయం తిరుపతి నుంచి గుర్రాలపై అర్చకులు తిరుమలకు చేరుకునేవారు. సంధ్యా సమయం మొదలు కాకముందే తిరుపతికి తిరుగు ప్రయాణం అయ్యేవారు. ఇప్పుడు మళ్లీ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. -
రాజన్న సిరిసిల్ల జిల్లాలో చిరుత పులుల సంచారం
-
శ్రీశైలం దేవస్థానం లో చిరుత సంచారం
-
చిరుత అలజడి
తిరుమల కొండపై చిరుతలు మాటు వేశాయి. నిత్యం ఏదో ఓ మూలన సంచరిస్తూ భక్తులకు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. పదిహేను రోజుల క్రితం ఓ చిరుత బాలాజీ నగర్‌లోని ఇంట్లోకి చొరబడి కుక్కను ఎత్తుకెళ్లడం, తాజాగా ఆదివారం రాత్రి అదే ప్రాంతంలో సంచరిస్తూ స్థానికులకు కనిపించింది. వీటి సంచారాన్ని కట్టడి చేసేలా అటవీ ప్రాంతం చుట్టూ ఇనుప కంచె నిర్మాణ ప్రతిపాదనలను టీటీడీ వెంటనే అమలుచేయాలని కోరుతున్నారు. సాక్షి,తిరుమల: వేసవికి ముందే తిరుమల కొండపై చిరుతల సంచారం భక్తుల్లో భయాందోళనలను పెంచుతోంది. సుమారు 5.5 లక్షల హెక్టార్లలో విస్తరించిన శ్రీ వేంకటేశ్వర అభయారణ్యంలోని తూర్పున కడప జిల్లా నుంచి పశ్చిమాన తలకోన వరకు విస్తరించిన శేషాచల అడవుల పరిధిలో మొత్తం 50కిపైగా చిరుత పులులు సంచరిస్తున్నట్టు సమాచారం. ఇందులో ఎక్కువ భాగం తిరుమల శివారు అటవీ ప్రాంతంలోనే సంచరిస్తున్నాయి. జట్లుగా జనారణ్యంలోకి.. తిరుమలలో నాలుగు చిరుతలు సంచరిస్తున్నాయి. గతంలో ఒక్కొక్కటిగానే తిరిగేవి. ఇటీవల అవి రెండేసి చొప్పున జట్టుగా తిరుగుతున్నాయి. గోగర్భం తీర్థం సమీపంలోని మఠాల నుంచి రింగ్‌రోడ్డు గ్యాస్ గోడౌన్ మీదుగా స్థానికులు నివాసం ఉండే బాలాజీనగర్ తూర్పుప్రాంతం నుంచి దివ్యారామం వరకు సంచరిస్తున్నాయి. టీటీడీ ఉద్యోగులు నివాసం ఉండే బీ, డీటైపు క్వార్టర్లు, మొదటి ఘాట్‌రోడ్డులోని జింకలపార్కు నుంచి అవ్వాచ్చారి కోన, అలిపిరి కాలిబాటమార్గం మీదుగా దివ్యారామం, రెండో ఘాట్‌రోడ్డు ద్వారా శ్రీవారిమెట్టు వరకు కూడా కలియతిరుగుతున్నాయి. చీకటిపడితే చిరుతల భయం.. పదిహేను రోజుల క్రితం ఇక్కడి బాలాజీనగర్ తూర్పుప్రాంతంలో ఓ ఇంట్లోకి చిరుత చొరబడి ఓ కుక్కను ఎత్తుకెళ్లింది. ఇక ఆదివారం రాత్రి 7.30 గంటలకు అదే ప్రాంతానికే చిరుత మళ్లీ వచ్చింది. గంటపాటు కలియ తిరిగింది. ఆ దృశ్యాలను ఓ స్థానికుడు తన కెమెరాలో బంధించారు. పెద్ద ఎత్తున స్థానికులు చేరుకోవడంతో ఆ చిరుత అడవిలోకి పారిపోయింది. గతంలోనూ గోగర్భం మఠాల్లోకి, వీఐపీల అతిథిగృహాల్లోకి చిరుత చొరబడిన ఘటనలు కూడా ఉన్నాయి. దీంతో ఎప్పుడు ఏ మార్గంలో చిరుతలు వస్తాయోనని ఇటు భక్తులతో పాటు స్థానికులు ఆందోళన చెందుతున్నారు. టీటీడీ ఉద్యోగులు, కార్మికులతో పాటు దుకాణదారులు తమ నివాస ప్రాంతాలకు 24 గంటలు వెళ్లివస్తుంటారు. చిరుతల సంచారంతో వారు తీవ్ర కలవరపాటుకు గురవుతున్నారు. తిరుమల బాలాజీ నగర్‌లోని ఓ ఇంటి వద్ద మాటు వేసి ఉన్న చిరుత (ఫైల్) పొంచి ఉన్న ప్రమాదం? ఐదేళ్ల్ల క్రితం అలిపిరి కాలిబాట మా ర్గంలో