వైఎస్సార్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపింది
గాలివీడు(వైఎస్సార్ జిల్లా): వైఎస్సార్ జిల్లా గాలివీడు మండలం పూలకుంట గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపింది. మంగళవారం వేకువజామున గ్రామ సమీపంలో ఉన‍్న గొర్రెల మందపై చిరుత దాడిచేసింది. ఈ సంఘటనలో ఆరు గొర్రెలు మృతిచెందాయి. గొర్రెల మంద వద‍్ద కాపలా ఉన‍్న గొర్రెల కాపరులు చిరుతను చూసి భయాందోళనకు గురై పరుగుతీశారు. చిరుత ఆరు గొర్రెలను హతమార్చి సమీపంలోని అడవిలోకి వెళ్ళిపోయింది. అటవీశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.