తరచూ సంచరించే రెండు చిరుతల్ని అటవీశాఖ అధికారులు ప్రత్యేకంగా బోన్లు ఏర్పాటు చేసి బంధించారు. దట్టమైన అటవీమార్గాల్లో వదిలిపెట్టా రు. అదే తరహాలో ప్రస్తుతం సంచరించే వాటిని కూడా బంధించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో భక్తులతో పాటు స్థానికుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. అనుకోని ఘటన జరిగితే దాని ఫలితం టీటీడీపై ప్రభావం చూపే అవకాశం ఉంది. కొన్నేళ్లుగా బాలాజీనగర్ సమీపంలో చిరుతల సంచారం బాగా పెరిగిపోయింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో శివారు ప్రాంతంలో కంచె నిర్మించాలని గతంలోనే టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. ఆ ప్రతిపాదన ఇంతవరకు అమలు కాలేదు. ఆ దిశగా అయినా టీటీడీ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలో చిరుత సంచారం కలకలం
గాలివీడు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం పూలకుంట గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం వేకువజామున గ్రామ సమీపంలో ఉన్న గొర్రెల మందపై చిరుత దాడిచేసింది. ఈ సంఘటనలో ఆరు గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద వద్ద కాపలా ఉన్న గొర్రెల కాపరులు చిరుతను చూసి భయాందోళనకు గురై పరుగుతీశారు. చిరుత ఆరు గొర్రెలను హతమార్చి సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
తాటిచెర్లలో చిరుత సంచారం
అనతపురం రూరల్: తాటిచెర్లలో రెండు రోజులుగా చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్తులు సోమవారం అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు చిరుత కోసం గ్రామ పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఎలాగైనా దాన్ని పట్టుకునేందుకు వలలు సిద్ధం చేశారు. రాత్రి వేళల్లో సిబ్బంది ఇక్కడే ఉంటారని, ఎవ్వరూ భయపడాల్సిన పని లేదని అటవీ శాఖ అధికారి సాయిప్రసాద్ గ్రామ ప్రజలకు సూచించారు. నీటి కోసం గ్రామ సమీపంలోకి చిరుతలు వచ్చి ఉంటాయన్నారు. -
యాచారంలో చిరుతపులి సంచారం
యాచారం (రంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో చిరుత సంచారం స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. ఆదివారం రాత్రి తాడిపర్తి గ్రామంలో కడారి రాములు ఇంటి ఆవరణలో ఉన్న మేకల మందపై చిరుత దాడి చేసి ఒక మేకను ఎత్తుకుపోయింది. సోమవారం ఉదయం గమనించిన బాధిత రైతు స్థానికుల సాయంతో అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో అటవీ ప్రాంతంలో ఉండే ఈ ప్రాంతంలో ఇటీవలి కాలంలో చిరుతల సంచారం ఎక్కువైంది. వారం క్రితం కొత్తపల్లిలోకి ప్రవేశించిన ఒక చిరుత మేకను ఎత్తుకుపోయింది. దీంతో అటవీ అధికారులు దానిని బంధించేందుకు బోను ఏర్పాటు చేశారు.అయితే తాడిపర్తిలోకి ఆదివారం రాత్రి చిరుత ప్రవేశించటంతో ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. -
శ్రీశైలం డ్యాం వద్ద చిరుత సంచారం.
-
ఉరవకొండలో చిరుత సంచారం
-
టీ సచివాలయంలో ఎలుకలు వీరవిహారం
-
బాబోయ్ చిరుతలు
కామారెడ్డి : చిరుత పులుల సంచారం గ్రామీణులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఏడాది కాలంగా చిరుతలు జిల్లాలోని అటవీ శివారు గ్రామాల వైపు వస్తుండగా వాటిని పట్టుకోడానికి అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఏడాది క్రితం మాక్లూర్ మండలంలోని పలు గ్రామాల్లో చిరుతలు సంచరిస్తున్న విషయం బహిర్గతమైంది. తరువాత కొంతకాలానికి దోమకొండ, భిక్కనూరు మండలాల పరిధిలోని గ్రామాల శివారు ప్రాంతాల్లో చిరుతలు తిరిగాయి. తాజాగా అటవీ ప్రాంతం ఎక్కువగా ఉన్న మాచారెడ్డి మండలంలో చిరుతలు సంచరిస్తుండడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళితే...ఏడాది క్రితం మాక్లూర్ మండలం గుత్ప, మాదాపూర్, చిన్నాపూర్, మామిడిపల్లి, మెట్పల్లి, గంగరమంద గ్రామాల్లో చిరుతలు సంచరించాయి. వాటి కోసం అటవీ శాఖ గాలింపు చర్యలు చేపట్టింది. తరువాత కొంత కాలానికే దోమకొండ, భిక్కనూరు మండలాల సరిహద్దుల్లోని ముత్యంపేట, దోమకొండ, జంగంపల్లి గ్రామాల శివారులోని పంట చేలల్లో చిరుత తిరిగిన ఆనవాళ్లు బయటపడ్డాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంలో చిరుతల సంచారం గురించిన చర్చ జరుగుతూనే ఉంది. అయితే వర్షాలు కురిసేదాకా ఎక్కడా చిరుతల సంచారం బయటపడలేదు. ఇటీవల వర్షాలు కురవడం, అడవి పచ్చదనాన్ని సంతరించుకున్న దరిమిలా చిరుత సంచారం కనిపించింది. మాచారెడ్డి మండలంలోని ఇసాయిపేట గ్రామ శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో చిరుత సంచరించిందన్న విషయాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ విషయాన్ని అటవీ అధికారులకు తెలపడంతో అటవీ ప్రాంతంలో బోను ఏర్పాటు చేశారు. కాని చిరుత ఆచూకీ దొరకలేదు. ఇదే మండలంలోని ఎల్లంపేట గ్రామానికి చెందిన గిరిజనులు ఆదివారం ఆవులు, గేదెలను మేత కోసం ఇసాయిపేట అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లగా పశువుల మందపై చిరుత దాడి చేయడంతో అవి భయంతో గ్రామంవైపు పరుగులు తీశాయి. ఒక్కొక్కటిగా పాడుబడిన బావిలో పడిపోయాయి. విషయం తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికి చేరుకుని బావిలో పడిన 15 ఆవులు, బర్రెలనుతాళ్ల సాయంతో పైకి తీశారు. కాగా గాయాలపాలైన రెండు ఆవులు మృతి చెందాయి. పశువుల వెంట చిరుతలు పడడంతో కాపరులు భయంతో పరుగులు తీశారు. అటవీ ప్రాంత గ్రామాల్లో భయం భయం... ఇసాయిపేట గ్రామం చుట్టూరా అటవీ ప్రాంతం ఉంది. ఇసాయిపేట, అక్కాపూర్, ఎల్లంపేట, అన్నారం, దేవునిపల్లి, పోతారం, సింగరాయపల్లి తదితర గ్రామాల సరిహద్దు అటవీ ప్రాంతం కలిసి ఉండడం, అటవీ ప్రాంతానికి ఆనుకుని ఆయా గ్రామాలకు చెందిన రైతుల వ్యవసాయ భూములు ఉండడంతో రైతులు వ్యవసాయ పనులకు నిత్యం వెళ్తుంటారు. చిరుత తిరుగుతుందన్న భయం ఇప్పుడు ఆయా గ్రామాల ప్రజలను వెన్నాడుతోంది. వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉన్నపుడు చిరుతలు దాడి చేస్తాయన్న భయంతో ఉన్న రైతులు చిరుతల బారి నుంచి తమను కాపాడాలని, ఇందు కోసం అటవీ శాఖ అధికారులు కృషిచేయాలని కోరుతున్నారు. -
మాచారెడ్డిలో చిరుతల కలకలం
మాచారెడ్డి (నిజామాబాద్) : నిజామాబాద్ జిల్లా మాచారెడ్డి మండలంలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. మండల పరిధిలోని పలు గ్రామాల్లో సుమారు పది చిరుతలు సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించడంతో.. ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మండలంలోని అన్నారం, అక్కాపూర్, ఇసాయిపేట, మద్దికుంట, రెడ్డిపేట ప్రాంతాల్లో చిరుతలు సంచిరిస్తున్నాయని సమాచారంతో అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు వాటిని పట్టుకునేందుకు బోన్లను ఏర్పాటు చేశారు. -
చిరుతను చూసి పరుగులు తీసిన భక్తులు
తిరుమల: తిరుమలలో చిరుతల సంచారం పెరిగింది. ఇప్పటివరకు రాత్రి వేళల్లో కనిపించే చిరుతలు ప్రస్తుతం పగలే కనిపిస్తున్నాయి. మంగళవారం సాయంత్రం 5.20 గంటలకు జీఎన్సీకి సమీపంలోని తిరుపతికి వెళ్లే 56 వ మలుపు వద్ద ఓ చిరుత కాలిబాట దాటింది. దాన్ని చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు. అది కాస్త రోడ్డుపైకి వచ్చింది. రోడ్డు దాటకుండా అటూ ఇటూ చూస్తూ ఉండిపోయింది. అదే సమయంలో అటువైపు వచ్చిన ఆర్టీసీ బస్సు ముందుకు వెళ్లకుండా ఆగిపోయింది. అదే సమయంలో వెళ్లిన ద్విచక్రవాహనదారులైన టీటీడీ ఉద్యోగులు కూడా ఆగిపోయారు. ఎక్కడ చిరుత దాడి చేస్తుందోనని వెనక్కు వెళ్లిపోయారు. తర్వాత ఆ చిరుత సాఫీగా అడవిలోకి వెళ్లిపోయిందని టీటీడీ ఉద్యోగి రత్నప్రభాకర్ తెలిపారు. తాము రాత్రి, పగలు అన్న తేడా లేకుండా ద్విచక్రవాహనంపై వెళుతుంటామని, తొలిసారి పగలు చిరుతను చూశామని తెలిపారు. ఇటీవల చిరుతల సంచారం పెరిగినా టీటీడీ వాటిని బంధించలేమని తేల్చి చెప్పటం గమనార్హం. -
వెంకన్న సన్నిధిని వదలని చిరుతలు
- వేకువజాము 4.30 గంటలకు చొరబడిన చిరుత - అదే సమయంలో కాలిబాటలో మరో చిరుత తిరుమల : తిరుమల శివారు ప్రాంతాలను చిరుతలు వదలటం లేదు. గురువారం వేకువజామున రెండు చిరుతలు కనిపించాయి. 4.30 గంటల ప్రాంతంలో బాలాజీనగర్ 8వ లైనులోని 755 ఇంటి ఎదురుగాచిరుత కనిపించింది. జనావాసాల్లో చిరుత సంచార తీవ్రతను చూపేందుకు సాక్షి బృందం అక్కడే వాహనంలో బుధవారం రాత్రంతా కాపుకాసింది. వేకువజాము సరిగ్గా 4.30 గంటల సమయంలో అటవీ మార్గం నుండి చిరుత రావటాన్ని సాక్షి బృందం గుర్తించింది. అది ఓ కుప్పతొట్టి వెనుకవైపు నక్కి తలను పైకెత్తి చూస్తుండగా.. ఆ దృశ్యాలను సాక్షి బృందం క్షణాల్లో కెమెరాలో బంధించింది. అయినా ఆ చిరుత బెదరకుండా కుప్పతొట్టిపైకి ఎక్కింది. వాహనం తన సమీపానికి రావటాన్ని గుర్తించిన ఆ చిరుత దాడి చేసేందుకు సన్నద్ధమైంది. ఒకేసారి నాలుగు పాదాలను కుప్పతొట్టిపై బిగుంచుకుని తన శరీరాన్నంతా కూడగట్టుకుంది. ఇంతలో కెమెరా ఫ్లాష్‌తోపాటు ఫోకస్లైట్ల వెలుతురు పడటంతో అది క్షణాల్లో చెట్ల పొదల్లోకి వెళ్లింది. ఇక తిరుపతికి వెళ్లే మొదటి రోడ్డుమార్గంలోని జీఎన్సీకి సమీపంలో తొలి మలుపు వద్ద చిరుత కాలిబాట నుండి రోడ్డు మార్గాన్ని దాటింది. ఆ సమయంలో కాలిబాటలో భక్తులు లేకపోడంతో ప్రమాదం తప్పింది. అదే చిరుత రోడ్డుపైకి రావటంతో తిరుపతికి వెళ్లే ప్రైవేట్ వాహనదారులు గుర్తించారు. తిరుమల శివారు ప్రాంతాల్లో నాలుగు, కాలిబాటల్లో రెండు చిరుతలు సంచరిస్తున్నట్టు సమాచారం. ఈ నెల 26న ఓ చిరుత లైవ్ ఫొటోలు ఇవ్వగా, గురువారం మరోసారి సాక్షి బృందం సాహసోపేతంగా మరో చిరుత చిత్రాలు అందించి సమస్యను పరిష్కరించాలని జనం పక్షాన సంబంధిత విభాగాలకు విజ్ఞప్తి చేస్తోంది. ప్రస్తుతం చిరుతల బంధీ కోసం రెండు బోన్లు నామమాత్రంగానే ఏర్పాటు చేశారు. వాటిలో ఎలాంటి ఎర వేయకుండానే మూసి ఉంచటం వల్ల చిరుతలు బోన్లు వద్దకు వెళ్లడం లేదు. ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా బోన్లు నిర్వహించలేమని సంబంధిత ఫారెస్ట్ అధికారులు చెబుతుండటంతో చూస్తే.. ఆ విభాగాలకు చిరుతలను బంధీ చేయాల్సిన ఆలోచనే లేదని తెలుస్తోంది. -
చింతపల్లిలో చిరుత సంచారం!
గుట్టపై మేక కళేబరం హైనా అయి ఉంటుందంటున్న అటవీ శాఖాధికారి చింతపల్లి(కురవి) : మండలంలోని చింతపల్లి గుట్ట ల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతోంది. చింతపల్లి శివారులోని సీరోలు క్రాస్‌రోడ్ సమీపంలో ఉ న్న బోడ గుట్టపైన మేకను తిన్న ఆనవా ళ్లు సోమవారం కనిపించించారుు. తండా కు చెందిన భూక్య సూక్యకు చెందిన మేక ల మంద ఆదివారం మేత కోసం వెళ్లగా అందులో నుంచి ఒకటి ఇంటికి తిరిగి రా లేదు. దాన్ని వెతికేందుకు గుట్టపైకి వెళ్లగా కళేబరం(నాలుగుకాళ్లు) కనిపించింది. దీంతో సూక్య భయంతో తండాకు వచ్చి గ్రామస్తుల ద్వారా సీరోలు ఎస్సై ప్రవీణ్‌కుమార్‌కు సమాచారం అందజేశారు. ఆయన వెంటనే గుట్టపైకి వచ్చి పరిశీలిం చి మహబూబాబాద్‌లోని డిప్యూటీ రేంజ్ అధికారి రాజేందర్‌కి సమాచారం అందించగా తన సిబ్బందితో సంఘటనా స్థలాని కి చేరుకున్నారు. మేక కళేబరాన్ని పరిశీ లించి చిరుతపులి కాదని నిర్ధారించుకుని హైనా అయి ఉంటుందని డిప్యూటీ రేంజ్ అధికారి తెలిపారు. హైనా తోడేలు జాతి కి చెందిన జంతువు అని వివరించి వెళ్లిపోయూరు. తండా గిరిజనులు ఎవరు భయపడవద్దని అటవీశాఖ అధికారులు చెప్పి వెళ్లిపోయూరు. అనంతరం అదే గుట్ట వద్ద పశువులపై జంతువు దాడికి యత్నించడంతో పశువుల కాపర్లు భయంతో పరుగులు తీశారు. పశువులు సైతం పరుగు లు తీశాయి. దీంతో తండావాసులు భ యంతో వణికిపోతున్నారు. జంతువును పట్టుకుని తండావాసులకు రక్షణ కల్పిం చాలని వేడుకుంటున్నారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారిలో బీట్ అధికారి పూ ల్య, సిబ్బంది మహేశ్, భాస్కర్, బిక్షపతి, పోలీస్ సిబ్బంది, తండావాసులు, మాజీ సర్పంచ్ జెర్రిపోతుల రంగన్నగౌడ్, మా జీఎంపీటీసీ చందూలాల్ ఉన్నారు. -
తిరుమల కొండపై చిరుత సంచారం
-
తిరుమలలో చిరుతల సంచారం
తిరుమల : తిరుమల కొండపై చిరుతల సంచారం ఎక్కువైంది. శనివారం రాత్రి తిరుమల కొండపైన ఉన్న ఓ కార్యాలయం గోడపై చిరుత కూర్చున్నట్లు సీసీ టీవీ ఫూటేజిలో రికార్డు కావడంతో.. ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రజలు నివసించే బాలాజీనగర్ సమీపంలో శనివారం రాత్రి చిరుతపులి ఓ దుప్పిని వేటాడిన ఆనవాళ్లు ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా చిరుతల సంచారం పెరిగినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
తిరుమలలో జట్టుగా చిరుతల సంచారం
తిరుమల : తిరుమలలో శుక్రవారం వేకువజామున జంట చిరుతలు జట్టుగా సంచరించాయి. ఇప్పటి వరకు నాలుగు చిరుతలు వేర్వేరుగా సంచరిస్తూ భక్తులను, స్థానికులను హడలెత్తించాయి. ప్రస్తుతం అవి జట్లుగా విడిపోయి సంచరించటం ప్రారంభించాయి. శుక్రవారం వేకువ జాము 4 గంటలకు స్థానిక రింగ్‌రోడ్డు నుంచి బాలాజీనగర్ వరకు రెండు చిరుతల జంటగా సంచరించాయి. వాటినే స్థానిక బాలాజీనగర్ ప్రాంతంలో స్థానికులు చూసి భయాందోళనకు గురయ్యారు. ఈ దృశ్యాలను అక్కడి స్థానికులు సెల్ఫోన్లలో చిత్రీకరించారు. కాలినడక మార్గాలతోపాటు తిరుమలలోనూ రోజూ చిరుతల సంచారం పెరిగింది. అయితే ఈ చిరుతల కట్టడి విషయంలో ఇటు టీటీడీ ఫారెస్ట్, అటు ప్రభుత్వ వైల్ట్‌లైఫ్ విభాగంలో ఏమాత్రం చలనం కనిపించటం లేదు. -
నిజామాబాద్ జిల్లాలో చిరుత కలకలం
సిరికొండ: నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం తల్లరమడుగు గ్రామంలో చిరుత సంచరిస్తుండటంతో.. గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. గ్రామంలోని ఒడ్డెర కాలనీ వద్ద ఆదివారం రాత్రి గొర్రెల మందపై దాడి చేసిన చిరుత ఓ గొర్రెను హతమార్చింది. గొర్రెల కొట్టం సమీపంలో చిరుత సంచరించిన ఆనవాళ్లు ఉండటంతో.. స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అధికారులు చిరుత పాద ముద్రలను పరిశీలిస్తున్నారు. కాగా.. చిరుత ఏ క్షణాన దాడి చేస్తుందో అని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు.